మోర్తాడ్, న్యూస్‌లైన్: తెలంగాణకు తాము వ్యతిరేకం కాదంటూనే రాష్ట్రాన్ని విభజించవద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలకు ఏ డిక్షనరీలోనూ అర్థం దొరకడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. తె లంగాణ జాగృతి జిల్లా మాజీ అధ్యక్షుడు సునీల్‌రెడ్డి పార్టీలో చేరుతున్న సందర్భంగా బుధవారం మోర్తాడ్‌లో నిర్వహించిన బీజేపీ సమర శంఖారావసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు.
తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే రాష్ట్ర విభజనకు అంగీకరించబోమని చెప్పటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సీ మాంధ్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి సిగ్గుమానం ఉంటే పదవికి రా జీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు బీజేపీ కట్టుబ డి ఉందని మరోమారు స్పష్టం చేశారు. చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, సాగు, తాగునీటి సమస్యలు ఉండవన్నారు. ఇప్పుడు దేశమంతా మోడీ గాలి వీస్తోందని, ఈ దెబ్బకు కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తుందన్నారు.
గుజరాత్ లాగే దేశాభివృద్ధి -యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ శాసనసభ పక్షనేత
నరేంద్రమోడీ నాయకత్వంలో గుజరాత్‌లాగే దేశమంతా అభివృద్ధి కానుందని, బీజేపీ అధికారంలోకి వస్తే రైతుఆత్మహత్యలు ఉండవని బీజేపీ శాసనసభ పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ అన్నారు. గుజరాత్ నుంచి టమాటలు పలు దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, కచ్ ఎడారిలో పరిశ్రమలు స్థాపించి విద్యుత్, నీటి సౌకర్యాన్ని అందించిన ఘనత నరేంద్రమోడీకి దక్కుతుందన్నారు. ఆయన ప్రధాని అయితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
బీజేపీలోకి సునీల్‌రెడ్డి
సమర శంఖరావం సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా మాజీ అధ్యక్షుడు సునీల్‌రెడ్డి బీజేపీలో చేరగా, ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కండువా వేసి ఆహ్వానించారు. సభకు బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జీ రుయ్యాడి రాజేశ్వర్ అధ్యక్షత వహించారు. పార్టీ నాయకులు లోక భూపతిరెడ్డి, పెద్దోల్ల గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, ఆలూరు గంగారెడ్డి, కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, డాక్టర్ భూపతి రెడ్డి, అమృతలతారె డ్డి, నాంచారి శైలజ, గడ్డం ఆనంద్‌రెడ్డి, టక్కరి హన్మం త్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్, ఢమాంకర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘బాబు’కు రెండు నాల్కలు
Published Thu, Feb 6 2014 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
Advertisement
Advertisement