పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు | Contractors face action for unfinished work | Sakshi
Sakshi News home page

పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు

Published Sat, Nov 2 2013 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు

పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు

 సాక్షి, హైదరాబాద్: పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ర్ట సాగునీటి శాఖ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి చెప్పారు. అలాగే కాంట్రాక్టర్ల సమస్యలను కూడా తీరుస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల నిర్మాణ పనులపై మంత్రి శుక్రవారం సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రాణ హిత-చేవెళ్ల, కాళేశ్వరం, మిడ్‌మానేరు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ-2, దేవాదుల, ఎస్‌ఎల్‌బీసీ, ఏఎంఆర్‌పీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, పులిచింతల వంటి ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది.
 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉందని గుర్తుచేశారు. ప్రాజెక్టుల పనులు ఎందుకు పూర్తి కావడంలేదన్న అంశంపై ప్రత్యేక నివేదికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పులిచింతల, ఎల్లంపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటుందన్నారు. ఆయా ప్రాజెక్టుల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ప్రస్తావించిన సమస్యలను తక్షణం పరిశీలించి, పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
 
 హంద్రీ-నీవా ఇంజనీర్లపై చర్యలు!: హంద్రీ-నీవా ప్రాజెక్టులో గతంలో పనిచేసిన కొందరు ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పనులలో చోటుచేసుకున్న అవకతవకలు.., వాటిపై సకాలంలో స్పందించనందుకు వీరిపై శాఖా పరమైన చర్యలను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చర్యలకు సిఫారసు చేసిన వారిలో ముగ్గురు ఏఈలు, ఇద్దరు ఈఈలు, ఒక డీఈ ఉన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement