- టాస్క్‌ఫోర్స్ డిఐజీ కాంతారావు
వెంకటగిరిటౌన్ (నెల్లూరు): ఎర్రచందనం దొంగలను జాతి ద్రోహులుగా గుర్తించి సమాజం నుంచి వెలివేయాలని తిరుపతి టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు తెలిపారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అటవీ, పోలీసుశాఖ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంతారావు మాట్లాడుతూ తిరుపతి ప్రాంతంలో ఎర్రచందన అక్రమ రవాణా తీవ్రత దృష్ట్యా 91 మంది సిబ్బందిని ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పాటు చేసిందని చెప్పారు. అంతర్జాతీయస్థాయి నుంచి క్షేత్రస్థాయి స్మగ్లర్లు, ఎర్రచందనం అక్రమ రవాణాలో మేస్త్రీలను గుర్తించామన్నారు. వీరిపై పిడియాక్ట్, ఆస్తుల జప్తు వంటి చర్యలు చేపట్టేందుకు న్యాయపరమైన అవరోధాలు రాకుండా పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో పోర్టులను వినియోగించుకోని ఎర్రచందనం దేశం దాటిస్తున్నారని వెల్లడించారు. వెంకటగిరి సబ్‌డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డి, గూడూరు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగభూషణం, ఎసై్సలు పి వి నారాయణ, వేణుగోపాల్, జిలానీబాషా తదితరులు పాల్గోన్నారు
స్మగ్లర్‌లను చిట్టావిప్పిన డీఐజీ..
ఎర్రచందనం అక్రమరవాణాతో సంబంధం ఉన్న నెల్లూరు జిల్లా వాసుల పేర్లును బహిర్గతం చేశారు. వెంకటగిరి ప్రాంతానికి చెందిన కారువేమయ్య, నారీ శేఖర్, సత్తు పెంచలయ్య, బుంగా రాజేష్, జి సుమన్, కె హేమసుందరం, ఎ పెంచలయ్య, నరసయ్య, ఖాజారసూల్, మునస్వామిరెడ్డి ( డక్కిలి మండలం), కలవకల్లు శివయ్య, ఎనమల కృష్ణయ్య, ఎగు పెంచలయ్య, పార్లపల్లి మురళీమోహన్, శ్రీనివాసులరెడ్డి, బండి ధర్మయ్య, గోల్కండ పెరుమాళ్లు, వేముల చంద్రశేఖర్‌నాయుడు ( అలియాస్ టైల్స్ రాజా) , సుధీర్‌కుమార్‌రెడ్డిని గుర్తించామని తెలిపారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సాహుల్‌భాయ్‌తో సంబంధాలు ఉన్న నాయుడుపేటకు చెందిన చంద్రశేఖర్‌నాయుడు ( టైల్స్ రాజా )ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఎర్రచందనం అక్రమరవాణా ద్వారా వందల కోట్లు సంపాదించి సమాజంలో పెద్దమనుషుల్లా చలామణీ అవుతున్న వారి చిట్టా తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఎర్రచందనం దొంగలను వెలివేయాలి
Published Thu, Mar 12 2015 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM
Advertisement