
పి సుదర్శన్ రెడ్డి
బోధన్‌రూరల్(బోధన్) : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమూద్‌లకు బోధన్ అస్లెంబీ నియోజకవర్గ ఎన్నికల రిట్ననింగ్ అధికారి గోపిరాం బుధవారం నోటిస్ జారీ చేశారు. ఈ నెల 19న సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా మహమూద్ ఆచన్‌పల్లి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ కోసం అనుమతులు కోరారు.
అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇచ్చిన అనుమతిని మించి బైక్ ర్యాలీ నిర్వహించారని, నిబంధనలను అతిక్రమించారని పేర్కొంటూ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు మహమూద్ లకు నోటీసులు జారీ అయ్యాయి. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment