మర్రిగూడ, న్యూస్‌లైన్: బీజేపీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం మర్రిగూడలో బీజేవైఎం ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గస్థాయి యువభేరిని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం అంతా అవినీతి, కుంభ కోణాల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. తొమ్మిది సంవత్సరాల పరిపాలన కాలంలో 10లక్షల కోట్ల రూపాయలను దోచుకుందని విమర్శించారు. రాష్ట్రంలో కిరణ్, చంద్రబాబు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా శాసనసభలో అడ్డుపడుతున్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం ఖాయమన్నారు. 1100మంది యువకుల ఆత్మహత్యకు కారణమైన సొనియాగాంధీకి తెలంగాణలో గుడి కడతామనడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ర్టం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు.
నల్లగొండ జిల్లా ప్రజలు 60ఏళ్ల నుండి ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడడానికి ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నాయకులేనని విమర్శించారు. ఫ్లోరోసిస్‌ను పూర్తిగా నివారించాలంటే తాగునీటితో పాటు సాగునీరు అందించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నక్కలగండి, డిండి ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించి ఈ ప్రాంతంలో సాగు నీరు అందిస్తామని చెప్పారు. నేడు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి జనం ఇబ్బందులు పడుతున్నా వాటిని తగ్గించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల కష్టాలు తీరాంటే నరేంద్రమోడీ ప్రధానమంత్రి కావాలన్నారు. పార్టీ రాష్ట్ర కోశాధికారి గంగడి మనోహార్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. పాలకుల నిర్లక్ష్యం మూలంగా వే లాదిమంది ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి యువ కిరణాల పేరుతో గాంధీ కుటుంబ సభ్యులు పేర్లను ప్రచారం చేశాడు తప్ప.. యువతకు ఒరిగిందేమీ లేదన్నారు.
అంతకు ముందు మర్రిగూడ బస్టాండ్ వద్ద స్వామి వివేకానందుని విగ్రహాన్ని కిషన్‌రెడ్డి ప్రారంభించారు. సభలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, నాయకులు పల్లె శ్యాసుందర్, యాస అమరేందర్‌రెడ్డి, దోనూరి వీరారెడ్డి, తూటపల్లి రవికుమార్, కిరణ్‌కుమార్, చెన్నగోని రాములు, కూతురు లకా్ష్మరెడ్డి, దూడల భిక్షం, పాలకూర్ల జంగయ్య, నల్ల యాదయ్య, బండి వెంకట్, నర్రా పరమేష్, చెరకు శ్రీరాములు, దుబ్బ కాశయ్య, మెండు మోహన్‌రెడ్డి, పిట్టల పాండు, పగుడాల నాగేష్, భవనం మధుసూదన్‌రెడ్డి కోమటి వీరేశం, వెంకటంపేట శేఖర్ పాల్గొన్నారు.