బాగయిందన్నా ఎక్కకుండా కారులో వెళ్లిపోయిన టీడీపీ అధినేత
ఒంగోలు: ప్రకాశం జిల్లాకు ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దర్శి నియోజకవర్గంలో ప్రచారం ముగిం చాక, బయలుదేరడానికి హెలికాప్టర్ వద్దకు వెళ్లగా, అది బయలుదేరడానికి మొరాయించింది. సాంకేతిక సమస్యల కారణంగా హెలికాప్టర్ పని చేయడం లేద ని, పది నిముషాల్లో పూర్తవుతుందని పైలట్ పేర్కొన్నారు. అయితే అందులో ప్రయాణించడానికి చంద్రబాబు విముఖత వ్యక్తం చేశారు. హెలికాప్టర్ గాలిలో వెళుతుం డగా, మరోసారి సాంకేతిక సమస్య ఏర్పడితే తన పరిస్థితి ఏమిటని ప్రశ్నించినట్లు తెలిసింది.
దీంతో దర్శి నియోజకవర్గం తెలుగు దేశం అభ్యర్థి శిద్దారాఘవరావు కారులో కందుకూరు మీదుగా నెల్లూరు జిల్లా రాపూరుకు వెళ్లారు. మధ్యలో మార్కాపురంలో సభ జరగాల్సి ఉండగా, రద్దు చేసుకున్నారు. కందుకూరు సభలో కూడా మొక్కుబడిగా ప్రసంగించి వెళ్లిపోయారు. దీంతో నాలుగైదు గంటల ముందే జనసేకరణ చేసి న నాయకులు, చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పది నిముషాల్లో సిద్ధమైనహెలికాప్టర్ విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిపోయింది.
మొరాయించిన చంద్రబాబు హెలికాప్టర్
Published Wed, Apr 30 2014 1:14 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement