DIG Kantha Rao
-
తమిళ కూలీల ఖాతాల్లో ఎర్రస్మగ్లర్ల నల్లధనం
టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు వెంకటగిరి: రాష్ట్రంలోని ఎరచ్రందనం స్మగ్లర్ల నల్లధనం తమళనాడులోని జవాదమలై గ్రామానికి చెందిన ఎరచ్రందనం కూలీల ఖాతాల్లో జమ అయినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని ఎరచ్రందనం అక్రమరవాణా నివారణ విభాగం ఏపీ ఇన్చార్జ్, టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు చెప్పారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జువాదిమలై గ్రామంలో ఉన్న బ్యాంకులో ఎన్నడూ లేనివిధంగా కూలీలుగా జీవనం సాగిస్తున్న వారి ఖాతాల్లో సుమారు రూ.కోటి వరకు జమ అయినట్లు తెలిపారు. -
హంట్ ఫర్ 'రెడ్' స్మగ్లర్స్
-
తిరగబడడం వల్లే..: డీఐజీ
ఎర్రచందనం కూలీలు తిరగబడడం వల్లే ఎన్కౌంటర్ చేసినట్లు టాస్క్ఫోర్సు డీఐజీ కాంతారావు తెలిపారు. సోమవారం సాయంత్రం 150 మంది వరకు ఎర్రకూలీలు శేషాచల అడవుల్లోకి వచ్చారన్న పక్కా సమాచారం టాస్క్ఫోర్సుకు అందడంతో 24 మందితో కూడిన రెండు బృందాలు ఆయుధాలతో కూంబింగ్‌కు వెళ్లాయని చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు వంద మంది కూలీలు ఎర్రచందనం దుంగలతో కొండ నుంచి దిగుతూ టాస్క్ఫోర్సుకు ఎదురుపడ్డారన్నారు. ‘‘మామూలుగా బెదిరిస్తే పారిపోతారని ఎర్రచందనం కూలీలు రాళ్లు, గొడ్డళ్లతో పోలీసులపై దాడులకు తెగబడ్డారు. టాస్క్‌ఫోర్స్ గట్టిగా నిలబడింది. ఇద్దరు ముగ్గురు సిబ్బంది ఉంటే బెదిరించి చంపేవారు. గతంలోనూ అటవీశాఖ అధికారులపై ఎర్రదొంగలు తెగబడి పొట్టన పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు లొంగిపోవాలని హెచ్చరికలు జారీచేసి గాలిలోకి కాల్పులు జరిపారు. అప్పటికీ వారు దాడులు కొనసాగించడంతో విధిలేని పరిస్థితుల్లో ఆత్మరక్షనార్థం కాల్పులు జరిపారు’’ అని ఆయన పేర్కొన్నారు. -
ఎర్రచందనం దొంగలను వెలివేయాలి
- టాస్క్‌ఫోర్స్ డిఐజీ కాంతారావు వెంకటగిరిటౌన్ (నెల్లూరు): ఎర్రచందనం దొంగలను జాతి ద్రోహులుగా గుర్తించి సమాజం నుంచి వెలివేయాలని తిరుపతి టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు తెలిపారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో అటవీ, పోలీసుశాఖ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంతారావు మాట్లాడుతూ తిరుపతి ప్రాంతంలో ఎర్రచందన అక్రమ రవాణా తీవ్రత దృష్ట్యా 91 మంది సిబ్బందిని ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పాటు చేసిందని చెప్పారు. అంతర్జాతీయస్థాయి నుంచి క్షేత్రస్థాయి స్మగ్లర్లు, ఎర్రచందనం అక్రమ రవాణాలో మేస్త్రీలను గుర్తించామన్నారు. వీరిపై పిడియాక్ట్, ఆస్తుల జప్తు వంటి చర్యలు చేపట్టేందుకు న్యాయపరమైన అవరోధాలు రాకుండా పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో పోర్టులను వినియోగించుకోని ఎర్రచందనం దేశం దాటిస్తున్నారని వెల్లడించారు. వెంకటగిరి సబ్‌డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డి, గూడూరు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగభూషణం, ఎసై్సలు పి వి నారాయణ, వేణుగోపాల్, జిలానీబాషా తదితరులు పాల్గోన్నారు స్మగ్లర్లను చిట్టావిప్పిన డీఐజీ.. ఎర్రచందనం అక్రమరవాణాతో సంబంధం ఉన్న నెల్లూరు జిల్లా వాసుల పేర్లును బహిర్గతం చేశారు. వెంకటగిరి ప్రాంతానికి చెందిన కారువేమయ్య, నారీ శేఖర్, సత్తు పెంచలయ్య, బుంగా రాజేష్, జి సుమన్, కె హేమసుందరం, ఎ పెంచలయ్య, నరసయ్య, ఖాజారసూల్, మునస్వామిరెడ్డి ( డక్కిలి మండలం), కలవకల్లు శివయ్య, ఎనమల కృష్ణయ్య, ఎగు పెంచలయ్య, పార్లపల్లి మురళీమోహన్, శ్రీనివాసులరెడ్డి, బండి ధర్మయ్య, గోల్కండ పెరుమాళ్లు, వేముల చంద్రశేఖర్‌నాయుడు ( అలియాస్ టైల్స్ రాజా) , సుధీర్‌కుమార్‌రెడ్డిని గుర్తించామని తెలిపారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సాహుల్‌భాయ్‌తో సంబంధాలు ఉన్న నాయుడుపేటకు చెందిన చంద్రశేఖర్‌నాయుడు ( టైల్స్ రాజా )ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఎర్రచందనం అక్రమరవాణా ద్వారా వందల కోట్లు సంపాదించి సమాజంలో పెద్దమనుషుల్లా చలామణీ అవుతున్న వారి చిట్టా తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. -
ఎస్సైల బదిలీలు
వరంగల్‌క్రైం : వరంగల్ జిల్లాలో భారీఎత్తున ఎస్సైల బదిలీలు జరిగాయి. అర్బన్, రూరల్‌లో కలిపి 30 మంది ఎస్సైలకు స్థానచలనం కల్పిస్తూ మంగళవారం డీఐజీ డాక్టర్ ఎం. కాంతారావు ఉత్తర్వులు జారీచేశారు. ఎస్సైల బదిలీలను నాలుగు కేట గిరీలుగా విభజించారు. ఇందులో అర్బన్-అర్బన్, రూరల్-రూరల్, అర్బన్-రూరల్, రూరల్-అర్బన్ కింది బదిలీలు జరిగారుు. వరంగల్ రూరల్ - వరంగల్ అర్బన్... ఎస్సై పేరు- ప్రస్తుత స్థానం -బదిలీ స్థానం పి.రమేశ్- ములుగు- పర్వతగిరి పి.దయాకర్- వెకెన్సీ రిజర్వ్డ్(వీఆర్)- హసన్‌పర్తి వై.సంజీవరావు ఏటూరునాగారం హన్మకొండ సీహెచ్.శ్రీనివాస్- డీటీసీ(మడికొండ)- ఇంతెజార్గంజ్ వై.యాకయ్య -నర్సంపేట- సుబేదారి వరంగల్ -అర్బన్ - రూరల్ ఆర్.వెంకటేశ్వర్లు- సంగెం- తొర్రూరు వి.చంద్రయ్య- సుబేదారి- డీఈఆర్బీ డి.మల్లేశం- ఘన్పూర్- చెన్నారావుపేట వరంగల్ రూరల్ - రూరల్ ఎం.కరుణాకర్ సిరోలు నెల్లికుదురు జె.వెంకటరమణ నెల్లికుదురు మరిపెడ ఎంఎ.రహమాన్ మరిపెడ కేసముద్రం యాసిన్ జనగామ వెంకటాపూర్ ఎ.కోటేశ్వర్రావు- తొర్రూరు- జన గామ నర్సింగారావు -తొర్రూరు అటాచ్డ్ -తొర్రూరు ఎ.సాంబయ్య డిఎస్బి సిరోల్ కె.సూర్యప్రసాద్ - కురవి- చేర్యాల ఆర్.బాబులాల్ చేర్యాల దుగ్గొండి ఎండి.మస్తాన్మియా- దుగ్గొండికురవి పి.ఉపేందర్- చేర్యాల -నర్సంపేట జైపాల్‌రెడ్డి- చెన్నారావుపేట- డీటీసీ వరంగల్ -అర్బన్ నుంచి -అర్బన్‌కు... వై.కృష్ణకుమార్ హనస్‌పర్తి -సంగెం బి.వెంకట్రావ్- వర్ధన్నపేట -కాజీపేట ఎ.రాఘవేందర్ --మడికొండ --రాయపర్తి రంజిత్‌కుమార్- రాయపర్తి- మిల్స్‌కాలనీ విశ్వేశ్వర్- గీసుకొండ- వర్ధన్నపేట రవికిరణ్- కేయూసీ- గీసుకొండ బి.రమేశ్- పర్వతగిరి- సుబేదారి ఎం.శ్రీనివాస్- సుబేదారి- ఘన్పూర్ ఎం.తాజోద్దీన్- మట్టెవాడ- హన్మకొండ పి.రమేశ్‌బాబు- ఇంతెజార్గంజ్ -డీసీఆర్బీ-అర్బన్