రాష్ట్రంలోని ఎరచ్రందనం స్మగ్లర్‌ల నల్లధనం తమళనాడులోని జవాదమలై గ్రామానికి చెందిన ఎరచ్రందనం కూలీల ఖాతాల్లో జమ అయినట్లు ప్రాథమిక
టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు
వెంకటగిరి: రాష్ట్రంలోని ఎరచ్రందనం స్మగ్లర్‌ల నల్లధనం తమళనాడులోని జవాదమలై గ్రామానికి చెందిన ఎరచ్రందనం కూలీల ఖాతాల్లో జమ అయినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని ఎరచ్రందనం అక్రమరవాణా నివారణ విభాగం ఏపీ ఇన్‌చార్జ్, టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు చెప్పారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జువాదిమలై గ్రామంలో ఉన్న బ్యాంకులో ఎన్నడూ లేనివిధంగా కూలీలుగా జీవనం సాగిస్తున్న వారి ఖాతాల్లో సుమారు రూ.కోటి వరకు జమ అయినట్లు తెలిపారు.