కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు క్రైం: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారికోసం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి శేషాచలం అడవుల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ఎర్రగట్టు వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసిన కూలీలు ఎర్రచందనం దుంగలను అక్కడే వదిలి పరారయ్యారు. 11 ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కూలీల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.