వారసుల వెనకడుగు | political leaders sons will be back | Sakshi
Sakshi News home page

వారసుల వెనకడుగు

Published Sat, Feb 22 2014 1:45 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

వారసుల వెనకడుగు - Sakshi

వారసుల వెనకడుగు


 జిల్లాలో అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీల్లోని సీనియర్ల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం, టీడీపీ ఉనికి కోల్పోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. నిన్నటి వరకు తమ వారసుల రాజకీయ రంగప్రవేశంపై ఆలోచనలు చేసిన సీనియర్లు నేడు తలలు పట్టుకుంటున్నారు. కొందరు సీనియర్లు ఈ సారికి తప్పుకుని వారసులనే ఎన్నికల బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. అయితే వారసులు మాత్రం తమ తండ్రులను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకుంటున్నారు.
 
 పనిచేయడం అనుమానమనే అంటున్నారు.  రాయపాటి శ్రీనివాస్ కూడా పార్టీకి రాజీనామా చేయడంతో పొన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీలో లేనట్టే. వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పెద్ద కుమారుడు నాగరాజు కూడా గుంటూరు మేయర్‌గా పనిచేశారు. ఈ ఎన్నికల్లో కన్నా రెండో కుమారుడు  ఫణీంద్ర రాజకీయ రంగప్రవేశం చేస్తారని ప్రచారం జరిగింది. పెదకూరపాడు నుంచి ఎన్నికల బరిలోకి దింపే ఆలోచనలో మంత్రి ఉన్నారని  అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన  వెనుకంజ వేసినట్లు మంత్రి సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.
 
  మరో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు మహేష్‌రెడ్డి 2004 ఎన్నికల్లోనే పోటీ చేయాలని భావించారు. అప్పట్లో వీలుపడలేదు. ఈ సారి మంత్రి కాసు లోక్‌సభకు పోటీచేస్తే తనయుడు మహేష్ అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. నరసరావుపేట టీడీపీ నేతలు సైతం మహేష్‌ను పార్టీలోకి ఆహ్వానించినా తండ్రి మాటతో కాంగ్రెస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
 
 అయితే, కాంగ్రెస్ మనుగడ కష్టమైన నేపథ్యంలో ఈ సారికి తాను ఆగిపోయి తండ్రిని గెలిపించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణను రాజకీయాల్లోకి తీసుకురావాలని తండ్రి కసరత్తు చేసినా.. ఆయన మాత్రం తాను టీడీపీ రాజకీయాలకు దూరంగానే ఉంటానని తెగేసి చెప్పినట్లు సమాచారం. మరో కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి తన కుమారుడు మధుసూదనరెడ్డిని ఈసారి బాపట్ల నుంచే కాంగ్రెస్ తరఫున పోటీ చేయించాలని చూసినా విభజన అంశంలో జరిగిన పరిణామాలు ఆయనకు అడ్డుపడుతున్నట్టు తెలిసింది. గాదె వెంకటరెడ్డి కూడా పార్టీ మారే ఆలోచనలో పడినట్లు సమాచారం. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గల్లా ఆరుణకుమారి తన కుమారుడు జయదేవ్‌ను టీడీ పీ తరఫున గుంటూరు ఎంపీగా బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఆ తరువాత జరిపించినసర్వేలో ప్రతికూల పరిస్థితులు ఉన్నట్టు తేలడంతో  వెనుకంజ వేసినట్లు టీడీపీవర్గాల సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement