Sudarsan Reddy
-
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి నోటీసులు
బోధన్‌రూరల్(బోధన్) : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమూద్‌లకు బోధన్ అస్లెంబీ నియోజకవర్గ ఎన్నికల రిట్ననింగ్ అధికారి గోపిరాం బుధవారం నోటిస్ జారీ చేశారు. ఈ నెల 19న సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా మహమూద్ ఆచన్‌పల్లి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ కోసం అనుమతులు కోరారు. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇచ్చిన అనుమతిని మించి బైక్ ర్యాలీ నిర్వహించారని, నిబంధనలను అతిక్రమించారని పేర్కొంటూ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు మహమూద్ లకు నోటీసులు జారీ అయ్యాయి. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. -
రబీ ఆశలపై నీళ్లు
కర్నూలు(కలెక్టరేట్/రూరల్), న్యూస్‌లైన్: కాల్వల కింద రబీ పంటల సాగుపై రైతన్న ఆశలను ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులు నీరుగార్చారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసినా, నదులు భారీగా ప్రవహిస్తూ ప్రాజెక్టులు నిండినా రబీ పంటలకు అత్తెసరు నీటితో సరిపెట్టేందుకు నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. రైతు ప్రయోజనాలపై చర్చించింది నామమాత్రమే అయినా.. వివిధ అంశాలపై ప్రజా ప్రతినిధులు నీటి పారుదల శాఖ అధికారులపై విరుచుకుపడ్డారు. జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలు ఉండగా మంత్రులతో కలిసి ఆరుగురు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. ఎల్లెల్సీ నీటి విడుదలపై సమావేశంలో వాడివేడి చర్చ సాగింది. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న నీటి చౌర్యంపై ఎల్లెల్సీ నీటి వాటా పరిరక్షణ కమిటీ సభ్యులు పి.సాయిబాబు తదితరులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎల్లెల్సీ కింద కౌతాళం, మంత్రాలయం ప్రాంతాల్లో మిరప, పత్తి లక్ష ఎకరాల్లో ఉందని, ఈ పంటలకు విధిగా డిసెంబర్ 15 వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అయితే అందుబాటులోని నీటితో మంచినీటి అవసరాలు తీరుస్తూ ఇప్పటికే వేసిన 50వేల ఎకరాల పంటలకు నీరిచ్చేందుకు మంత్రులు, అధికారులు అంగీకరించారు. అనంతపురం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు హెచ్ఎల్సీ నీటిని వాటా మేరకు రాబట్టుకుంటున్నారని, మన జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రం కోటా మేరకు నీటిని రాబట్టలేకపోతున్నారని.. ఇది చేతగాని తనమేనని సాయిబాబు తదితరులు ఘాటుగా విమర్శించారు. దీనిపై మంత్రి ఏరాసు స్పందిస్తూ ‘‘మేము చేతులు కట్టుకుని కూర్చోలేదు. ఈ విషయమై ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డితో చర్చించాం. దురదృష్టవశాత్తు కర్ణాటకలో ముగ్గురు, రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. ఇందువల్ల న్యాయం పొందలేకపోతున్నాం’ అన్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎంకు కూడా ఇదే విషయమే ప్రధానంగా చెప్పామని తెలిపారు. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రే ఉన్నా వెలుగోడు రిజర్వాయర్‌కు 3 టీఎంసీల నీరు తెచ్చుకోలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం డ్యాంలో పూర్తిగా నీరున్నా మన ప్రాంతానికి 3 టీఎంసీల నీరు తెచ్చుకోలేకపోయామన్నారు. ఎస్సార్బీసీ సర్కిల్-1 ఎస్ఈ, ఈఈ, హంద్రీనీవా అధికారులు, ట్రాన్స్‌కో అధికారులు గైర్హాజరు కావడంపై మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము పని లేక ఇక్కడికి వచ్చామా అంటూ గైర్హాజరైన వారికి చార్జి మెమోలు ఇవ్వాలని మంత్రులు టీజీ, ఏరాసులు కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి టీజీ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాలకు రూ.530 కోట్లు నిధులున్నాయని, ఇప్పటికే రూ.200 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వీటి ద్వారా 75 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ సుదర్శన్‌రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ సీఈ సుబ్బారావు, ఎస్ఈ నాగేశ్వరరావు, డీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, సీపీఓ ఆనంద్ నాయక్, జేడీఏ ఠాగూర్ నాయక్, కేసీ కెనాల్, ఎల్లెల్సీ, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, జీడీపీ తదితరులు పాల్గొన్నారు. -
విత్తనోత్పత్తి చేసుకోవాలి: సుదర్శన్‌రెడ్డి
ఆర్మూర్ టౌన్/ఆర్మూర్‌రూరల్, న్యూస్‌లైన్ : ఇతర రాష్ట్రాల నుంచి సోయాబిన్ విత్తనాలను దిగుమతి చేసుకోవడం కంటే ఇక్కడే విత్తనోత్పత్తి చేసుకోవడం ఉత్తమమని మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్‌లోని ఏపీ సీడ్స్ గోదాంలో ఏర్పాటు చేసిన సోయాబిన్ విత్తన శుద్ధి యంత్రాన్ని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, కలెక్టర్ పీఎస్ ప్రద్యు మ్న, జేసీ హర్షవర్ధన్‌లతో కలిసి ఆయన గురువారం పరి శీలించారు. అంకాపూర్లోని గురడిరెడ్డి సంఘంలో రైతులతో సమావేశమయ్యారు. కార్యక్రమాల్లో మంత్రి మా ట్లాడుతూ జిల్లాలోని రైతులు సోయాబిన్ విత్తనోత్పత్తి చేయడానికి ముందుకు రావాలన్నారు. ఉన్నతాధికారుల తో మాట్లాడి ఆర్మూర్, బోధన్‌లలో శుద్ధి యంత్రం, గోదాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో 108 గ్రామాల్లోనే రైతులు ఎర్రజొన్న పండిస్తారని, సీడ్ వ్యాపారులు డబ్బులు చెల్లించడంలో ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ నిర్వహించే ఎర్రజొన్నల టెండర్లలో రైతులు పాల్గొనేలా చూస్తానన్నారు. రూద్రూర్లోని సోయా మూల విత్తనాలతో 2011-12లో ఆర్మూర్‌లోని ఏపీ సీడ్స్‌లో సోయా విత్తనోత్పత్తి ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పినట్లు పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి చెప్పారు. గతేడాది 1,200 క్వింటాళ్ల సోయా విత్తనాలను, ఈ ఏడాది 2 వేల క్వింటాళ్ల విత్తనాలను శుద్ధి చేశామన్నారు. మన విత్తనాలతో అధిక దిగుబడి రాదన్న అపోహ రైతుల్లో ఉందన్నారు. వాస్తవానికి రుద్రూర్ పరిశోధనశాలలోని మూల విత్తనాలను మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లి విత్తనశుద్ధి చేసి, మనకే విక్రయిస్తున్నారన్నారు. ఈ యూనిట్లో రెండు మూడేళ్లలో పెద్ద ఎత్తున విత్తనశుద్ధి చేస్తామన్నారు. జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగులు అవసరమని గుర్తించామని కలెక్టర్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. ఆర్మూర్‌లో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగులను నిర్మించడానికి స్థలాన్ని కేటాయించి, నెల రోజులలో మంజూరు వచ్చేలా కృషి చేస్తానన్నారు. బోధన్‌లో.. బోధన్ రూరల్ : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకుగాను బోధన్ డివిజన్లో రెండుచోట్ల విత్తనోత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని మంత్రి సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం బోధన్ మార్కెట్ కమిటీలో విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్‌లో, బిచ్కుంద లేదా జుక్కల్ ప్రాంతాలలో సుమారు రూ. 30 లక్షలతో విత్తనశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
మీతో కాకుంటే చెప్పండి.. రెవెన్యూ అధికారిని నియమిస్తా..
కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : ‘జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు.. పరిపాలన గాడితప్పింది.. సమన్వ యం కొరవడింది.. మీతో కాకుంటే చెప్పండి..రెవె న్యూ అధికారిని నియమిస్తా..’అంటూ వైద్యాధికారులపై జిల్లా మంత్రి సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం మంత్రి జిల్లా ఆస్పత్రిలో వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలోని గైనిక్ సేవలు అందడంలేదని, వైద్యులు ఎంతమంది వరకు అవసరమని ప్రశ్నిం చారు. అవసరమైన వైద్యులను ఏరియా, పీహెచ్‌సీల నుంచి డిప్యూటేషన్‌పై తీసుకురావద్దని, అక్కడ సమస్యలు వస్తాయన్నారు. అవసరమైతే కాంట్రక్టు పద్ధతిన వైద్యులను నియమించాలని సూచించారు. తహశీల్దార్‌తో రోగుల వివరాలను తెప్పించుకొని, వైద్యులను ప్రశ్నించారు. కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరిం టెండెంట్లు కలిసి పనిచేయాలని, పరిపాలన సౌల భ్యానికి పనులను విభజించుకోవాలని సూచించారు. సస్పెండ్ చేస్తా.. అనంతరం మంత్రి మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. కళాశాలలో అసంపూర్తి పనులను పెండింగ్ పెట్టవద్దని, ఒకవేళ వినకపోతే ఈసారి సస్పెండ్ చేస్తానంటూ ఇంజినీరింగ్ అధికారి జయపాల్‌ను హెచ్చరించారు. విద్యార్థులకు అవసరమైన వాటిని వెంటనే సమకూర్చాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ప్రాక్టికల్ కోసం తిరుమల కళాశాల వారిని నియమించుకోవాలని సూచించారు. విద్యార్థులు భోజనం సక్రమంగా లేదని, చెప్పగా హోటల్‌ను ఎంపిక చేసి, మంచి భోజనం అందజేస్తామన్నారు. మెడికల్ కళాశాలకు మంజూరైన పోస్టులను 25 రోజుల్లో భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. -
పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు
సాక్షి, హైదరాబాద్: పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ర్ట సాగునీటి శాఖ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి చెప్పారు. అలాగే కాంట్రాక్టర్ల సమస్యలను కూడా తీరుస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల నిర్మాణ పనులపై మంత్రి శుక్రవారం సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రాణ హిత-చేవెళ్ల, కాళేశ్వరం, మిడ్‌మానేరు, ఎస్ఆర్ఎస్పీ-2, దేవాదుల, ఎస్ఎల్బీసీ, ఏఎంఆర్పీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, పులిచింతల వంటి ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉందని గుర్తుచేశారు. ప్రాజెక్టుల పనులు ఎందుకు పూర్తి కావడంలేదన్న అంశంపై ప్రత్యేక నివేదికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పులిచింతల, ఎల్లంపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటుందన్నారు. ఆయా ప్రాజెక్టుల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ప్రస్తావించిన సమస్యలను తక్షణం పరిశీలించి, పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. హంద్రీ-నీవా ఇంజనీర్లపై చర్యలు!: హంద్రీ-నీవా ప్రాజెక్టులో గతంలో పనిచేసిన కొందరు ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పనులలో చోటుచేసుకున్న అవకతవకలు.., వాటిపై సకాలంలో స్పందించనందుకు వీరిపై శాఖా పరమైన చర్యలను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చర్యలకు సిఫారసు చేసిన వారిలో ముగ్గురు ఏఈలు, ఇద్దరు ఈఈలు, ఒక డీఈ ఉన్నారు. -
అడ్వకేట్ జనరల్‌పై అసెంబ్లీ అంచనాల కమిటీ అసంతృప్తి
హైదరాబాద్: రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన రెడ్డి తీరుపై అసెంబ్లీ అంచనాల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అసెంబ్లీ కమిటీ హాలులో గత రెండు రోజులుగా ఈ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. వ్యవసాయ రంగానికి చెందిన పలు అంశాలను సమీక్షించారు. ప్రతి మార్కెట్ యార్డులో బహిరంగ షెడ్లు నిర్మించాలని కమిటీ ప్రభుత్వానికి సూచన చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలలో కేసుల పెండింగ్‌లో ఉండటానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వైఫల్యమే కారణమని అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత తొలిసారిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన సుదర్శన్ రెడ్డి అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడ్వకేట్ జనరల్ పదవి తొలిసారిగా సుదర్శన్ రెడ్డికి దక్కింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు, తెలంగాణ న్యాయవాదులు పదే పదే విమర్సలు చేయడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సుదర్శన్ రెడ్డిని 2011లో అడ్వొకేటే జనరల్‌గా నియమించారు.