కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : ‘జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు.. పరిపాలన గాడితప్పింది.. సమన్వ యం కొరవడింది.. మీతో కాకుంటే చెప్పండి..రెవె న్యూ అధికారిని నియమిస్తా..’అంటూ వైద్యాధికారులపై జిల్లా మంత్రి సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం మంత్రి జిల్లా ఆస్పత్రిలో వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలోని గైనిక్ సేవలు అందడంలేదని, వైద్యులు ఎంతమంది వరకు అవసరమని ప్రశ్నిం చారు. అవసరమైన వైద్యులను ఏరియా, పీహెచ్‌సీల నుంచి డిప్యూటేషన్‌పై తీసుకురావద్దని, అక్కడ సమస్యలు వస్తాయన్నారు. అవసరమైతే కాంట్రక్టు పద్ధతిన వైద్యులను నియమించాలని సూచించారు. తహశీల్దార్‌తో రోగుల వివరాలను తెప్పించుకొని, వైద్యులను ప్రశ్నించారు. కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరిం టెండెంట్‌లు కలిసి పనిచేయాలని, పరిపాలన సౌల భ్యానికి పనులను విభజించుకోవాలని సూచించారు.
సస్పెండ్ చేస్తా..
అనంతరం మంత్రి మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. కళాశాలలో అసంపూర్తి పనులను పెండింగ్ పెట్టవద్దని, ఒకవేళ వినకపోతే ఈసారి సస్పెండ్ చేస్తానంటూ ఇంజినీరింగ్ అధికారి జయపాల్‌ను హెచ్చరించారు. విద్యార్థులకు అవసరమైన వాటిని వెంటనే సమకూర్చాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ప్రాక్టికల్ కోసం తిరుమల కళాశాల వారిని నియమించుకోవాలని సూచించారు. విద్యార్థులు భోజనం సక్రమంగా లేదని, చెప్పగా హోటల్‌ను ఎంపిక చేసి, మంచి భోజనం అందజేస్తామన్నారు. మెడికల్ కళాశాలకు మంజూరైన పోస్టులను 25 రోజుల్లో భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు.
మీతో కాకుంటే చెప్పండి.. రెవెన్యూ అధికారిని నియమిస్తా..
Published Thu, Nov 7 2013 4:57 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement