telugudesam
-
Babu Case : లోకేషా.. ఈ ప్రశ్నలకు జవాబేదీ?
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రకటనలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన ప్రకటనలేంటీ? వాటి అంతరార్థమేంటీ? లోకేష్ : తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటిది. సిద్ధమవడానికి సమయం పడుతుంది. సందేహాలు : పార్టీని ఏనుగులా పోల్చడమేంటీ? అసలు ఏనుగు అనడంలో లోకేష్ ఉద్దేశ్యమేంటీ? ఎవరూ కదలలేకపోతున్నారనా? లేక పార్టీ బలంగా ఉందని చెప్పడమా? తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఏనుగే అనుకుంటే, సిద్ధమవడానికి సమయం పడుతుందనుకొందాం. కానీ తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చింది కాదు కదా. దాదాపు 40 ఏళ్లుగా ఉన్న ఒక పార్టీలో చంద్రబాబు అనే ఒకే ఒక వ్యక్తి అవినీతి పాలయి జైల్లోకి వెళ్లాడు. ఒక్క అరెస్ట్‌తోనే పార్టీ తలకిందులయిందన్నది లోకేష్ ఉద్దేశ్యమా? లేక పార్టీ నిద్రాణంగా ఉందన్న భావనలో ఉన్నారా? లోకేష్ : చేయని తప్పుకు శిక్షించే వ్యవస్థ ఉండకూడదన్న ఉద్దేశ్యంతో, ఆ వ్యవస్తను మార్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. సందేహాలు : లోకేష్ రాజకీయాల్లోకి 2014 తర్వాత వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకుంటున్న లోకేష్ ముందెక్కడ పోటీ చేయలేదు. అప్పటికే పార్టీ అధికారంలో ఉంది. తండ్రి ముఖ్యమంత్రి కావడంతో లోకేష్ నేరుగా ఎమ్మెల్సీ అయ్యాడు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. పార్టీ చెప్పుచేతల్లో ఉంది కాబట్టి జాతీయ కార్యదర్శి పదవి తీసుకున్నాడు. అధికారం తమదే కాబట్టి క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు. అంతే తప్ప.. ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేసి పదవులు సాధించుకోలేదు. తెలుగు రాజకీయాలను భ్రష్టు పట్టించి ఓటుకు కోట్లు కెమెరాల సాక్షిగా ఇస్తూ అడ్డంగా దొరికి, లంచం ఇవ్వడం తప్పు కాదని వాదించే మీలాంటి నాయకులు ఉండడం వల్లే రాజకీయాల్లోకి కొత్తగా ఎవరూ రావడం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే.., లోకేష్ రాజకీయాల్లోకి వచ్చేసమయంలో లోకేష్ గానీ, లోకేష్ తండ్రి చంద్రబాబు గానీ జైల్లో లేరు. నిజానికి ఆ సమయంలో చేయని తప్పుకు కేసులు పెట్టి జైలుకు పంపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. కాంగ్రెస్ కక్ష కడితే, దానికి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం వంత పాడి కేసుల్లో ఇంప్లీడ్ అయి తప్పుడు అభియోగాలు బనాయించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించారు. ఈ కేసులు తప్పని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే.. 2014లో 67 స్థానాలు, 2019లో 151 స్థానాలు కట్టబెట్టారు. అంటే లోకేష్ చెప్పే అరెస్ట్ ఇదేనా.? తాము అక్రమంగా అరెస్ట్ చేసి పంపామన్న అపరాధన భావనలో ఉన్నాడా? లోకేష్ : మేం ఎనిమిదేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నాం. మాకు హైదరాబాద్/సైబరాబాద్‌లో ఎకరం జాగా లేదు. అసలు నిజాలు : లోకేష్, చంద్రబాబు ఆస్తుల వెల్లడి అన్న కార్యక్రమం ఎంత కామెడీనో తెలుగు ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్‌లో కట్టిన రాజసౌధం విలువ లక్షల్లోచూపిస్తావు. ఏంటంటే.. కొన్నప్పుడు అంతే ఉందంటావు. ఇక అసలు మాకు ఒక్క గజం భూమి ఉన్నా.. ఇచ్చేస్తానంటావు. మరి మదీనాగూడలో 14 ఎకరాల్లో ఉన్న ఫాంహౌజ్ సంగతేంటీ? అంత ఖరీదైన లోకేషన్లో అంత భూమి ఎలా వచ్చింది? ఖరీదైన స్థలాలన్నీ మీ నానమ్మ నీ ఒక్కరికే ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది? ఇందులో క్విడ్ ప్రో కోల గురించి ఎప్పుడైనా వివరణలిస్తావా? దీని గురించి వేసిన కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు? మీకు, మీ కొడుకు దేవాన్ష్ కు ఇచ్చిన బహుమతులు అమ్మణ్ణమ్మ, బాలకృష్ణ ఐటీ రిటర్నులు, ఎన్నికల అఫిడవిట్లలో ఎందుకు లేవు? లోకేష్ : మా నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మా సంస్థ హెరిటేజ్ నిదానంగా ఎదిగింది. లేదంటే సంస్థ విలువ ఇప్పటికీ మూడు రెట్లు పెరిగేది. అసలు నిజాలు : హెరిటేజ్ విలువ ఎంత? ఆ సంస్థ అంచలంచెలుగా ఎలా ఎదిగింది అన్నది చిత్తూరు నుంచి విజయనగరం వరకు ఎవరిని అడిగినా చెబుతారు. పదవిని అడ్డు పెట్టుకుని హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని దివాళా తీయించినప్పుడే వ్యవస్థలను ముంచే మీ ప్రతిభ అర్థం చేసుకోవాలి. అయినా హెరిటేజ్ అసలు లెక్కలు ఎప్పుడయినా బయటపెట్టారా? ఇందులో మీ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరయినా కీలక స్థానాల్లో ఉన్నారా? ఈ మధ్యే మీ అమ్మ భువనేశ్వరీ ఏం చెప్పారు? మా సంస్థ హెరిటేజ్‌లో 2% షేర్లు అమ్మినా మాకు రూ.400 కోట్లు వస్తాయన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం మీ సంస్థ విలువ రూ.20వేల కోట్లు. కేవలం పాలు, డెయిరీ ప్రొడక్ట్‌లు, సూపర్ మార్కెట్ల ద్వారా రూ.20వేల కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మానవ మాత్రుడు ఎవరయినా ప్రపంచంలో ఉంటారా? మీరు తప్ప. ఇందులో అక్రమ సంపాదన ఎంత? వ్యవస్థలను ముంచిందెంత? మీ సంస్థ బాగు కోసం ఎవరెవరిని తొక్కేశారు. కొంచెం లెక్కలు వివరంగా చెబితే అందరూ నోళ్లు వెల్లబెట్టి వింటారు. లోకేష్ : రాజకీయాల్లోకి బ్రాహ్మణి రావడం ఆమె ఇష్టం. మేం మా దారులు ఎంచుకొన్నాం. అసలు నిజమేంటీ : పార్టీ లోడు నువ్వెత్తడం లేదని విషయం స్పష్టమయిన తర్వాతే మీ నాన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను ఎంచుకున్నారని తెలుగుదేశంలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గత మూడు వారాలుగా మీకు సంబంధించిన ఎల్లో మీడియాలోనే బ్రాహ్మణి పేరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మణి రావాలి, పాదయాత్ర చేయాలి, పార్టీని నడిపించాలని ప్రచారం చేస్తున్నారు. అంటే దానర్థమేంటన్నది మీ స్టాన్ఫోర్డ్ బ్రెయిన్‌కు అర్థం కానంత గొప్పదేం ఉండదు. మీరు తారా స్థాయిలో రాజకీయాలు నడిపితే బ్రాహ్మణి పేరు ముందుకు ఎందుకు వస్తుంది? హెరిటేజ్ సంస్థను విడిచిపెట్టి బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలి అని పచ్చమీడియా పిచ్చిగా ప్రచారం చేస్తోందంటే ఇంతకు మించిన అర్థం ఇంకేముంటుంది? (Courtesy : Nidhi) లోకేష్ : స్కిల్ డెవలప్మెంట్, రింగ్‌రోడ్డు అక్రమ అలైన్మెంట్, ఫైబర్ గ్రిడ్.. ఈ మూడు ప్రాజెక్టులు నా మంత్రిత్వ పరిధిలోనివి కావు, కాబట్టి వాటికి నేను బాధ్యుడిని కాదు సందేహాలేంటీ : మొన్నటి వరకు ఏం వాదించారు.? బ్యాంకు మేనేజర్ తప్పు చేస్తే బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్ చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు. అంటే అర్థమేంటీ? తప్పు జరిగింది కానీ మాది బాధ్యత కాదంటున్నావు. ఇక ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన శాఖలకు కూడా నేను మంత్రిగా పని చేయలేదంటున్నావు. అంటే అర్థమేంటీ? కుంభకోణం జరిగింది కానీ నా ప్రమేయం ప్రత్యక్షంగా లేదని అర్థమా? స్కిల్ డెవలప్మెంట్ మీ నాన్న శాఖలోనిది అయితే మీ ప్రమేయం అంతగా ఎందుకుంది? ఫైబర్ గ్రిడ్‌కు మీకు సంబంధం లేకుంటే.. మీవైపే అన్ని ఆధారాలు ఎందుకు చూపిస్తున్నాయి? మీ సంస్థ భూములు రింగ్‌రోడ్డు చుట్టే భూములు కొనాలని మీకు కలలో ఐడియా వచ్చిందా? పైగా మీ బెయిల్ పిటిషన్లో మీ అడ్వొకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏం వాదించారు? కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌజ్‌లో తండ్రి చంద్రబాబుతో కలిసి ఉన్నందుకు నాపై కేసు ఎలా పెడతారని కోర్టు ముందు వాదించారు. అంటే మునగాల్సి వస్తే తండ్రిని కూడా వదిలేస్తారా? ఇవేనా మీరు నేర్చుకున్న కుటుంబ విలువలు? అసలు నోటీసులు రాకముందే ఢిల్లీకి ఎందుకు వెళ్లిపోయారు? సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడాల్సిన మంతనాలకు ఇన్ని రోజులు పడుతుందా? అయినా న్యాయశాస్త్రంలో మీరేమీ డాక్టరేట్ చేయలేదు కదా.. మీకున్న ప్రతిభకు సాల్వే, లూథ్రా లాంటి సీనియర్ లాయర్లకు ఏం సూచనలు చేస్తారు? రాజమండ్రిలో కుటుంబాన్ని వదిలేసి ఢిల్లీ హోటళ్లలో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టేకంటే.. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండడం మిమ్మల్ని నాయకుడిగా నిలిపేది కదా. పైగా నన్ను అరెస్ట్ చేసే అవకాశముంది కాబట్టి ఏపీ నుంచి ఢిల్లీ వచ్చానని నిజాయతీగా చెబితే సగటు తెలుగు ప్రజలకు కనీసం సానుభూతి అయినా వచ్చేది కదా. ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్సయ్యారు? -
Chandrababu : చేతులు కలపడమే తరువాయి.?
చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రయాణంలో స్పష్టత వస్తున్నట్టు సంకేతాలందుతున్నాయి. ఇక తన ప్రయాణం కాంగ్రెస్‌తోనే కొనసాగించాలని బాబు నిర్ణయించుకున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీతో ఇప్పటికే పూర్తిగా తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు.. ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్‌షాను టార్గెట్ చేసుకుని 2019లో చేసిన యాంటీ బీజేపీ క్యాంపెయిన్ ఇంకా ప్రజల మదిలో చెదిరిపోలేదు. గత నాలుగున్నరేళ్లుగా పైకి బీజేపీతో దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా.. లోలోన మాత్రం కాంగ్రెస్‌తో నడుపుతున్న రాయబారాలు బహిర్గతమవుతున్నాయి. సీన్ 1 : 2019 ఎన్నికలు - జాతీయ రాజకీయాలు ఎన్నికల్లో యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఉదయం తూర్పున బెంగాల్లో మమతో ఒక భేటీ జరిగితే, మధ్యాహ్నానికల్లా ముంబైలో శరద్ పవార్‌తో మరో భేటీ నిర్వహించారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలిస్తే.. అంతే వేగంగా కేరళలో కమ్యూనిస్టులతో భేటీ అయ్యారు. చంద్రబాబు స్పీడ్ చూసి నేషనల్ మీడియా కూడా అవాక్కయిన సందర్భాలు 2019లో ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులయితే సరే సరి. రాహుల్‌తో 10 జన్‌పథ్‌లో నిర్వహించిన మీటింగ్‌కు ఎల్లో మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అంతెందుకు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారంలో సభ మీద రాహుల్‌తో చట్టాపట్టాల్ వేసుకున్నవి కూడా ఇంకా ఇప్పుడే చూసినట్టు ఉంది. (కర్ణాటక రాజకీయాల సందర్భంగా చంద్రబాబు తిప్పిన యూపీఏ చక్రం) సీన్ 2 : 2019 ఫలితాలు - తదనంతర పరిణామాలు ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు వెల్లడయింది. సైకిల్ కొట్టుకుపోయింది. చంద్రబాబులో నిర్వేదం ఏర్పడింది. ఇంతా చేసినా.. ప్రజలెందుకు తరిమికొట్టారన్న ఆత్మవిమర్శ మాత్రం చేసుకోలేకపోయారు. తనను ఓడించి ప్రజలు ద్రోహం చేశారంటూ నిందించడం మొదలెట్టారు. అదే సెల్ఫ్ డబ్బా.. ఈ రోడ్డు నేనేశా.. ఈ భవనం నేను కట్టా.. ఈ కాలువ నేను తవ్వించా.. ఎంత సేపు నేను అనే సోత్కర్ష నుంచి బయటకు రాలేకపోయారు. చివరికి భ్రమలనే నిజమనే స్థాయికి చేరిపోయారు. ఈ సమయంలో ఎల్లో మీడియా వల్ల ఆయనకు నిజంగానే అన్యాయం జరిగింది. ఉదాహారణకు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ హయాంలో అని తెలిసినా.. చంద్రబాబే .. చంద్రబాబే అని ప్రచారం చేసి అదే నిజమని ప్రజల్ని నమ్మించే స్థాయికి చేరారు. అంతెందుకు హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టును దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మిస్తే.. ఆ క్రెడిట్ చంద్రబాబుకు ఇచ్చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే.. పెద్దలా గద్దలా అంటూ ఈనాడులో విమర్శలు చేసి... ఇప్పుడు జన జీవన నాడిగా మారిన తర్వాత చంద్రబాబుకు క్రెడిట్ ఇస్తున్నారు. ఇలా మారని భ్రమలతో ఆయన వ్యక్తిత్వ పరంగా మరింత దిగజారారు. (జపాన్ సహకారంతో టెక్నాలజీ పార్కును శంకుస్థాపన చేస్తున్న నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఆ సందర్భంగా మీడియాలో వచ్చిన వార్తలు) (శంషాబాద్ ఎయిర్‌పోర్టును, PV నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి పూర్తి చేసిన డా.వైఎస్సార్) సీన్ 3 : పార్టీ నిర్మాణంలో ఎన్నో లోపాలు తానొక విజనరీ నాయకుడినని, విజన్ 2020 తర్వాత విజన్ 2047 తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తెలుగుదేశం పార్టీని ఒక నిష్క్రియాత్మకమైన వ్యవస్థగా మార్చారు. ఏ పార్టీలోనయినా పిరమిడ్ లెవల్ ఉంటుంది. అంటే ఒక నాయకుడి తర్వాత అంతటి బాధ్యతలు నిర్వహించగలిగే సత్తా ఉన్నా ఇద్దరో, ముగ్గురో ఉంటారు. మేనేజ్మెంట్ పాఠాలను వల్లె వేసే చంద్రబాబుకు ఈ విషయాలన్నీ తెలియవని కాదు. తెలుగుదేశం పార్టీలో తీసుకునే ఏ నిర్ణయమైనా చంద్రబాబుకు తప్ప మూడో కంటికి తెలియదు. తన వారసుడిగా లోకేష్‌ను ప్రొజెక్ట్ చేయాలని చూసినా.. ఎమ్మెల్యేగా గెలవలేని ప్రతిభాసామర్థ్యాలు లోకేష్‌వి. ఇక పవన్‌కళ్యాణ్‌కు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా.. ఏ ఎజెండాలో సక్సెస్ అయిన దాఖలాలు లేవు. (తన పొలిటికల్ పార్ట్నర్ పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు ) సీన్ 4 : కిం కర్తవ్యం.. కాంగ్రెసే శరణ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు ఉన్న ఏకైక మార్గం కాంగ్రెస్. అందుకే తన శిష్యుడు రేవంత్ రెడ్డిని నమ్ముకున్నారు. చంద్రబాబును కాపాడేందుకు ఇప్పటికే రేవంత్‌రెడ్డి రాయబారం నడుపుతున్నారు. బాబును కాపాడేందుకు ఏం చేయాలన్న దానిపై రేవంత్‌రెడ్డి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తాను అరెస్ట్ అవుతానంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబుతో డీకే శివకుమార్‌తో రేవంత్ ఫోన్ చేయించినట్టు కథనంలో పేర్కొంది. బాబు తరఫున ఏసీబీ కోర్టులో వాదించిన న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాకు డీకేతో మంచి సంబంధాలున్నాయి. డీకేకు ఆయన అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. డీకే సిఫారసుతోనే బాబు కేసులో లూథ్రా రంగంలోకి దిగారు. అయితే కేసు పక్కాగా ఉండడం, ఆధారాలు బలంగా ఉండడంతో లూథ్రా కాస్తా నిర్వేదంలో పడిపోయారు. (చంద్రబాబును రక్షించేందుకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో రేవంత్ మంతనాలు) సీన్ 5 : ఇండియా కూటమి వైపు సైకిల్ తాజా పరిణామాలతో రేపో, మాపో ఇండియా కూటమి దిశగా సైకిల్ వెళ్తోందని తేలిపోయింది. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా అధికారంలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు కూడా పవన్‌తో పొత్తు ప్రకటించేశారు. బీజేపీ ఈ పరిణామాలపై గుర్రుగా ఉంది. ఇక మిగిలింది కాంగ్రెస్. రాహుల్‌తో తనకు చక్కటి సమన్వయం, అంతకు మించిన పరిచయం ఉన్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే.. కాంగ్రెస్ నుంచి ఓ స్టెప్పు ముందుకు పడవచ్చు. జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో రాహుల్‌గాంధీ కలవొచ్చు. లేదా తన ప్రతినిధిగా డీకే శివకుమార్ గానీ, కపిల్‌సిబల్‌ను కానీ పంపించవచ్చు. ఇటు ఢిల్లీలో కూడా లోకేష్ ఓ చీకటి వేళ ఒకరిద్దరు కాంగ్రెస్ అగ్రనాయకులతో భేటీ కావొచ్చు. ఇప్పటికే రఘురామకృష్ణరాజుతో కలిసి ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. (ఢిల్లీలో రఘురామకృష్ణరాజుతో కలిసి ఎడతెగని ప్రయత్నాలు చేస్తోన్న లోకేష్) సీన్ 6 : కథ సశేషం.. మిగిలింది ఉత్కంఠభరితం ఎన్నికలు వడివడిగా వస్తున్నాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ వైఎస్సార్సిపి మొదటి నుంచి చెబుతున్న విషయం. ఇప్పుడు పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని పంచుకున్నారు. ఈ రాజకీయ ముఖచిత్రం త్వరలోనే సుస్పష్టంగా ఆవిష్కృతం కానుంది. దానికి ప్రజలే సాక్షి. Only the I.N.D.I.A. Alliance members are supporting Sri. Chandrababu @ncbn through phone calls to his son. This proves that TDP is part of the I.N.D.I.A. Alliance and that they have the same strategy, come together for power and loot the State while you can. TDP is incapable of… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2023 -
టీడీపీ కట్టల్లోకి వైఎస్సార్సీపీ ఓట్లు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో తీవ్ర తప్పిదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసిన ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండిల్స్‌లో కలిపారు. 8వ రౌండు ఓట్ల లెక్కింపులో 19వ టేబుల్ వద్ద ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని గమనించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఓట్లను తిరిగి లెక్కించగా ఆరు ఓట్లు టీడీపీ కట్టలో కలిశాయని స్పష్టమైంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా ఎన్ని ఓట్లను ఇలా కలిపారోనన్న అనుమానం ఉందని, మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలని రిటర్నింగ్ అధికారి కేతన్‌గార్గ్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ కూడా రాశారు. ఇంతమంది కౌంటింగ్‌లో ఉన్నప్పుడే ఇలా తమ ఓట్లను టీడీపీ ఖాతాలో కలిపేయడం దారుణమన్నారు. తొలి, రెండో రౌండులో వెయ్యి ఓట్లకు పైగా మెజారిటీ వస్తే, మూడో రౌండు నుంచి 20, 30 ఇలా తూకమేసినట్టు మెజారిటీ రావడంపైనా అనుమానాలున్నాయన్నారు. కాగా, ఒకసారి కౌంటింగ్ పూర్తయి బండిల్స్‌ను కలిపేస్తే తిరిగి లెక్కించడం కుదరదని, అభ్యంతరం వ్యక్తం చేసిన ఏ బాక్స్ అయినా తిరిగి లెక్కిస్తామని రిటర్నింగ్ అధికారి చెప్పారు. -
పొలిటికల్ కారిడార్: కాకినాడలో అభ్యర్థి కోసం టీడీపీ పాట్లు..
-
దేవుళ్లకూ కులం ఆపాదనా...!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా తెలుగుదేశం నేతల తీరుపై విసిగివేసారిన ప్రజలు తాజాగా ఆపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యానాలతో అవాక్కవుతున్నారు. అధినేత చంద్రబాబు సహా ఇతర నేతలు గత కొంతకాలంగా రాష్ట్రంలో ప్రజలను కులాలు, మతాలుగా చీలుస్తూ చేస్తున్న ప్రసంగాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వీటిపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ మినీమహానాడులో ఆ పార్టీ ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి అంటూ సంబోధించడాన్ని చూసి హవ్వ అంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం అగ్రనేతలు కులాల వారీగా ప్రస్తావనలు చేస్తూ వివిధ వర్గాల పట్ల తమ మనసులోని వైఖరిని బయట పెట్టుకుంటుండగా చివరకు దేవుళ్లకూ ఈ కులాల గొడవను అంటగట్టడమేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఎన్ని మతలబులు చేసిందో అందరికీ తెలిసిందేనని, అయినా ఆపార్టీకి మెజార్టీ రాకుండా ఆగడానికి కారణం... మా ‘వెంకన్న చౌదరియే’నని వ్యాఖ్యానించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలురకాల సెటైర్లతో కూడిన వ్యాఖ్యలు, చిత్రాలు వెల్లువెత్తాయి. దీనికి తోడు ఆపార్టీ అధినేత చంద్రబాబు ఇంతకు ముందు ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఏకంగా మీడియా సమావేశంలోనే మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ద్వారకా తిరుమలలో స్పీకర్ కోడెల చౌదరి కూడా మన కమ్మోళ్లే ఎప్పుడూ అధికారంలో ఉండాలని, అందుకు మనోళ్లంతా కష్టపడాలని చెప్పారంటూ విమర్శలు వచ్చాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటూ చంద్రబాబు, ఇతర నేతల తీరుపై విమర్శలు సామాజిక మాద్యమాలలో వెల్లువెత్తుతున్నాయి. మనసులో మాటలూ వచ్చేస్తుంటాయి... గతకొంతకాలంగా టీడీపీ నేతల ప్రసంగాల్లో వారి మనసులో మాటలు బయటపెడుతున్నారని పలువురు సామాజిక మాధ్యమాల్లో పేర్కొంటున్నారు. ‘అవినీతి, కులప్రీతి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీనే. సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఉరివేసుకున్నటే’ అంటూ గతంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పేర్కొనడాన్ని, భారతదేశాన్ని అవినీతి దేశంగా మార్చేవరకు నిద్రపోనని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను వారు గుర్తుచేస్తున్నారు. -
వికటించిన బీజేపీ,టీడీపీల స్నేహం
► పొత్తు ధర్మాన్ని విస్మరించి పలు చోట్ల రెండు పార్టీల బీ-ఫారాలు ► బీజేపీకి కేటాయించిన 5 చోట్ల టీడీపీ, ► టీడీపీ పోటీ చేసే 5 స్థానాల్లో బీజేపీ బీ-ఫారాలు ► చివరి నిమిషంలో టీడీపీ చర్యకు బీజేపీ ప్రతిచర్య సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం-బీజేపీల పొత్తు వికటించింది. తమకు బలమున్న చోట సీట్లు ఇవ్వలేదని విమర్శించుకున్న రెండు పార్టీలు చివరి నిమిషంలో పొత్తు ధర్మాన్ని వీడాయి. నామినేషన్ల ఉపసంహరణ, బీ-ఫారాలు సమర్పించేందుకు ఆఖరి రోజైన గురువారం రెండు పార్టీలు తమకు బలమున్న చోట్ల అభ్యర్థులను పోటీకి నిలిపాయి. కూటమి పొత్తులో భాగంగా గ్రేటర్‌లోని 150 సీట్లలో టీడీపీ - 87, బీజేపీ- 63 వార్డులకు పోటీ చేయాలనుకున్న విషయం తెలిసిందే. గురువారం బీ-ఫారాలు అందించేందుకు చివరి రోజు గడువు కావడంతో చివరి నిమిషంలో బీజేపీకి కేటాయించిన సీట్లలో 5 చోట్ల తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే బీజేపీ నేతలు కూడా స్పందించారు. తమ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న టీడీపీ పోటీ చేస్తున్న ఐదు డివిజన్లలో తమ అభ్యర్థులను నిలిపి బీ-ఫారాలు అందజేశారు. దీంతో రెండు పార్టీల పొత్తు తొలిదశలోనే 10 చోట్ల విచ్ఛిన్నమైంది. దీనిపై వ్యాఖ్యానించేందుకు టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి, నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఫోన్లో అందుబాటులోకి రాలేదు. టీడీపీ నగర నాయకుడి ఓవర్ యాక్షన్ కారణంగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీ పీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 92 చోట్ల పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ఎన్నికల సంఘానికి వివరిస్తూ, తాజా జాబితాను అందజేశారు. చివరి నిమిషంలో టీడీపీ బీఫారాలు జారీ చేసిన స్థానాలు: అడిక్‌మెట్, అమీర్‌పేట, సుభాష్‌నగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్ బీజేపీ బీఫారాలు ఇచ్చిన సీట్లు: హబ్సిగూడ, రెహమత్నగ ర్, బి.ఎన్.రెడ్డినగర్, పటాన్చెరు, జీడిమెట్ల -
ఇది మోసం కాదా?
రైతులు, డ్వాక్రా రుణాల మాఫీపై మాట మార్చిన చంద్రబాబు రుణాలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూసిన రైతుల నోట్లో మట్టి హైదరాబాద్: గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం భయపడుతున్నదే జరిగింది. అధికారంలోకి వచ్చీ రాగానే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన తొలి సంతకంతోనే రైతాంగాన్ని నిండా ముంచారు.ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి గడిచిన 45 రోజులుగా రుణ మాఫీపై రకరకాల సాకులు చెబుతూ కాలయాపన చేసిన చంద్రబాబు సోమవారం అడ్డంగా మాటమార్చారు. రైతులను నిలువునా ముంచారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీసుకున్న రుణాలు మొత్తం రూ.87,612 కోట్లు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ రికార్డులు చెబుతున్న అధికారిక లెక్కలే. అలాగే రూ.14,204 కోట్ల మేరకు డ్వాక్రా రుణాలున్నాయి. రెండూ కలిపి 1 లక్షా 1816 కోట్ల రూపాయలు ఉండగా వాటన్నింటినీ మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన క్షణం నుంచి మాట మార్చుతూ వచ్చారు. తీరా సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో రైతులను నిలువునా ముంచే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో రుణ మాఫీపై చర్చించిన అనంతరం సీఎం స్వయంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు కలిపి రూ.30 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల మేరకు రుణ మాఫీ చేస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు ఆయన ప్రతి సభలోనూ రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఊరూవాడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆరోజుల్లో ఎలాంటి పరిమితులు, ఆంక్షల గురించి చెప్పకపోగా, వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ ఏదో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇచ్చింది కాదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు వేరువేరుగా టీడీపీ మేనిఫెస్టోలు విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోల్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామన్న వాగ్దానాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగం మొత్తం ఎన్ని రుణాలు తీసుకున్నారో ఇంతకాలం తెలియదనుకోవడం కూడా పొరపాటే. రాష్ట్ర స్థాయి బ్యాంక ర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నివేదికల్లో రైతాంగం తీసుకున్న రుణాలె న్ని? అందులో వ్యవసాయ రుణాలెన్ని? బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయం కోసం తీసుకున్న రుణాలెన్ని? టర్మ్ రుణాలెన్ని? డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలెన్ని? వంటి మొత్తం వివరాలున్నాయి. పైగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడానికి ముందున్న లెక్కలే ఇవి. అన్నీ తెలిసే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అరుుతే అధికారం చేపట్టిన తర్వాత ఈ విషయంలో ఆయన రూటు మార్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినరోజు రుణ మాఫీ ఫైలుమీదే తొలి సంతకం చేస్తానన్న వాగ్దానం నెరవేర్చకుండా, రుణమాఫీ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికంటూ నాబార్డ్ మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో ఒక కమిటీ వేయడానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేసి చేతులు దులుపుకున్నారు. దాంతో రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి ఒక్కసారిగా విమర్శల దాడి మొదలైంది. అయినప్పటికీ కమిటీ సూచనలు, సిఫారసుల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో చంద్రబాబు ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనూ రైతులు తీసుకున్న రుణాలెన్ని అన్న విషయూన్ని బ్యాంకర్ల కమిటీ చాలా స్పష్టంగా బహిరంగంగా ప్రకటించింది. ఇన్ని వాస్తవాలు ప్రత్యక్షంగా కనబడుతున్నప్పటికీ చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు నిన్నమొన్నటి వరకు కూడా రుణ మాఫీకి కట్టుబడి ఉన్నామంటూ పచ్చిగా నమ్మిస్తూ వచ్చారు. ఒక్కో దశలో ఒక్కో పరిమితి విధిస్తూ, ఆంక్షలు పెడుతూ సాకులు చెబుతున్న సమయంలో వివిధ రాజకీయ పక్షాలు, రైతు సంఘాల నుంచి విమర్శలు వ స్తున్న సమయంలోనూ రుణ మాఫీకి కట్టుబడి ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. దాదాపు నెలన్నర నుంచి ఇలా కాలం వెళ్లబుచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సోమవారం తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. వ్యవసాయం కోసం కోటి మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే వారిలో 90 శాతం మందికి లబ్ది చేకూర్చుతున్నామని బుకాయించే ప్రయత్నం చేయడం పట్ల రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రూ.87,612.25 కోట్ల మేరకు వ్యవసాయ రుణాలు, రూ.14,204 కోట్ల మేరకు డ్వాక్రా రుణాలు కలిపి మొత్తం లక్ష కోట్లకు పైగా రుణాలుంటే.. అందులో రూ.30 వేల కోట్ల నుంచి 35 వేల కోట్ల మేరకు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వమే.. మళ్లీ 90 శాతం రైతులకు మేలు కలిగిస్తున్నామని చెప్పడం పట్ల రైతు సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. డ్వాక్రా రుణాలతో కలిపి లక్ష కోట్ల రుణాలుంటే అందులో కనీసం 30 శాతం రుణాలను మాఫీ చేయలేనప్పుడు ఏ విధంగా 90 శాతం మంది రైతులకు ప్రయోజనం కలిగించినట్టు అవుతుందని ప్రశ్నిస్తున్నాయి. వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి కోటికి పైగా బ్యాంకుల్లో ఖాతాలున్నాయని కేవలం రూ.30 వేల కోట్లు మాఫీ చేసి 90 శాతం లబ్ది చేకూర్చామని చెప్పడం మరో మోసమని పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన తతంగం చూస్తుంటే ఆ రూ.30 వేల కోట్లను కూడా తగ్గించేలా ప్రభుత్వ వ్యవహారం కనబడుతోందని ఆ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
సమ దృష్టే రాయలసీమకు రక్ష
రాజధాని ఎంపికలో నాడు ఏ సమస్యలైతే తీవ్ర చర్చనీయాంశాలైనాయో, ఇప్పుడూ అవే పునరావృతమైనాయి. ఆంధ్ర రాష్ట్రంలో సర్కారు జిల్లాలు పెత్తనం సాగిస్తాయనే బలమైన భావనతో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడడానికి సీమ వాసులు ముందు వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ కుటిల రాజకీయాలకు బలైంది. తెలుగుజాతిని రెండు ముక్కలు చేసి, కలహాల కుంపట్లు రగిలించారు. ఆరు దశాబ్దాల పాటు కష్టసుఖాలలో కలసి మెలసి జీవిస్తూ హైదరాబాద్‌ను మంచి రాజధానిగా, మహానగరంగా తీర్చిదిద్దుకున్నాం. అంతిమంగా ఆ అభి వృద్ధి ఫలాలను అనుభవించే అర్హత లేదంటూ సీమాంధ్ర ప్రజల తలరాత లను మార్చేశారు. మిగిలిన 13 జిల్లా లతో ఆంధ్రప్రదేశ్ అన్న పేరుతోనే రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీక రించారు. రాజధానిని నిర్ణయించకుం డానే వదిలిపెట్టారు. అడ్డగోలు విభజనలో కాంగ్రెస్‌కు సహకరించిన బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టింది. నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాస నసభలో తెలుగుదేశం అధికార పక్షం కాగా, వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉంది. కాంగ్రెస్‌కు, కమ్యూని స్టులకు ప్రాతినిధ్యమే లేదు. కొత్త రాజధాని ఎంపికలో చేదు అనుభవాలు పునరావృతం కాని రీతిలో రాయలసీమ, ఉత్త రాంధ్ర, మధ్య, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల అభీష్టానికి అను గుణంగా నిర్ణయం తీసుకోవాలి. మద్రాసు నగరాన్ని (నేడు చెన్నై) వదులుకోవడం నష్ట మే అయినా, నాడు ఆంధ్రరాష్ట్రం పోరాడి సాధించుకున్నారు కాబట్టి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు అంతగా విచారిం చలేదు. మద్రాసును ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్, ప్రజా సోషలిస్టు పార్టీలు కోరాయి. నాటి ప్రధాని నెహ్రూ దీనిని తోసిపుచ్చారు. తరువాత విజయవాడ రాజ ధానికి అనువైన దని కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదిం చింది. కృషీకార్ లోక్‌పార్టీ తిరుప తి మీద మొగ్గు చూపింది. దీని మీద ఉమ్మడి మద్రాసు శాసనసభలోని ఆంధ్ర శాసనసభ సభ్యులు జూన్ 5, 1953న ప్రత్యేక సమావేశం జరి పారు. ఐదురోజులు చర్చించి వెనుకబడిన రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలని, కర్నూలును తాత్కాలిక రాజధానిని చేయాలని నిర్ణయించారు. హైకోర్టును గుంటూరులో నెలకొ ల్పాలని తీర్మానించారు. రాజధాని ఎంపికలో నాడు ఏ సమస్యలైతే తీవ్ర చర్చనీ యాంశాలైనాయో, ఇప్పుడూ అవే పునరావృతమైనాయి. ఆంధ్ర రాష్ట్రంలో సర్కారు జిల్లాలు పెత్తనం సాగిస్తాయనే బలమైన భావనతో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరు పడడానికి రాయలసీమ వాసులు ముందు తటపటాయించ డమే కాదు వ్యతిరేకించారు. రాయలసీమ వాసుల మనోగ తాన్ని పసిగట్టి, 1936 నాటి ‘శ్రీబాగ్ ఒడంబడిక’(పెద్ద మనుషుల ఒప్పందం) ద్వారా సీమ ప్రజలకు భరోసా ఇచ్చి ఉద్యమంలో అంతర్భాగం చేశారు. కానీ శ్రీబాగ్ ఒడంబడిక బుట్టదాఖలా అయింది. రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధికి రాష్ట్ర విభజన చట్టంలో ఎలాంటి నిర్దిష్టమైన ప్రణాళికను పొందుపరచ లేదు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి పేర్కొన్న అంశాలన్నీ కోస్తాంధ్ర కేంద్ర బిందువుగానే ఉన్నాయి. విశా ఖ - నెల్లూరు మధ్య ఉన్న ప్రాంతంపైనే కేంద్రీకరించినట్టు కనిపిస్తున్నది. గత అనుభవాల ఆధారంగా భవిష్యత్ పరిణా మాలను ఊహించుకొంటున్న రాయలసీమ ప్రజానీకానికి విశ్వాసం కలిగించే ప్రయత్నం జరగడం లేదనిపిస్తున్నది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించి, అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించి, ఖర్చు చేయడం ద్వారా మాత్రమే ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించగలరు. సీమకు విస్తా రమైన భూసంపద, ఖనిజ, అటవీ సంపద ఉన్నాయి. కానీ, నీరే సమస్య. కృష్ణా నదీజలాల వినియోగ నియంత్రణ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయమే కృష్ణా నదీ జలాల నిర్వహణ, వినియోగంలో గుండెకాయ లాంటిది. తుంగభద్ర, జూరాల జలాశయాల వద్ద నీటి నిల్వ, వినియోగాంశాలు కీలకమైనవి. అందువల్ల బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడం సముచితం. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న ఉన్నత విద్యా సంస్థల్లో కొన్నింటిని ఈ ప్రాంతంలో నెలకొల్పాలి. రాజధాని సమ స్యను మాత్రమే వేరుచేసి అత్యాధునిక హంగులతో గుం టూరు - విజయవాడ లేదా విజయవాడ - ఏలూరు మధ్య లేదా మరెక్కడైనా మహానగరాన్ని నిర్మిస్తామని చెబితే రాయ లసీమకు ఒరిగేదేమీలేదు. ‘సమగ్ర దృష్టి, సమగ్రాభివృద్ధి, సమన్యాయం’ ప్రాతిపదికన నవ్యాంధ్రప్రదేశ్‌లో సుపరిపాల నను ప్రజలు కోరుకొంటున్నారు. (వ్యాసకర్త నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం కార్యనిర్వాహకులు, హైదరాబాద్) టి. లక్ష్మీనారాయణ -
పీఠంపై ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను ఈసారైనా తెలుగుదేశం నాయకులు సవ్యంగా జరగనిస్తారా..? ఇది అందరిలో ఉత్కంఠ రేపుతున్న అంశం. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ స్వయంగా జోక్యం చేసుకుని పరిశీలకులను రంగంలోకి దింపి, సమావేశం మొత్తం వీడియో తీయించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరుపుతామని జిల్లా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ఐదో తేదీన జెడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో తెలుగుదేశం సభ్యులు సమావేశ మందిరం బయట, లోపల రగడ సృష్టించి ఎన్నిక వాయిదా పడేలా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్నా జెడ్పీ పీఠం గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డ దారులు తొక్కుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను ఎంత ప్రలోభాలకు గురిచేసినా వారు లొంగకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ముగ్గురు తెలుగుదేశం వైపు వెళ్లడంతో ఇరు పార్టీల బలం 28కి చేరింది. దీంతో ఈసారి జరిగే ఎన్నికలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే లాటరీ తప్పకపోవచ్చు. ఒక బీసీ అభ్యర్థిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబెడితే అతనిని ఓడించేందుకు అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాల పట్ల బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎవరి కంపార్టుమెంట్లో వారే.. ఈ నెల ఐదున ఎన్నిక వాయిదా పడటంతో ఇరు పార్టీలు తమ సభ్యులను క్యాంపులకు తరలించాయి. తెలుగుదేశం పార్టీ తమ సభ్యులు వారి కుటుంబాలతో కలిసి భవానీ ద్వీపంలో క్యాంపు ఏర్పాటు చేసింది. శనివారం రాత్రి వారిని ఒంగోలుకు తరలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏ పార్టీ నుంచి గెలిచిన వారు వారికి కేటాయించిన కంపార్టుమెంట్లోనే కూర్చోవాల్సి ఉంటుంది. ఈ పరిణామం పార్టీ ఫిరాయించిన వారికి ఇబ్బంది కానుంది. సమావేశ మందిరంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్‌తో పాటు ప్రత్యేక పరిశీలకుడు దాన కిషోర్ వేదికపై ఆశీనులౌతారు. ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ముందు వరసలో సీట్లు ఏర్పాటు చేశారు. వెనుక తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సభ్యుల కోసం రెండు కంపార్టుమెంట్లను ఏర్పాటు చేశారు. సభ్యులకు కూడా అక్షర క్రమంలో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రతి కంపార్టుమెంట్‌కు మధ్య బారికేడింగ్ చేశారు. దీంతో ఒక పార్టీ సభ్యులు మరో పార్టీ సభ్యులతో గొడవపడి ఘర్షణకు దిగే అవకాశం లేదు. సమావేశానికి వచ్చిన సభ్యులు విడివిడిగా వారి కంపార్టుమెంట్లలోకి వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. ఒకసారి లోపలికి వెళ్లినవారు సమావేశం పూర్తయ్యే వరకూ బయటకు వచ్చే అవకాశం లేదు. ఉదయం పదిగంటల వరకూ కో-ఆప్షన్ సభ్యులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ తర్వాత ఒంటిగంటకు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. మధ్యాహ్నం మూడు గంటలకు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. జిల్లాపరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి ఒంగోలు టౌన్: జిల్లాపరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ మెంబర్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. ఈనెల 13వ తేదీ స్థానిక పాత జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాపరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకునిగా సీనియర్ ఐఏఎస్ అధికారి, సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్ ఏ దానకిషోర్‌ను నియమించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌కు ముందుగా కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక, ఆ తరువాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయన్నారు. పార్టీల వారీగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రసాద్‌ను కలెక్టర్ ఆదేశించారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఒంగోలు క్రైం : జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీసులు ఆదివారం భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మార్కాపురం ఓఎస్డీ సమైజాన్‌రావు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఓఎస్డీతోపాటు ముగ్గురు డీఎస్పీలు ఎన్నికల బందోబస్తు వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. గత శనివారం జరిగిన జెడ్పీ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ భద్రతా చర్యలు చేపట్టారు. మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు, కందుకూరు డీఎస్పీ శంకర్, ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్న డీఎస్పీ అశోక్‌బాబును అదనంగా నియమించారు. 35 మంది సీఐలు, 45 మంది ఎస్సైలు, 100 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు 400 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించనున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో ప్రజలు సంచరించకుండా ఆంక్షలు విధించారు. నగరంలో 144 సెక్షన్ పెట్టారు. పాత జెడ్పీ కార్యాలయంలోకి కేవలం అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తారు. -
వలసలు..!
‘దేశం’ లక్ష్యంగా పావులు ఎంపీపీలపై కన్నేసిన టీఆర్ఎస్ టీడీపీ సభ్యులు లక్ష్యంగా ఎత్తులు అవసరమున్న చోట కాంగ్రెస్ వైపు గుడ్‌బై చెప్పేందుకు తమ్ముళ్లు రెడీ ‘స్థానిక’ కుర్చీలపై దృష్టిసారించిన టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ,జెడ్పీటీసీ సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఎత్తుగడలు వేస్తోంది. తమ వైపు చూసే వారికి ‘ఆకర్ష’ పద్ధతిని గూట్లోకి లాక్కొని పదవులను నిలబెట్టుకోవాలని పథక రచన చేస్తోంది. ‘పల్లె పోరులో’ పట్టు సాధించిన కమలం, సైకిల్ పక్షాల వారిని ఆకట్టుకొని మండల పరిషత్‌ల్లో పాగా వేయాలని యోచిస్తోంది. మహబూబ్‌నగర్ : జిల్లా, మండల పరిషత్ చైర్మన్ పదవులపై కన్నేసిన టీఆర్ఎస్ వలసల ద్వారా కుర్చీలు దక్కించుకోవాలనే వ్యూహంతో కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా గెలుపొందిన వారిని ఆకర్షించడం ద్వారా లక్ష్యం చేరుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్‌ను మినహాయిస్తే జిల్లాలో టీడీపీ, బీజేపీ మాత్రమే ప్రాదేశిక ఎన్నికల్లో ఓ మోస్తరు ఫలితాలను సాధించాయి. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రాదేశిక సభ్యులు, నేతలు లక్ష్యంగా చేరికల వ్యూహానికి పదును పెడుతోంది. త్వరలో జిల్లా, మండల పరిషత్ చైర్మన్ల ఎంపిక నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పీఠం కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. జిల్లాలో 64 మండల పరిషత్‌లకు గాను 20కి పైగా మండల పరిషత్‌లలో ఏ పార్టీకి స్పష్టమైన సంఖ్యా బలం దక్కలేదు. ప్రాదేశిక ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న టీఆర్ఎస్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఆసరాగా తీసుకుని అటు జిల్లా, ఇటు మండల పరిషత్ పీఠాలను దక్కించుకునేలా వ్యూహ రచన చేస్తోంది. జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు కనీసం 33 మంది జడ్పీటీసీ సభ్యుల మద్దతు అవసరం కాగా, టీఆర్ఎస్కు 25 మంది సభ్యులున్నారు. దీంతో తొమ్మిది మంది సభ్యుల బలమున్న టీడీపీ మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ వైపు టీడీపీ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఆ పార్టీ సభ్యులను పార్టీలో చేరేలా పావులు కదుపుతోంది. అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నేతను పార్టీలో చేర్చుకోవడం ద్వారా అక్కడి నుంచి గెలుపొందిన ఓ టీడీపీ జడ్పీటీసీ సభ్యుడి మద్దతు కూడగట్టుకునే యోచన కనిపిస్తోంది. ఇదే వ్యూహాన్ని మిగతా నియోజకవర్గాల్లోనూ అనుసరించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలో గెలుపొందిన నలుగురు జడ్పీటీసీ సభ్యులను మినహాయిస్తే మిగతా ఐదుగురు టీడీపీ సభ్యులను పార్టీ గొడుగుకు రప్పించే వ్యూహంతో వున్నట్లు టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. టీడీపీ నేతలను ఆకర్షించే బాధ్యతను పార్టీకి చెందిన కీలక నేతకు పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ‘దేశం’ సభ్యుల పక్కచూపు జిల్లాలో 982 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు గాను కాంగ్రెస్ 367, టీఆర్ఎస్ 298, టీడీపీ 178, బీజేపీ 69, సీపీఐ మూడు, సీపీఎం నాలుగు, స్వతంత్రులు 63 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ సొంతంగా 28 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకునే పరిస్థితి కనిపిస్తోంది. మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల్లో సంఖ్యా పరంగా టీఆర్ఎస్ రెండో స్థానంలో వున్నా చాలా చోట్ల సొంత బలంపై ఆధార పడి అధ్యక్ష పదవులు దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలను ఆకర్షించడం ద్వారా మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా తయారైన పరిస్థితుల నేపథ్యంలో అవసరమైన చోట టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మద్దతు ఇచ్చే యోచన టీడీపీ సభ్యుల్లో కనిపిస్తోంది. అధికార పార్టీకి దూరంగా వుంటే అభివృద్ధి నిధులు దక్కవనే భావన కూడా టీడీపీ ఎంపీటీసీ సభ్యుల్లో కనిపిస్తోంది. కొడంగల్, నారాయణపేట, వనపర్తి, మక్తల్ మినహా మిగతా నియోజకవర్గాల్లో టీడీపీకి నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం లేకుండా పోయింది. పార్టీ పరంగా తమను పట్టించుకునే వారు కూడా లేకపోవడంతో ఇతర పార్టీల వైపు టీడీపీ శ్రేణులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. టీడీపీ పరిస్థితిని ఆసరాగా చేసుకుని జిల్లా, మండల పరిషత్ అధ్యక్ష పదవులపై టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది -
టీడీఎల్పీ ఫ్లోర్‌లీడర్‌గా బీసీలు పనికిరారా?
సీఎంగా పనికొచ్చే వ్యక్తి ఫ్లోర్‌లీడర్‌గా అనర్హుడా: బీసీ సంఘాల ప్రశ్న తలసాని, ఆర్.కృష్ణయ్యలకుటీ టీడీఎల్పీలో ఏ పదవులు ఇవ్వని బాబు ఉప నాయకులుగా రేవంత్, సండ్ర,విప్‌గా ప్రకాశ్ గౌడ్, కోశాధికారిగా మాగంటి బాబు నిర్ణయంపై తలసాని తీవ్ర అసంతృప్తి అసెంబ్లీ హాల్లో వెనకాల కూర్చొన్న తలసాని, ఆర్.కృష్ణయ్య హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే బీసీ నేత ఆర్.కృష్ణయ్యను సీఎం చేస్తా... ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణలోని బహిరంగసభల్లో చేసిన వాగ్దానమిది. సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని చెపుతూ అక్కడ బీసీ ఓట్లకు గాలం వేశారు. తీరా... తెలంగాణలో టీడీపీ 15 సీట్లు గెలుచుకొని మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో చంద్రబాబు తన వాగ్దానాన్ని పక్కనపెట్టారు. బీసీలకు సీఎం ఇస్తానన్న బాబు టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్‌ను కూడా ఇవ్వలేదు. తెలంగాణ టీడీఎల్పీ నాయకుడి విషయంలో రోజుకోరకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరా సోమవారం రాత్రి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావును ఫ్లోర్‌లీడర్‌గా నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ పదవి కోసం పోటీ పడ్డ బీసీ నేతలైన కృష్ణయ్య, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు టీడీఎల్పీలో ఏ పదవులు ఇవ్వకుండా దూరం చేశారు. డిప్యూటీ ఫ్లోర్‌లీడర్లుగా ఎ.రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, విప్‌గా ప్రకాశ్ గౌడ్, కోశాధికారిగా మాగంటి గోపీనాథ్, టీడీఎల్పీ కార్యదర్శులుగా జి. సాయన్న, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలను నియమించారు. నేతల తీవ్ర అసంతృప్తి పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ సీఎంగా బీసీ నేత ఆర్.కృష్ణయ్యను ప్రకటించిన బాబు ... తీరా ఇప్పుడు పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కూడా పనికిరాడన్న విధంగా వ్యవహరించడం ఏమిటని బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల బీసీ ఉద్యమంలో ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర ఆర్.కృష్ణయ్యకు ఉందని ఎన్నికల్లో ప్రతిచోటా చెప్పిన బాబు... ప్రతిపక్షంలో ఫ్లోర్‌లీడర్‌గా కూడా వ్యవహరించ లేరని నిర్ధారణకు వచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. టీడీఎల్పీలో కృష్ణయ్యకు ఏ పదవి ఇవ్వకపోవడం బీసీలను అవమానపరచడమేనని మండిపడుతున్నారు. ఏ పదవీ వద్దన్న తలసానికి ఉత్తి చేతులే! చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీకే టీడీఎల్పీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఆర్.కృష్ణయ్య కాకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కే ఆ పదవి దక్కుతుందని భావించారు. కానీ శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఎర్రబెల్లిని ఖరారు చేస్తున్నట్లు తలసానికి చెప్పారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తనకు ఏ పదవులు వద్దని, ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెప్పి వెళ్లిపోయారు. ఆయన ఆవేశంలో అన్న మాటలనే ని జం చేస్తూ ఉప నాయకుడి హోదా కూడా ఇవ్వకుండా చంద్రబాబు పక్కన పెట్టారు. కాగా సోమవారం అసెంబ్లీ హాలులో ఆర్.కృష్ణయ్య ఒంటరిగా వెనుక సీట్లలో కూర్చొని తన అసంతృప్తి వ్యక్తం చేయగా, తలసాని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో కలిసి మూడో బెంచీపై కూర్చోవడం గమనార్హం. -
దిక్కరించి ఓటేస్తే.. సీటు గోవిందా!
విప్ ధిక్కరిస్తే జెడ్పీటీసీల పరిస్థితి అంతే అయినా గులాబీవైపు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్, టీడీపీ సభ్యులు టీఆర్ఎస్ తరపున పోటీచేస్తే మళ్లీ గెలుస్తామనే ధీమా హైదరాబాద్ : సార్వత్రికఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలు తలనొప్పిగా మారాయి. ఏ పార్టీకీ మెజారిటీ సీట్లురాని జిల్లాల్లో సొంత జెడ్పీటీసీలను కాపాడుకోవడం ఆ పార్టీలకు తలకు మించిన భారమైంది. జెడ్పీఛైర్మన్ ఎన్నికల్లో విప్ జారీ చేస్తామని ఆ పార్టీలు హెచ్చరించినా బెదిరే నాథుడే లేడు. విప్ ధిక్కరిస్తే జెడ్పీటీసీ పదవి పోతుందని తెలిసినా వారు అందుకు సిద్ధమవుతున్నారు. సీటు పోయినా సరే ఓటు చెల్లుతుందనే ధీమాతో విప్ ధిక్కరణకు రెడీ అవుతున్నారు. అధికారపార్టీ అందించే తాయిలాలు, భవిష్యత్ అవసరాలు, సొంతపనులు చక్కదిద్దుకోవచ్చనే ఉద్దేశంతో టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. జెడ్పీ ైచైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడకముందే ఆయా జిల్లాల్లో పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. మెదక్ జిల్లాల్లో ముగ్గురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ జెడ్పీటీసీలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని గులాబీ కండువా వేసుకున్నారు. మహబూబ్‌నగర్‌లో ఫిరాయింపులు ఎక్కువయ్యే పరిస్థితి కనిపించడంతో ఏకంగా టీఆర్ఎస్కు మద్దతిచ్చి ప్రతిఫలంగా జిల్లా వైస్ైచైర్మన్ పదవి పొందాలని టీడీపీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. వరంగల్ జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి. జెడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తుండగా, కాంగ్రెస్‌ను చీల్చి లబ్ధిపొందాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. జెడ్పీ పీఠం ఏ పార్టీ దక్కించుకోవాలనుకున్నా నర్సంపేట స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మద్దతు అత్యవసరం. ఆయన మద్దతుకోసం రెండుపార్టీలు బేరసారాలకు సిద్ధమవుతున్నాయి. మెదక్ జెడ్పీ పీఠం టీఆర్ఎస్దే మెదక్ జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలకుగాను, కాంగ్రెస్, టీఆర్ఎస్లకు చెరో 21 స్థానాలు, టీడీపీకి 4 స్థానాలు వచ్చాయి. జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవడానికి 24 స్థానాలు అవసరం. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. దీంతో గులాబీ పార్టీ బలం 26కి చేరింది. అంటే జెడ్పీ పదవికి అవసరమైన సీట్లకంటే మరో రెండు అధికంగా ఆ పార్టీకి లభించాయి. దీంతో జెడ్పీ పీఠం టీఆర్ఎస్కు ఖాయమైనట్టే. అంతేకాక కాంగ్రెస్‌కు చెందిన మరో నలుగురు జెడ్పీటీసీలు కూడా టీఆర్ఎస్కు మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్‌లో దొంతి పాత్ర కీలకం ఈ జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. వీటిలో కాంగ్రెస్‌కు 24, టీఆర్ఎస్కు 18, టీడీపీకి 6 గురు జెడ్పీటీసీలుండగా, బీజేపీకి ఒకరు, స్వతంత్రంగా ఎన్నికైన మరో జెడ్పీటీసీ ఉన్నారు. జెడ్పీ చైర్మన్ పదవి దక్కాలంటే 26 స్థానాలు అవసరం. కాంగ్రెస్‌కు మరో ఇద్దరు జెడ్పీటీసీలు మద్దతిస్తే ఆ పార్టీకి పీఠం దక్కుతుంది. ఇక్కడ ఏ పార్టీకి జెడ్పీ పదవి దక్కాలన్నా స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన దొంతి మాధవరెడ్డి కీలకం. ఎందుకంటే ఈ జిల్లాలో 8 మంది జెడ్పీటీసీలు దొంతి వెన్నంటి ఉన్నారు. వీరిలో ఐదుగురు కాంగ్రెస్, ముగ్గురు టీడీపీకి చెందిన వారు. దీంతో దొంతిని తమవైపు రప్పించుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు తీవ్రయత్నాలు చేస్తున్నారు. దొంతి మాత్రం మూడు షరతులు పెట్టి కాంగ్రెస్‌వైపే మొగ్గుచూపుతున్నారు. తనపై పార్టీ విధించిన బహిష్కరణను ఉపసంహరించుకోవడం, డీసీసీ పగ్గాలు తిరిగి తనకు అప్పగించడమేగాక,తాను సూచించిన వ్యక్తినే జెడ్పీ చైర్మన్‌గా ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌పార్టీ మాత్రం దొంతి షరతులకు తలొగ్గే పరిస్థితి కనిపించడం లేదు. తన ప్రతిపాదనకు ఏ పార్టీ ఓకే చెబితే ఆ పార్టీకే మద్దతిస్తానని దొంతి మాధవరెడ్డి చెబుతున్నారు. జిల్లాలోని నెక్కొండ జెడ్పీటీసీ సభ్యురాలు బి.కవితను జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నుకోవాలన్న దొంతిప్రతిపాదనకు ఏ పార్టీ మొగ్గు చూపుతుందనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. వైస్-చైర్మన్ పదవిస్తే టీఆర్ఎస్కు జైకొడతామంటున్న పాలమూరు తమ్ముళ్లు మహబూబ్‌నగర్ జిల్లాలో 64 జెడ్పీటీసీ స్థానాలుండగా కాంగ్రెస్‌కు 28, టీఆర్ఎస్కు 25 సీట్లున్నాయి. అదే సమయంలో టీడీపీకి 9, బీజేపీకి ఇద్దరు జెడ్పీటీసీలున్నారు. జెడ్పీ పదవి ఏపార్టీకి దక్కాలన్నా 33 మంది జెడ్పీటీసీల మద్దతు అవసరం. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీల మద్దతుకోసం యత్నిస్తున్నారు. టీఆర్ఎస్ పెద్దలు మాత్రం టీడీపీ, బీజేపీతోపాటు కాంగ్రెస్ జెడ్పీటీసీలకు కూడా లాగేందుకు పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు ఇటు కాంగ్రెస్, అటు టీడీపీకి చెందిన కొందరు జెడ్పీటీసీలు సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. కాగా, జిల్లాపరిషత్ వైస్‌చైర్మన్ పదవిని తమకు కేటాయిస్తే, మద్దతిస్తామని టీడీపీ జిల్లా నేతలు టీఆర్ఎస్తో లోపాయికారీ ఒప్పందానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనిపై టీఆర్ఎస్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని తెలిసింది. కాంగ్రెస్‌కు జెడ్పీటీసీలు కొందరు ఇప్పటికే తమతో టచ్‌లో ఉండడంతో టీడీపీకి వైస్‌చైర్మన్ పదవి ఇవ్వాలా, వద్దా? అనే విషయాన్ని గులాబీ పెద్దలు ఆలోచిస్తున్నారు. మరోవైపు జెడ్పీపదవిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ సతీమణి అనురాధను జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో దింపేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ జెడ్పీటీసీలతో మంతనాలు జరపడంతోపాటు అనేక తాయిలాలను వారికి ఎర చూపుతున్నట్టు తెలిసింది. -
జంప్ జిలానీలకు ఝలక్!
ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. ఆఖరు నిముషంలో పార్టీలు మారిన జంప్ జిలానీలకు ప్రజలు తమ ఓటుతో గట్టి గుణపాఠమే చెప్పారు. జిల్లాలో ముగ్గురు శాసనసభ్యులు, ఒక శాసనమండలి సభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఆఖరు నిముషంలో పార్టీలు మారి ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో ఒక శాసనసభ్యుడు, ఒక శాసనమండలి సభ్యుడిని ఓటర్లు ఆదరించారు. మిగిలిన ముగ్గురిని తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యుడిగా దీర్ఘకాలం పదవులు అనుభవించి ఆఖరు నిముషంలో పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన ముగ్గురిని ఓటర్లు తిరస్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభ్యులుగా పోటీ చేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని ఓటర్లు ఆదరించారు. తమ ఓట్లతో వారిని ఆశీర్వదించి అందలం ఎక్కించారు. దేశవ్యాప్తంగా బలంగా వీచిన నరేంద్రమోడీ గాలి కానీ, చంద్రబాబునాయుడు ప్రకటించిన రైతులకు రుణమాఫీ, ఇతర వర్గాలకు రకరకాల తాయిలాలు కానీ పార్టీ ఫిరాయించి తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని గట్టెక్కించలేదు. జిల్లాలో 2009లో కాంగ్రెస్ శాసనసభ్యునిగా ఎన్నికైన ఆదిమూలపు సురేష్ (యర్రగొండపాలెం రిజర్వుడు), బీఎన్ విజయకుమార్ (సంతనూతలపాడు రిజర్వుడు)లు ప్రస్తుత ఎన్నికల్లో తాము ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ను వీడారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిద్దరూ ప్రత్యర్థులుగా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో తలపడ్డారు. ఎమ్మెల్యే విజయకుమార్ మూడేళ్లుగా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. భవిష్యత్ వ్యూహంతో ముందుగానే విజయకుమార్ తెలుగుదేశం నాయకులను మచ్చిక చేసుకొని తమ వైపు తిప్పుకున్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆఖరు నిముషంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు ఆయనకు పార్టీ టికెట్ ఖరారైంది. అయితే అప్పటినుంచి అవిశ్రాంతంగా ప్రచారంలో పాల్గొని ఓటర్ల మనుసుదోచారు. విజయతీరాలు చేరారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎవరూ గెలవని ఆనవాయితీని కొనసాగించారు. సంతనూతలపాడు నియోజకవర్గ ఆనవాయితీని పటాపంచాలు చేయాలన్న విజయకుమార్ కలలు కల్లలుగా మిగిలాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతుల రామారావు ఆఖరు నిముషంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా పేరున్న పోతుల రామారావును నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు అక్కున చేర్చుకున్నారు. నియోజకవర్గానికి కొత్త అయినప్పటి కీ పోతుల రామారావుకు అక్కడి ప్రజలు పట్టం కట్టారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ దివి శివరాం నోటి దురుసుతనం ఆయనకు చేటు తెచ్చింది. శివరాం 2004, 2009లో మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి చేతిలో, ప్రస్తుతం పోతుల రామారావు చేతిలో పరాజయం పాలై ఓటమిలో హ్యాట్రిక్ సాధించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మూడుసార్లు ఎన్నికైన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆ పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరారు. ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైవీ.సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఘనవిజయం సాధించారు. గతంలో నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోయినా ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, నాయకులతో సుబ్బారెడ్డికి సత్సంబంధాలున్నాయి. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో జిల్లా నుంచి వివిధ పనుల కోసం ఎవరు హైదరాబాద్ వెళ్లినా వారందరికీ ప్రథమ ప్రాధాన్యతనిచ్చి వారి పనులు చేసి పంపి అందరి హృదయాల్లో సుబ్బారెడ్డి స్థానం సంపాదించారు. ఇవన్నీ ఆయనకు ఎన్నికల్లో బాగా కలిసొచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ తర ఫున గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చలామణి అయిన అన్నా రాంబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గిద్దలూరు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి గెలుపొందారు. కారణాలు ఏవైనప్పటికీ కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించి పోటీ చేసిన వారందరినీ జిల్లా ఓటర్లు తిరస్కరించటం విశేషం. -
హెరిటేజ్ పా‘పాలు’
కొలతల్లో నిలువు దోపిడీ లీటర్‌కు 100 మిల్లీలీటర్లు తక్కువగా పాల ప్యాకెట్లు అరలీటర్ పాలకు రూ.2 నుంచి రూ.4 వరకు నష్టం తూనికలు-కొలతల శాఖ దాడుల్లో వెలుగులోకి నేడు వివరాలు వెల్లడిస్తామన్న అధికారులుఅడ్డుకునేందుకు ‘ఎల్లో సిండికేట్’ యత్నాలు హెరిటేజ్ పాలలో కేన్సర్ కారకం ఉందన నిషేధం విధించిన కేరళ హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి చెందిన హెరిటేజ్ డెరుురీ వినియోగదారులను నిలువునా వంచిస్తోంది. ఈ పాల కొనుగోలుదారుల్లో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉండటంతో వారే బాధితులుగా మిగులుతున్నారు. సాధారణ పాలకన్నా ప్యాకేజ్డ్ మిల్క్ పట్ల వినియోగదారులకు ఎంతో నమ్మకం ఉంటుంది. హెరిటేజ్ దాన్ని కూడా పలుమార్లు వమ్ము చేసేసింది. లీటర్‌కు ఏకంగా వంద మిల్లీలీటర్లు తక్కువ పరిణామంతో పాలను ప్యాకెట్లలో సీల్ చేయడం వల్ల వినియోగదారునికి ఒక్కో అరలీటర్ ప్యాకెట్‌పైన రూ.2 నుంచి రూ.4 వరకు నష్టం కలుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారుల నిలువు దోపిడీ కొనసాగడం తూనికలు కొలతల శాఖ అధికారులు దృష్టికి వెళ్లడంతో శనివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ప్రారంభించారు. ఇవి ఆదివారం కూడా కొనసాగాయి. ఈ విషయాన్ని ధ్రువీకరించిన ఆ శాఖ కంట్రోలర్ గోపాల్‌రెడ్డి పూర్తి వివరాలను సోమవారం వెల్లడిస్తామని చెప్పారు. పాలు, వివిధ రకాల పాల ఉత్పత్తుల కొలతల్లో అవకతవకలున్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చిన అధికారులు ఆ మేరకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అయితే రెండురోజుల్లో సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉండటంతో తూనికలు, కొలతల శాఖ దాడులు, హెరిటేజ్‌లో జరుగుతున్న పా‘పాలు’ బయటపడకుండా నియంత్రించేందుకు ఇటు టీడీపీ నేతలతో పాటు మరోవైపు ‘ఎల్లో సిండికేట్’ సైతం తీవ్ర స్థాయిలో అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. పుట్టుక నుంచే అక్రమాలు.. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పాలపొడి తయారీ కంపెనీగా హెరిటేజ్ ఫుడ్స్ కథ మొదలైంది. చంద్రబాబు రెవెన్యూ మంత్రి కావడంతో దీని దశ తిరిగింది. ప్రభుత్వ డెయిరీలు మూతపడుతుండగా... అందుకు విరుద్ధంగా హెరిటేజ్ మాత్రం బాబు అధికార దండంతో ‘చక్రం తిప్పడం’వల్ల ఓ వెలుగు వెలుగుతూ వచ్చింది. ఆయన సీఎం అయిన తర్వాత హెరిటేజ్‌కు రాయితీల పంట పండి ంచుకున్నారు. మరోవైపు అప్పటికే పేరు ప్రఖ్యాతులున్న సంగం డెయిరీ, చిత్తూరు డెయిరీ వంటివి రోజురోజుకు నిర్వీర్యమయ్యేలా చేశారు. ఆ పాల నిండా ‘కేన్సర్’ కారక విషం! హెరిటేజ్ సంస్థ అమ్ముతున్నది పాలు కాదు విషమంటూ గతంలో ప్రభుత్వ విప్ పద్మరాజు ఆరోపించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. హెరిటేజ్ పాలలో కేన్సర్ కారకమైన రసాయనం ఫార్మాల్డిన్ ఉందంటూ.. 2012 సెప్టెంబర్ 18న కేరళ ప్రభుత్వం వీటి విక్రయాలపై ఏకంగా నిషేధం విధించింది. ఈ పాలతో ప్రజలకు కలుగుతున్న ముప్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పలు సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ పాల వల్ల ఎందరు కేన్సర్ బారినపడ్డారో తేల్చాలని డిమాండ్ చేసింది. హెరిటేజ్ పాలపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు తేలే వరకు వాటి విక్రయాలపై రాష్ట్రంలో నిషేధం విధించాలంటూ వైద్యులతో సహా అనేకమంది డిమాండ్ చేసినా సర్కారు చెవికెక్కలేదు. మరోవైపు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించని హెరిటేజ్ ప్లాంట్లలో పని కూడా దినదిన గండమేనని కార్మికులే చెబుతుంటారు. విశాఖపట్నం జిల్లాలోని కశింకోట మండలం బయ్యవరం దగ్గరున్న హెరిటేజ్ డెయిరీ రెండో విభాగంలో కాంట్రాక్టు కార్మికులతో ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో శీతలీకరణ విభాగం యూనిట్-2లో భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ పనిచేస్తున్న సుధాకర్, మనోజ్, ధర్మవీర్ సజీవదహనమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఎర్రగండిలో ఉన్న హెరిటేజ్ మిల్క్ బల్క్ యూనిట్ ఎఫ్యులెంట్ ట్యాంక్ పరిసరాలకు సరైన భద్రత కల్పించకపోవడంతో అందులోపడి అనిల్‌కుమార్, కరుణకుమార్ అనే చిన్నారులు మృతిచెందారు. -
చంద్రబాబు..ఓ చెల్లని ఓటు!
తాను బీజేపీకి ఓటేశానని బహిరంగంగా చెప్పిన బాబు ఇలా చెప్పటం నిబంధనలకు విరుద్ధమన్న భన్వర్‌లాల్ బాబు ఓటు చెల్లదని మీడియాలో రావటంతో టీడీపీ మండిపాటు భన్వర్‌లాల్‌తో వాగ్వాదం; ఆయనకు దురుద్దేశాలు అంటగట్టిన తీరు , హైదరాబాద్: బుధవారం ఉదయం... జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఓటు వేశారు. భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్, కోడలు బ్రహ్మణితో కలిసి ఓటేసి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. ‘‘పొత్తు ధర్మంలో భాగంగా రెండు ఓట్లూ బీజేపీకే వేశా. కమలం గుర్తుపై వేశా. ఈసారి ఇక్కడ మా సైకిల్ గుర్తు లేకపోవటం కొంత బాధ కలిగించింది. కానీ పొత్తులున్నపుడు ఇలాంటివి సహజమే. తొలిసారిగా సైకిల్‌కు ఓటు వేయలేకపోయా’’ అన్నారు. నిజానికి ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారెవరూ తామెవరికి ఓటేశామనేది చెప్పరు. ఎన్నికల నిబంధనలు కూడా ఓటు గోప్యతను కాపాడాలనే చెబుతున్నాయి. పైగా తాను ఒక గుర్తుకు ఓటేశానని మీడియా ముఖంగా చెప్పటమంటే అది ఇతరులను కూడా ఆ గుర్తుకు ఓటేయమంటూ ప్రేరేపించటమే. ఇలా ప్రచారం చేయటాన్ని ఎన్నికల నిబంధనలు కూడా నిషేధిస్తున్నాయి. మరి ఒక పార్టీకి అధ్యక్షుడు, 1989 నుంచీ కుప్పంలో పోటీచేస్తూ ఎన్నికల రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఈ మాత్రం తెలియదా? తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశానని, చాలా అనుభవం ఉందని చెప్పే చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై కనీస అవగాహన లేదనేది మరోసారి బయటపడింది. రామోజీవంటి మీడియా ముసుగు తొడుక్కున్న ఎజెండాకారులే బాబును నడిపిస్తున్నారనేది మరోసారి తేటతెల్లమయింది. బాబు ఈ రకంగా అవగాహన లేకుండా ప్రవర్తించటం టీడీపీ నేతల్ని సైతం ఇబ్బందుల్లో పడేసింది. బాబు వ్యాఖ్యలను ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వద్ద కొందరు మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... అలా ఎవ్వరూ చేయకూడదని, ఎవరు చేసినా వారి ఓటు చెల్లనిదేనని ఆయన స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు ఓటు చెల్లదంటూ టీవీ చానెళ్లలో ప్రసారం కావటంతో టీడీపీ నాయకులు టీడీ జనార్ధన్‌రావు, న్యాయ విభాగం అధ్యక్షుడు రవీందర్‌కుమార్ తదితరులు భన్వర్‌లాల్ దగ్గరకు వెళ్లి ఆయనపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ఆ విషయం మీడియాకు చెప్పాలని ఒత్తిడి చేశారు. ‘‘మీరు మా పార్టీ నాయకుడికి అప్రతిష్ట తెచ్చేలా మీడియాకు సమాచారమిచ్చారు. మీ కార్యాలయం సమాచారం లీకవుతోంది. మీరు సరిగా వ్యవహరించటం లేదు’’ అంటూ వారు సీఈఓ తోనే వాగ్వాదానికి దిగారు. వీరి తీరుపై భన్వర్‌లాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘నా 34 ఏళ్ల సర్వీసులో మీలాంటి నాయకుల్ని ఎక్కడా చూడలేదు. ఇదేనా మీ పార్టీ ప్రవర్తన? ఇలాగే ఉంటుందా? ఇది నిస్సందేహంగా తప్పుడు సంప్రదాయం. ఓటు రహస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఓటర్లు అందరిపై ఉంది. ఒక పెద్ద మనిషి తానెవరికి ఓటేసిందీ చెప్పటం ఎన్నికల నిబంధనకు వ్యతిరేకం. అలా చేయడం ఓటర్లను ప్రభావితం చేయడమే. 1961 ఎన్నికల నిర్వహణ చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం ఓటేసిన వ్యక్తులెవరూ తమ ఓటు రహస్యాన్ని బహిర్గతం చేయడానికి వీల్లేదు. ఒక పెద్ద మనిషి అలా చేయొచ్చా..? అయినా నేను చెప్పినదాంట్లో తప్పేముంది? మీడియాలో వేరుగా వస్తే మీరు ఖండించుకోండి. నేనెందుకు వివరణివ్వాలి? వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన నాయకులు ప్రవర్తించే విధానం ఇదేనా? మీ పార్టీ ప్రవర్తన ఇదా’’ అని ప్రశ్నించారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పారుతోందని తాము ఎన్నికల సంఘానికి చెప్పినా స్పందించలేదని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయగా..‘‘ దేశంలో పట్టుబడిన నగదులో 65 శాతం, 85 శాతం మద్యాన్ని ఇక్కడే పట్టుకున్నాం. అయినా ఎన్నికల సంఘం పనిచేయడం లేదంటే ఎలా? నేను వివక్ష చూపిస్తున్నట్లు మీరు భావిస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోండి’’ అని చెప్పారు. ఆనక వినతి పత్రం తీసుకుని... పరిశీలిస్తామని చెప్పారు. ఈ సంఘటన అనంతరం టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేస్తూ... భన్వర్‌లాల్ ప్రకటనను ఖండిస్తున్నామన్నారు. తమ నేత పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల అవతలే మాట్లాడారని చెప్పారు. కాగా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం డి ప్యూటీ కమిషనర్లు వినోద్ జుస్తి, అలోక్ శుక్లా వద్ద విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించగా... ‘‘బయటకు చెప్పకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే దాన్ని చెల్లని ఓటుగా ప్రకటించాలని మాత్రం లేదు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాం’’ అని వివరణ ఇచ్చారు. బాబుపై చర్య తీసుకోండి: వైఎస్సార్సీపీ చంద్రబాబునాయుడును ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నాయకులు భన్వర్‌లాల్‌ను కోరారు. బాబు తీరుపై వైఎస్సార్సీపీ నాయకులు శివకుమార్, నాగేశ్వరరావు తదితరులు బుధవారం రాత్రి సీఈఓను కలిపి ఫిర్యాదు చేశారు. -
మొరాయించిన చంద్రబాబు హెలికాప్టర్
బాగయిందన్నా ఎక్కకుండా కారులో వెళ్లిపోయిన టీడీపీ అధినేత ఒంగోలు: ప్రకాశం జిల్లాకు ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దర్శి నియోజకవర్గంలో ప్రచారం ముగిం చాక, బయలుదేరడానికి హెలికాప్టర్ వద్దకు వెళ్లగా, అది బయలుదేరడానికి మొరాయించింది. సాంకేతిక సమస్యల కారణంగా హెలికాప్టర్ పని చేయడం లేద ని, పది నిముషాల్లో పూర్తవుతుందని పైలట్ పేర్కొన్నారు. అయితే అందులో ప్రయాణించడానికి చంద్రబాబు విముఖత వ్యక్తం చేశారు. హెలికాప్టర్ గాలిలో వెళుతుం డగా, మరోసారి సాంకేతిక సమస్య ఏర్పడితే తన పరిస్థితి ఏమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో దర్శి నియోజకవర్గం తెలుగు దేశం అభ్యర్థి శిద్దారాఘవరావు కారులో కందుకూరు మీదుగా నెల్లూరు జిల్లా రాపూరుకు వెళ్లారు. మధ్యలో మార్కాపురంలో సభ జరగాల్సి ఉండగా, రద్దు చేసుకున్నారు. కందుకూరు సభలో కూడా మొక్కుబడిగా ప్రసంగించి వెళ్లిపోయారు. దీంతో నాలుగైదు గంటల ముందే జనసేకరణ చేసి న నాయకులు, చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పది నిముషాల్లో సిద్ధమైనహెలికాప్టర్ విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిపోయింది. -
....ఏరులు పారించారు
ఊరూ వాడా బెల్టు షాపులు పెట్టింది బాబు హయాంలోనే మద్యం వూఫియూకు పాలనలో చోటిచ్చిన ఘనుడు - వి. సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రగతిశీల వుహిళా సంఘం ‘వారుణివాహిని.. ఖజానాకు బంగారు బాతు..’ అని సాక్షాతు అసెంబ్లీలో తెలుగుదేశం ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. సీసాల్లో ఉండే వుద్యం చిన్నపాటి ప్యాకెట్ల ద్వారా ఇంటింటికీ అందేలా చేసిందీ ఆ ప్రభుత్వమే. వుద్యం అవ్ముకాలపై టార్గెట్స్ నిర్ణరుుంచిందీ.. ఊరూవాడల్లో బెల్టు షాపులు పెట్టిందీ.. ఐఎంఎఫ్ఎల్ చీప్ లిక్కర్‌ను వూర్కెట్లోకి తెచ్చింది నాటి వుుఖ్యవుంత్రి చంద్రబాబునాయుుడి సర్కారే. చివరికి వుద్యం వూఫియూ నేరుగా ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకునే స్థారుుకి తీసుకొచ్చిన అపకీర్తిని వుూటగట్టుకున్నది చంద్రబాబే! అసెంబ్లీలోనే ఒప్పుకున్న బాబు అసెంబ్లీలో మద్యం వూఫియూ ఆగడాలపై చర్చ జరిగి నప్పుడు ప్రభుత్వం ప్రకటించిన బూట్‌లెగ్గర్స్ (అక్ర వు వుద్యం వ్యాపారి) జాబితాలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా చంద్రబాబు ఒప్పుకున్నారు. చంద్రబాబునాయుుడి తవుు్మడు, నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న నారా రావుూ్మర్తినాయుుడికి కూడా వుద్యం వూఫియూతో సంబంధాలున్నారుు. అలాంటి వాళ్లపై చంద్రబాబు చర్యలు తీసుకోకపోగా వాళ్లు ఎగిరెగిరిపడకుం డా లొంగదీసుకునేందుకు రాజకీయుంగా వాడుకున్నా రు. పాతిక సంవత్సరాలుగా వుద ్యం వూఫియూ రాజకీయూల్ని శాసిస్తోంది. మద్యం మాఫియా ఇది వరకు సినివూ, రియుల్ ఎస్టేట్, విద్యా వ్యాపారాలకు ఆర్థిక సాయుం చేసే స్థారుులో ఉండేది. రాజకీయుపార్టీల్ని ప్రభావితం చేసే స్థారుులో ఉండేది. క్రవుంగా చంద్రబాబునాయుుడి పాలనలో ఏకంగా విధాన నిర్ణయూల్లో జోక్యం చేసుకునే స్థారుుకి చేరింది. అంతకు వుుందే వుద్యం వుహవ్మూరికి ఎంతో వుంది బాని సలు కావడంతో గ్రామీణ వుహిళలు ఉద్యమించారు. కారం, చీపుళ్లు పట్టుకుని సారా దుకాణాల్ని ధ్వంసం చేశారు. దూబగుంటలోనే కాదు అనేక గ్రావూల్లో వుహిళలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశారు. అప్పుడు వుద్య వ్యతిరేక పోరాట కమిటీలో టీడీపీ లేదు. వావుపక్షాలు, పీవోడబ్ల్యూ వంటి సంస్థలతో కమిటీ పనిచేసింది. ఉద్యవూన్ని సొవుు్మ చేసుకున్న టీడీపీ 1993 అక్టోబర్ 2న హైదరాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూల వూలలు వేసేందుకు ప్రతిపక్ష నాయుకుడి హోదాలో ఎన్టీ రా వూరావు, ఆయున వెంట నారా చంద్రబాబునాయుుడు వస్తే అడ్డుకున్నాం. టీడీపీకి కూడా వుద్యం వూఫియూతో సంబంధాలు ఉన్నారుు. రేపు వుళ్లీ అధికారంలోకి వచ్చినా టీడీపీలో వూర్పేమీ ఉండదనే ఉద్దేశంతో అడ్డుకున్నాం. ప్రతిపక్ష నాయుకుడ్ని కూడా ఉద్యవుం లోకి రానీయురా.. గాంధీ విగ్రహానికి దండ వేయునీయురా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. వారుణివాహిని పేరుతో సారాను ప్యాకెట్ల ద్వారా విచ్చలవిడిగా వుద్యం వినియోగంలోకి తేవడమే కాకుండా వారుణివాహిని ప్రభుత్వ ఖజానాకు బంగారు బాతు.. అని అసెంబ్లీలో చెప్పుకున్నారు. మీరు గాంధీ విగ్రహానికి దండ వేయుడానికి వీల్లేదు.. అని బదులిచ్చాం. ఎన్టీ రావూరావుకు బాగా కోపం వచ్చింది. మీకు ఏం కావాలో చెప్పండి.. అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే సంపూర్ణ వుద్య నిషేధం అవులు చేయూలన్న డివూండ్ ఆయున వుుందు పెట్టగానే అందుకు ఎన్టీఆర్ అంగీకరించాకే గాంధీ విగ్రహానికి దండ వేశారు. ప్రతిపక్ష నేత ఎన్టీఆర్ దండ వేశాక సీఎం కోట్ల విజయుభాస్కరరెడ్డి గాంధీ విగ్రహానికి దండ వేయుకపోతే ప్రతిష్ట దెబ్బతింటుందని పోలీసులు భావించి పెద్ద ఎత్తున లాఠీచార్జి చేశారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వుద్యం వ్యతిరేక ఉద్యవూన్ని రాజకీయుంగా అందివచ్చిన ప్రతి వేదికపైనా వాడుకుంది. పన్ను పోటు పొడిచి.. ఆపై వుద్యం ఏరులైపారించి.. అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ హెల్త్ పర్మిట్లు మినహా సం పూర్ణ వుద్య నిషేధం ఫైలుపై తొలి సంతకం చేశారు. వెన్నుపోటుదారుడు చంద్రబాబునాయుుడు అడ్డదారిలో సీఎం పగ్గాలు అందుకున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయున కంటే తనకే వుద్యనిషేధంపై ఎక్కువ చిత్తశుద్ధి ఉందని చెప్పుకుని నాటకాలు ఆడారు. వుద్యం హెల్త్ పర్మిట్లను సైతం రద్దు చేశారు. సంపూర్ణ వుద్య నిషేధం వల్ల రోడ్డు ప్రవూదాలు తగ్గారుు. జనం కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది. జనం జీవన ప్రవూణాలు మెరుగుపడ్డారుు.. అని తెలుగుదేశం ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. హెల్త్ పర్మిట్లు రద్దు చేసిన కొద్ది రోజులకే దశలవారీగా వుద్యానికి ద్వారాలు తెరిచేందుకు చంద్రబాబు చకచకా పావులు కదిపారు. దశలవారీగా వుద్య నిషేధాన్ని సడలించుకుపోయూరు. అప్పటికే వుద్యనిషేధం కారణంగా రాష్ట్ర ఆదాయుం పడిపోరుుందని చెప్పి జనంపై వేల కోట్ల రూపాయుల మేరకు మోపిన పన్నుల భారాన్ని వూత్రం యుథాతథంగా వసూలు చేరుుంచారు. బార్లకు తలుపులు బార్లా తీశారు. బ్రూవరీస్‌కు కూడా అనువుతులు ఇచ్చేశారు. ఇక్కడ వుద్యం ఉత్పత్తులు ఉన్నా ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరలకు కొనుగోళ్లు చేసి ఆ మేరకు వుద్యంబాబుల నుంచి వసూళ్లు చేశారు. ఇలా చేసిన వాళ్లల్లో కిరణ్‌కువూర్‌రెడ్డి కూడా ఉన్నారు. మద్యం అవ్ముకాలకు టార్గెట్లు: వుద్యం అవ్ముకాలకు టార్గెట్లు నిర్ణరుుంచిన చంద్రబాబు అందుకోసం పల్లెలకు, వాడలకు కూడా వుద్యం అందుబాటులో ఉండేలా బెల్ట్ షా పులు పెట్టడంతో జనంలో వుళ్లీ వ్యతిరేకత వచ్చింది. వుద్యం వుహవ్మూరికి ఎంతోవుంది యుువకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారుు. గ్రావూల్లో 35-50 వుధ్య వయుస్కుల చావులు పెరిగారుు. బతికి ఉన్నా వుద్యం తాగడం తప్ప ఏ పనీ చేయులేని నిస్సహాయుతతో కాలం వెళ్లదీస్తున్నారు. గ్రావూల్లో యుువ వితంతువుల సంఖ్య పెరుగుతోంది. వారితోబాటు తాగుబోతులతో బతుకువెళ్లదీయులేక ఒంటరి జీవితం గడుపుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. విం తువుల్లో 36 శాతం వుంది ఇలాంటి వారే ఉన్నారంటే వుద్యం ఎంతగా ప్రతికూల ఫలితాలిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క ప్రభుత్వం వుద్యం ఏరుల్లా పారించి భర్త ప్రాణాలు పోయేలా చేసి వురో పక్క వితంతువులకు పింఛన్లు ఇవ్వడవుంటే ఎంత దుర్మార్గమో చెప్పడానికి వూటలు రావడం లేదు. ఒకప్పుడు ఆదివాసీలు కల్లు, విప్పసారా తాగేవారు. ఇప్పుడు సర్కార్ పుణ్యవూని అక్కడ కూడా బెల్టు షాపులు ప్రత్యక్షం అయ్యూరుు. వ్యభిచారకూపంలో కూరుకుపోరుున 38 వుందికి వివుుక్తి కలిగినప్పుడు వారిని విచారిస్తే అందులో పన్నెండు వుంది భర్తలు తాగి హింసకు గురిచేయుడం వల్లే ఆ వూర్గంలో ఉన్నారని తేలింది. వురోసారి 125 వుందికి వివుుక్తి లభిస్తే, భర్త తాగడం వల్ల తవు కుటుంబం, పిల్లల పోషణ కోసం గత్యంతరం లేకే ఈ దారికి వచ్చావుని చెప్పా రు. చంద్రబాబు పాలనలో వుద్యం ఏరులై పారడంతో వుళ్లీ జనంలో తీవ్ర వ్యతిరేకత వస్తే, ఈసారి కాంగ్రెస్ సొవుు్మ చేసుకునే ప్రయుత్నం చేసింది. దశలవారీగా వుద్యనియుంత్రణ చేస్తావుని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా చేసిం ది. ఉపాధి కూలీల సొవ్ముంతా వుద్యం కొనుగోళ్ల ద్వారా తిరిగి ప్రభుత్వ ఖజానాకే చేరింది. జేబులో పెట్టుకునేంత చిన్న సైజు సీసాల్లో వుద్యం వాడుకలోకి వచ్చింది. ప్రభుత్వ బలహీనతల్ని సొవుు్మ చేసుకుని ఖజానాను నింపుకునే నేతల్ని, రాజకీయుపార్టీల్నీ వుహిళలు నిలదీయూలి. -
నాన్న బాటలోనే..
హిందూపురాన్ని ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తా: బాలకృష్ణ పెనుకొండ/మడకశిర తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే తన తండ్రి ఎన్టీఆర్ బాటలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హిందూపురం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బాలకృష్ణ అన్నారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా పెనుకొండ, మడకశిర నియోజకవర్గంలోని గుడిబండలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను పెనుకొండకు తెస్తామని, పరిశ్రమలు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పెనుకొండ ప్రజలకు రూ.2కే మినరల్ వాటర్ క్యాన్ అందిస్తామని, హంద్రీ- నీవా ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి కళ్యాణదుర్గాన్ని రూ.200కోట్లతో అభివృద్ధి చేశానని చెబుతున్నారని, అంత అభివృద్ధి చేసుంటే అక్కడి ప్రజలు ఎందుకు ఆదరించడం లేదని ప్రశ్నించారు. హిందూపురాన్ని ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గం పక్కనే ఉన్న మడకశిర నియోజకవర్గాన్ని కూడా తన నియోజకవర్గంగానే చూసుకుంటానని చెప్పారు. ప్రజలు టీడీపీని ఆదరించాలని ఆయన కోరారు. -
తెలంగాణలో టీడీపీ అభ్యర్థుల తిప్పలు
కాంగ్రెస్, టీఆర్ఎస్లకు ఏమాత్రం పోటీ ఇవ్వని దుస్థితి ఆశలు పెట్టుకున్న ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఎదురీత అనేక నియోజకవర్గాల్లో మూడో స్థానం కోసమే పోరు హెదరాబాద్: పోలింగ్ సమీపిస్తున్న సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ సమరోత్సాహంతో ముందుకు సాగుతుండగా, తెలుగుదేశం పార్టీ సరైన వ్యూహం లేక చతికిలపడుతోంది. తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా టీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతుండగా, తెలుగుదేశం పార్టీకి ఏ నినాదంతో ముందుకు పోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకోవాలని భావించినప్పటికీ, తెలంగాణ వచ్చే సమయంలో ఢిల్లీలో చంద్రబాబు చేసిన రాజకీయాలు ప్రజల కళ్లముందు కనిపిస్తుండడంతో ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉనికి చాటుకునేందుకు కూడా శ్రమించాల్సి వస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు కాకుండా మిగతా 8 జిల్లాల్లో ఎక్కడా టీడీపీ నుంచి ఇతర పార్టీలు గట్టిపోటీ ఎదుర్కోవడం లేదు. అరకొర నియోజకవర్గాల్లో పోటీ ఇస్తున్నా గెలిచే స్థాయిలో లేకపోవడం అభ్యర్థులకు ఇబ్బంది కరంగా మారింది. బీజేపీతో పొత్తు కొన్ని జిల్లాల్లోనే సఖ్యంగా సాగుతోంది. అనేక చోట్ల రెండు పార్టీలు కత్తులు దూసుకునే పరిస్థితే నెలకొంది. ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో బీజేపీతో పొత్తు టీడీపీ అభ్యర్థులకు కలిసిరాకపోగా, మరింత ఇబ్బందిగా మారింది. నల్లగొండలో చంద్రబాబు నిర్వహించిన బహిరంగసభలు కూడా తూతూ మంత్రంగా సాగాయంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఏ జిల్లాలో కూడా రెండు, మూడు నియోజకవర్గాలలో మించి ఉనికి కనబరిచే స్థితిలో టీడీపీ లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా చోట్ల చేతులెత్తేశారు. ఇక టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖమ్మంలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అక్కడ ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు వర్గాలు ఒకరినొకరు ఓడించుకునేందుకు కష్టపడుతూ, ఇతర పార్టీలకు విజయావకాశాలను సునాయాసం చేస్తున్నాయి. రంగారెడ్డిలో సీట్ల కేటాయింపులో ఏర్పడిన లొల్లి ఆ పార్టీ పుట్టిముంచుతోంది. అనేక చోట్ల పార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వస్తోంది. ఎల్బీ నగర్లో బీసీ సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆర్. కృష్ణయ్య తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక్కడ టికెట్టు కోసం పోటీ పడ్డ ఎస్.వి. కృష్ణప్రసాద్, ఆయన మద్దతుదారులు ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కమ్మ వర్గానికి చెందిన సెటిలర్స్‌ను కోల్పోవడం కృష్ణయ్యపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హైదరాబాద్‌లో ఏ సీటు కచ్చితంగా గెలుస్తామని చెప్పే స్థితిలో టీడీపీ లేదు. సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, నాంపల్లి వంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఎదురీదుతున్నారు. జిల్లాల్లో పరిస్థితి ఇదీ .. ఖమ్మం: ఇక్కడి 10 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 9 చోట్ల, బీజేపీ ఒకచోట పోటీ చేస్తోంది. ఒక్కరికీ గెలుస్తామనే ధీమా లేదు. పాలేరు, కొత్తగూడెం అభ్యర్థులకు తుమ్మల వర్గం సహాయ నిరాకరణ చేస్తుండగా, తుమ్మలతో పాటు ఆయన వర్గీయులు పోటీచేస్తున్న 5 నియోజకవర్గాల్లో నామా వర్గం అదే రీతిలో ఉంది. అశ్వారావుపేటలో ఎం. నాగేశ్వరరావు కొంత మేర పోటీ ఇస్తున్నా గెలుపుపై ధీమా లేదు. మధిరలో మోత్కుపల్లి నర్సింహులు ఎదురీదుతున్నారు. మెదక్: జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఆరు చోట్ల టీడీపీ పోటీ చేస్తోంది. మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ రంగంలో ఉండడంతో టీడీపీ అభ్యర్థులకు గెలుస్తామని ధీమాగా చెప్పే పరిస్థితి ఒక్కచోట కూడా లేదు. బీజేపీ సహకారం ఏమాత్రం లేదు. పటాన్చెరులో టీడీపీ అభ్యర్థికి బీజేపీ రెబల్ అంజిరెడ్డి ప్రమాదకరంగా మారారు. కరీంనగర్: 13 సెగ్మెంట్లలో టీడీపీ 6 చోట్ల పోటీలో ఉంది. అన్ని చోట్ల త్రిముఖ, బహుముఖ పోటీ నెలకొంది. జగిత్యాల, పెద్దపల్లి, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు కొంత పోటీ ఇస్తున్నారు. మిగతా చోట్ల నామ్‌కే వాస్తే. చొప్పదండిలో జేఏసీ విద్యార్థి నేత మేడిపల్లి సత్యంకు చివరి నిమిషంలో టికెట్ ఇవ్వడంతో పార్టీ పరిస్థితి కొద్దిగా మెరుగుపడినట్లు కనిపిస్తోంది. వరంగల్: త్రిముఖ పోటీలో నామ్కేవాస్తేగా మారిపోయింది. మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్ ఘన్పూర్లలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాలకుర్తిలో ఎర్రబెల్లి, ములుగులో సీతక్క, పరకాలలో ధర్మారెడ్డి, నర్సంపేటలో రేవూరి ప్రకాశ్ రెడ్డి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్: కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తుండడంతో ఇక్కడ టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని 9 సీట్లకు గాను టీడీపీ 5 చోట్ల పోటీ చేస్తుండగా, బా ల్కొండలో మాత్రమే మల్లికార్జునరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డికి కొద్దిగా పోటీ ఇస్తున్నారు. అదిలాబాద్: జిల్లాలోని 10 సీట్లకుగాను టీడీపీ ఆరుచోట్ల పోటీ చేస్తోంది. బోథ్‌లో సోయం బాబూరావు మాత్రమే పోటీ ఇస్తున్నారు. మిగతా అన్ని చోట్ల మూడోస్థానం కోసమే టీడీపీ పోటీ పడుతోంది. నల్లగొండ: జిల్లాలోని 8 చోట్ల పోటీ చేస్తున్న టీడీపీ దేవరకొండ, కోదాడ, భువనగిరి నియోజకవర్గాల్లో వూత్రమే ఓమోస్తరు పోటీలో ఉండగా, నల్లగొండ, నాగార్జున సాగర్, నకిరేకల్, సూర్యాపేటల్లో వుూడోస్థానం కోసం పోటీ పడుతోంది. -
టీడీపీ భూస్థాపితం ఖాయం
పలమనేరు, న్యూస్‌లైన్: మాజీ మంత్రి పట్నం సుబ్బ య్య తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో కొండంత బలం వచ్చిందని పలువు రు మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద సోమవారం సుబ్బయ్యకు పార్టీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలమనేరు అసెంబ్లీ అభ్యర్థి అమరనాథ రెడ్డి మాట్లాడుతూ సుబ్బయ్య లాంటి సీనియర్ నాయకులు తమ పార్టీలోకి రావడం చాలా సంతోషకరమన్నారు. ఆయన రాకతో పార్టీకి మరింత బలం పెరిగిం దన్నారు. ఇదే సమయంలో పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమన్నారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు దళిత నేతలంతా ఏకతాటిపైకి రావడం, ముస్లిం మైనారిటీలు అండగా నిలవడం, బడుగు బలహీన వర్గాలు తమ పార్టీని అక్కున చేర్చుకోవడం పార్టీకి ఎంతగానో మేలు చేస్తుందన్నారు. చంద్రబాబు కుమ్మక్కు, కుట్ర లు నచ్చక ఎంతోమంది సీనియర్లు ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు. ఇప్పటిదాకా టీడీపీ ఈ ప్రాం తంలో సజీవంగా ఉందంటే దానికి కారణం సుబ్బయ్య కృషేనన్నారు. అలాంటి వ్యక్తి తమ పార్టీలోకి రావడం తన కు ఎంతగానో మేలు చేకూరుస్తుందన్నారు. అనంతరం చిత్తూరు మాజీ ఎమ్మెల్యే మనోహర్ మాట్లాడుతూ సుబ్బయ్య రాకతో పలమనేరు అసెంబ్లీ ఎన్నికల్లో అమరనాథరెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నా రు. టీడీపీ డబ్బున్న వారితో నిండిపోయిందని విమర్శించారు. వేపంజేరి మాజీ ఎమ్మెల్యే గాంధీ మాట్లాడు తూ వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. అందు కే ప్రజల మద్దతు వైఎస్ఆర్సీపీకి ఉందన్నారు. సుబ్బ య్య పార్టీలోకి రావడం తమకందరికీ సంతోషాన్ని కలిగించిందన్నారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం వైఎస్ఆర్ సీపీతోనే సాధ్యమన్నారు.అనంతరం మాజీమంత్రి సుబ్బయ్య మాట్లాడారు. ఇంతమంది మిత్రుల మధ్య తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం చాలా ఆనందించదగ్గ విషయమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. పలమనేరులో అమరనాథరెడ్డి గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ హేమంత్‌కుమార్ రెడ్డి, సీవీ.కుమార్, ఖాజా, రవీంద్ర, శ్యామ్, మూర్తి, కమాల్, ఖాజా, ఎలి జర్,మోహన్ రెడ్డి, ఏకే.మూర్తి, కిషోర్, షబ్బీర్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆశావహులకు అశనిపాతమే
తెలుగుదేశం శ్రేణుల్లో రగులుతున్న ఆగ్రహం తోటకు కాకినాడ ,పండులకు అమలాపురం ఎంపీ సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యే ‘చందన’కు మొండిచేయి నేడు బాబుకు సోకనున్న నిరసన సెగలు సాక్షి, కాకినాడ : అభ్యర్థుల జాబితాలు ఆశావహులను నిస్పృహకు లోను చేస్తూ తెలుగుదేశంలో చిచ్చు రగిలిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తుపై ఆగ్రహంతో ఉన్న తెలుగుతమ్ముళ్లు.. మంగళవారం జిల్లాలో పర్యటించనున్న అధినేత చంద్రబాబునాయుడి వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ తొలి జాబితాలో ఇద్దరు సి ట్టింగ్లతో పాటు పార్టీ కోసం పని చేసిన ఐదుగురికి అవకాశం కల్పిం చినా మలి జాబితా నుంచి గోడ దూకినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్తపేట, రామచంద్రపురం సీట్లను ఇటీవలే పార్టీలోకి వచ్చిన బండారు సత్యానందరావు, తోట త్రిమూర్తులుకు కట్టబెట్టారు. సోమవారం నాటి మూడో జాబితా లో కూడా అదే ఫార్ములా పాటిం చారు. ఇటీవలే సైకిల్ ఎక్కిన తోట నరసింహానికి కాకినాడ ఎంపీ సీటు, విశాఖలో కస్టమ్స్ అడిషనల్ కమిషనర్‌గా వీఆర్ఎస్ తీసుకున్న పండుల రవీంద్రబాబుకు అమలాపురం ఎంపీ సీటు కట్టబెట్టారు. కా కినాడ అసెంబ్లీ స్థానాన్ని వనమాడి వెంకటేశ్వరరావు కు, రాజమండ్రి రూరల్ స్థానాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయిం చారు. కాగా తోట కాకినాడ ఎంపీ అభ్యర్థిగా మంగళవారం నా మినేషన్ వేయనున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి సైకిలెక్కిన తోట కోసం.. లోక్‌సభ సీటుపై గతంలోనే బాబు నుంచి స్పష్టమైన హామీ పొందిన కైట్ విద్యాసంస్థల అధినేత పోతుల విశ్వానికి మొండిచేయి చూపడంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కనీసం పెద్దాపురం లేదా పిఠాపురం అసెంబ్లీ సీట్లలో ఏదో ఒకటి ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని విశ్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర సమయంలోనే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యా రావుకు అమలాపురం ఎంపీ టికెట్ ఇస్తానన్న చంద్ర బాబు ఇప్పుడు మాట మార్చి రాజకీయాలతో సంబంధం లేని రవీంద్రబాబుకు టికెట్ కేటాయించడంతో గొల్లపల్లి అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బీసీ నేత అనే చందనకు మొండిచేయి.. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురికి అవకాశం కల్పించిన బాబు తనకూ చాన్సిస్తారని ఆశించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్‌కు భంగపాటు తప్పలేదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన చందనకు మొండి చేయి చూపుతూ ఆ స్థానాన్ని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కట్టబెట్టారు. బీసీ కాబట్టే తమ నాయకుడిని పక్కన పెట్టారని చందన అనుచరులు మండిపడుతున్నారు. ఎన్నికల్లో బీసీల సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక కాకినాడ అసెంబ్లీ సీటును ఆశించిన మాజీ మంత్రి ముత్తాగోపాలకృష్ణకు భంగపాటు తప్పలేదు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ముత్తాను కాదని మళ్లీ వనమాడి కొండబాబుకు టికెట్ ఇవ్వడం పట్ల ముత్తా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు తమ సామాజిక వర్గానికి ఒక అసెంబ్లీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి మోసగించిన చంద్రబాబు ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు జిల్లాలోని మాదిగలు సిద్ధమవుతుండగా, మరోవైపు టిక్కెట్లు దక్కని ఆశావహులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. -
సీన్ మారింది
నిన్న అనకాపల్లి.. నేడు యలమంచిలి‘దేశం’లో రచ్చ రచ్చ పంచకర్లకు టికెట్ కేటాయించారనే సమాచారంతో తమ్ముళ్ల శివాలు టీడీపీ అధిష్టానంపై ఆగ్రహావేశాలు పార్టీ కార్యాలయంలో విధ్వంసం ఫర్నిచర్‌కు నిప్పు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నం యలమంచిలి రూరల్, న్యూస్‌లైన్ : జిల్లా తెలుగుదేశంలో పరిస్థితి బాగోలేదు. తెలుగుతమ్ముళ్లు రగిలిపోతున్నారు. అనకాపల్లి నియోజకవర్గ టీడీపీలో ఎటువంటి పాత్ర పోషించని పీలా గోవింద్‌కు సీటు ఖరారైందన్న వార్తతో కోర్ కమిటీ పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి వీరంగం సృష్టించారు. ఇది మరిచిపోకముందే యలమంచిలి నియోజవర్గ టీడీపీ టికెట్ వ్యవహారం వివాదాస్పదంగా మారి రచ్చరచ్చయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పట్టణంలోని తెలుగుతమ్ముళ్లు శివాలెత్తిపోయారు. పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహావేశాలు వెలిబుచ్చారు. నియోజకవర్గ టీడీపీ టికెట్‌ను పంచకర్ల రమేష్‌బాబుకు అధిష్టానం కేటాయించిందన్న సమాచారంతో సుందరపు విజయ్‌కుమార్ అనుచరులు రెచ్చిపోయారు. ఆదివారం సాయంత్రం రోడ్డెక్కారు. యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు యలమంచిలి చేరుకుని తీవ్ర నిరశన వ్యక్తం చేశారు. విజయ్‌కుమార్ ఇంటినుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక్కడి పీవీ కాంప్లెక్స్‌లో ఉన్న టీడీపీ కార్యాలయం ఎదుట బైటాయించి ఆందోళన చేపట్టారు. కార్యాలయంలోపలి ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. విజయ్‌కుమార్‌కు టికెట్ కేటాయించాలంటూ నినాదాలు చేశారు. కొందరు కిరోసిన్‌తో ఆత్మహత్యకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని తోటి కార్యకర్తలు నివారించారు. రెండేళ్లుగా పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న నియోజకవర్గ ఇన్చార్జి సుందరపు విజయ్‌కుమార్‌ను కాదని స్థానికేతరుడైన పంచకర్ల రమేష్‌బాబుకు టికెట్ కేటాయించడం అన్యాయమని ఆపార్టీ నాయకులు బొద్దపు శ్రీను, గొర్రెల నానాజీ, కాండ్రకోట చిరంజీవి, లవుడు లోవరాజు, రంగనాయకులు తదితరులు తెలిపారు. ప్రాదేశిక, మున్సిపాలిటీ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించారన్నారు. నియోజకవర్గంలో దాదాపు 36 గ్రామపంచాయితీల్లో టీడీపీ విజయానికి కృషిచేశారన్నారు. పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వారిని కాదని స్థానికేతరులకు సీటు కేటాయించడానికి తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. సోమవారం సాయంత్రంలోగా విజయ్‌కుమార్‌కు టీడీపీ బి-ఫారం ఇవ్వకపోతే తమ పదవులకు, పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. మండల తెలుగుదేశంలో నిస్తేజం మునగపాక: మండల తెలుగుదేశం పార్టీలో నిస్తేజం అలముకుంది. నిన్నటి దాకా పార్టీని నడిపించి.. జెండాలు భుజాన మోసిన వారిని కాదని వలస నాయకులకు అధిష్టానం టికెట్ కేటాయిస్తున్నదన్న ప్రచారంంతో తెలుగుతమ్ముళ్లలో ఆందోళన మొదలైంది. మునగపాక మండలంలో పార్టీకి జవసత్వాలు కల్పించిన నియోజకవర్గ ఇన్చార్జి సుందరపు విజయకుమార్‌కు యలమంచిలి సీటు కేటాయించే పరిస్థితులు లేవని తెలుసుకున్న వారంతా లోలోన మథనపడుతున్నారు. కొత్తవారికి సీటు కేటాయిస్తున్న వైనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో యువకులు సుందరపుకు సీటు రాకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామంటూ బాహాటంగానే చెబుతున్నారు. రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని పలువురు పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేయడం విశేషం. చంద్రబాబు పొరపాట్లు చేస్తున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు ‘న్యూస్‌లైన్’వద్ద వాపోయారు. -
రంగారెడ్డి జిల్లా నుంచి బాలయ్య!
కుత్బుల్లాపూర్ లేదా శేరిలింగంపల్లిలో పోటీ చేసే అవకాశం బాలకృష్ణ బరిలో ఉంటారనే ప్రచారంతో ఆశావహుల్లో కలవరం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జిల్లా నుంచి బరిలోకి దిగనున్నారా.. అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం నేతలు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ పరువు నిలబెట్టే స్థానాలు సాధించాలంటే సొంత కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీచేస్తే బాగుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. గతంలో మల్కాజిగిరి లోక్‌సభ లేదా శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేయాలని చంద్రబాబు యోచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక్కడి నుంచి పోటీ చేస్తే సీమాంధ్ర ప్రాంతంలో తనపై, పార్టీపై వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. దీంతో తన వియ్యంకుడు బాలకృష్ణను రంగంలోకి దింపుతున్నారు. ఆయనను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తే సీమాంధ్ర ప్రాంతంలో తనకు అడ్డు ఉండదనే ఆలోచన కూడా దీని వెనక ఉన్నట్లు కనిపిస్తోంది. జిల్లా నుంచి బాలకృష్ణ పోటీ చేసే పక్షంలో కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లిలలో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ రెండింటిలో ఒక దానికి పోటీచేస్తే ఎలా ఉంటుందనే యోచనలో బాలకృష్ణ ఉన్నారు. బాలకృష్ణ జిల్లాకు వస్తారని ప్రచారం జరుగుతుండటంతో స్థానిక నేతలు తమ సీటు ఎక్కడ గల్లంతవుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. శేరిలింగంపల్లి నుంచి మొవ్వా సత్యనారాయణ, బండి రమేష్, అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ నుంచి కేపీ వివేకానంద టికె ట్లు ఆశిస్తున్నారు. మల్కాజిగిరి సీటును బీజేపీకి పొత్తులో పోని పక్షంలో మైనంపల్లి హనుమంతరావు, వీకే మహేష్, ముదిరాజ్‌లలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ఎంతో కాలం నుంచి వ్యయ ప్రయాసలకోర్చి స్థానికంగా పార్టీని కాపాడుకుంటున్న వారిని కాదని, పార్టీ అధినేత తమ వియ్యంకుడిని బరిలోకి దించేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. -
వైఎస్సార్ సీపీ జోష్
జిల్లాలోని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు షాక్ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగర్జన పేరిట నగరంలో బహిరంగ సభ నిర్వహించిన బుధవారంనాడే ఆ పార్టీని ఏళ్ల తరబడి వెన్నంటి ఉన్న నగరానికి చెందిన గుడివాడ కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేర డం గమనార్హం. నగరానికి చెందిన టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు భార్య గు డివాడ నాగమణి, కుమారుడు, 65వ వార్డు మాజీ కార్పొరేటర్ గుడివాడ అమర్నాథ్, గురునాథరావు సోదరుడు అప్పలరామయ్యతో కలిసి కుటుంబమంతా హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్‌ను సీఎం చేసేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఏళ్ల తరబడి టీడీపీకి సేవ చే సినా.. వెన్నుపోటుదారులు, స్వార్థపరులకు ఆశ్రయం కల్పించి, నమ్ముకున్నవారిని నట్టేట ముంచే సంస్కృతి చంద్రబాబునాయుడుదని, అందుకే ఆ పార్టీలో ఇమడలేకపోయామన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి జిల్లా, నగరంలో కూడా కోలుకోలేని దెబ్బ తగిలింది. .పశ్చిమ నియోజక వర్గం ఎమ్మెల్యే, వెల్ఫేర్ సంస్థల అధినేత మళ్ల విజయప్రసాద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆ పార్టీని వీడారు. బుధవారం హైదరాబాద్ వెళ్లి జగన్ సమక్షంలోనే వైఎస్సార్ సీపీలో చేరారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగానే ఆ పార్టీని వీడామని, సమైక్య రాష్ట్రం కోసం ఆది నుంచీ కృషి చేసిన ఏకైక వ్యక్తి వై.ఎస్.జగనేనని కొనియాడారు. సీట్లతో సంబంధం లేకుం డా జిల్లాలో పార్టీని విజయపథాన నడిపించి, జగన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెడతామని ధీమా వ్యక్తం చేశారు. తాజా చేరికలతో ఇటు నగరం, అటు జిల్లాలో వైఎస్సా ర్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత ఉరకలేస్తోంది. పార్టీలో చేరిన ఈ నేతలతోపాటు పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకటరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు గండి బాబ్జీ, చెంగల వెంకట్రావు, పూడి మంగపతిరావు, బూడి ముత్యాలునాయుడు, ప్రగడ నాగేశ్వరరావు తదితరులున్నారు. -
దేశం’ జిల్లా సారథి మంచిరెడ్డి
రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా సారథిగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రక టించారు. జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన పి.మహేందర్‌రెడ్డి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంచిరెడ్డి గతంలో తొమ్మిదేళ్లపాటు జిల్లా పార్టీ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వేళ సమర్థుడిగా పేరున్న ఆయన నాయకత్వానికి చంద్రబాబు మొగ్గు చూపారు. శనివారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, టీజేఏసీ సలహాదారు చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్ నేతృత్వంలో వందలాదిమంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌తో ప్రత్యేకంగా చంద్రబాబు సమావేశమయ్యారు. సీనియరైన మంచిరెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందించిన ప్రకాశ్... ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలిసింది. వందమందిని తయారు చేస్తా.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. శాటిలైట్ టౌన్‌గా అభివృద్ధి చేయడానికి హైదరాబాద్‌తో వికారాబాద్‌ను అనుసంధానం చేస్తానని అన్నారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడంతోపాటు విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నా రు. టీడీపీని ఖాళీ చేయిస్తామని కొందరు మాట్లాడుతున్నారని.. ఖాళీ కావడానికి బ్రాందీ సీసా కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బలమైన కేడర్ ఉన్నంత వరకు పార్టీని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఒక్కొక్కరికి సమానంగా వందమందిని తయారుచేస్తానన్నారు. పురపాలక సం ఘాల్లో పార్టీ సత్తా చాటేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.