ప్రముఖ నటుడు వెట్రి కొత్త సినిమా 'రెడ్ శాండిల్ వుడ్'. జేఎన్ సినిమాస్ పతాకంపై జే.పార్థసారథి నిర్మించిన విచిత్రానికి గురు రామానుజమ్ దర్శకత్వం వహించారు. నటుడు ఎంఎస్ భాస్కర్ గణేష్ వెంకట్రాం కేజీఎఫ్ ఫేమ్ రామ్ కబాలి విశ్వ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈసందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు.
(ఇదీ చదవండి: ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ చెల్లెలు ఎవరో తెలుసా..?)
ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు పేరుతో బలేనా అమాయకుల నేపథ్యంలో సాగే యథార్థ సంఘటనల ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. 2015లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆయన చెప్పారు. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలను తయారు చేసి క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే గంధపు చెక్కలను విదేశాలకు చేస్తూ చైనా నుంచి ప్లాస్టిక్ బొమ్మలను దిగుమతి చేసుకునే పరిస్థితి నెలకొందని చిత్ర కథానాయకుడు వెట్రి పేర్కొన్నారు.
దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ట్రైలర్ చూడగానే మనసు ద్రవించిందన్నారు. ఎక్కడ చూసినా సమస్యలు, అకారణంగా బాధింపునకు గురైన, శిక్షించబడిన వారే కనిపిస్తున్నారన్నారు. అలాంటి సంఘటన వెనుక ఎవరో ఉంటున్నారన్నారు. వారి వల్ల అమాయకపు తమిళ ప్రజలే బాధింపునకు గురవుతున్నారు అన్నారు. ఇప్పుడు పెద్ద హీరోలు నటించిన చిత్రాలు లేదా, సహజత్వంతో కూడిన చిత్రాలు మాత్రమే విజయాన్ని సాధిస్తున్నాయన్నారు. అలా ఈ చిత్రం జాతీయ అవార్డులు అందుకోవాలని కోరుకుంటున్నాను అని పేరరసు పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: విజయ్ క్యారెక్టర్‌పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment