ఎర్రచందనం దుంగల పట్టివేత
తిరుపతి: పట్టణ శివారులో టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.20లక్షలు విలువజేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రచందనం అక్రమరవాణా జరుగుతోందనే సమాచారంతో పట్టణ శివారులో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. జూ పార్క్ సమీపంలో కూడా తనిఖీలు చేపట్టడంతో ఇది గమనించిన ఎర్రచందనం కూలీలు దుంగలను వదిలేసి పారిపోయారు.
దీంతో కూలీలు వదిలేసి పారిపోయిన దుంగలను, బొలేరో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.