
ఓటుకే తప్ప సీటుకు చాలమా?
ఓటుకే తప్ప
సీటుకు చాలమా?
ఒకప్పుడు జిల్లాలో తెలుగుదేశం అంటే బీసీలు ,బీసీలంటే తెలుగుదేశం అన్న పరిస్థితి ఉండేది. అయితే చంద్రబాబు ఒంటెత్తు పోకడలపై ఆ పార్టీలోని బీసీలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. బీసీలలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గంలో అత్యధికులు టీడీపీకి సానుకూలంగా ఉండేవారు.
అయితే తమకు పార్టీలో ప్రాధాన్యం తగ్గించేస్తుండడాన్నిఆ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తమను అణగదొక్కే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.