టీఆర్‌ఎస్ చిల్లర పార్టీ అని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉద్యమకారులను కాకుండా ఇతరులకు టికెట్లు అమ్ముకున్నాడని బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి నరేంద్రనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
దుబ్బాక, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ చిల్లర పార్టీ అని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉద్యమకారులను కాకుండా ఇతరులకు టికెట్లు అమ్ముకున్నాడని బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి నరేంద్రనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం దుబ్బాకలో పార్టీ అసెంబ్లీ అభ్యర్థి రఘునందన్‌రావు అధ్యక్షతన బీజేపీసమరభేరి సభ జరిగింది. ఈ సందర్భంగా నరేంద్రనాథ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తోపాటు కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. మెదక్ లోక్‌సభకు పోటీ చేస్తున్న కేసీఆర్ ఓటమి భయంతోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే తనపై గెలవాలని సవాల్ విసిరారు. చిల్లర పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లోకి తాను వెళ్లేది లేదన్నారు. ప్రా ణం ఉన్నంత వరకు తాను బీజేపీలోనే కొనసాగుతానని చెప్పారు. దుబ్బాక చేనేతలను ఆదుకునేందుకు ఈ ప్రాం తంలో పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి వాటర్ ప్లాంట్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు.
చేనేతలకిచ్చిన హామీ ఏది?
దుబ్బాక చేనేతలను ఆదుకునేందుకు రూ.25లక్షలతో ట్రస్టు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ గత ఎన్నికల్లో ప్రకటించినా ఇప్పటివరకు నేరవేర్చలేకపోయారని దుబ్బాక అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. డబ్బులున్న వారికి టికె ట్లు అమ్ముకున్న ఘనుడు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్, కాం గ్రెస్‌లు మోసపూరిత పార్టీలని ఆ పార్టీల నేతలు చెప్పే మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బుచ్చిరెడ్డి, బీజేపీ, టీడీపీ నాయకులు బాలేష్‌గౌడ్, నరేష్, గిరీష్‌రెడ్డి, శ్రీనివాస్, కమలాకర్‌రెడ్డి, బక్కి వెంకటయ్య, రమేశ్ పాల్గొన్నారు.
సమర భేరికి కిషన్‌రెడ్డి గైర్హాజర్
బీజేపీ సమరభేరి సభకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి, సినీనటి జీవిత గైర్హాజరు కావడంతో ఆ పార్టీ శ్రేణులు, ప్రజలు నిరాశ చెందారు. కిషన్‌రెడ్డి, జీవిత సభకు విచ్చేస్తున్నారంటూ స్థాని కంగా గత రెండు రోజులుగా పార్టీ నా యకులు ప్రచారం చేశారు. సభ ప్రారంభమైనా వారు రాకపోవడంతో బీజేపీ, టీడీపీ కార్యకర్తలతోపాటు స్థానికులు అసంతృప్తికి లోనయ్యారు. సమయభావం కారణంగా వారు రావడం లేదని నాయకుల ప్రసంగాల ద్వారా తెలుసుకున్న జనం కొద్ది కొద్దిగా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు.