దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అడుగంటిందని చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నెల్లూరులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరమైన పాలన అందించకపోవడం వల్ల రాష్ట్రంలోని పరిశ్రమలు అప్పులు పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విజయవంతమైన పారిశ్రామివేత్తగా చూడాలని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్పై ఆరోపణలు మాని రాష్ట్రంలో పరిశ్రమల ప్రగతికి సహకరించాలని కాంగ్రెస్, టీడీపీలకు ప్రశాంత్ కుమార్ రెడ్డి హితవు పలికారు.