స్మగ్లర్ల అడ్డాలో.. ధీర వనిత..
చిత్తూరు/కడప: చుట్టూ దట్టమైన శేషాచలం అడవులు నిత్యం క్రూరమృగాలు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి పెనుసవాళ్లతో కూడిన ఉద్యోగాన్ని ఓ మహిళా ఫారెస్ట్ అధికారణి సమర్ధంగా నిర్వహిస్తోంది. కడప, చిత్తూరు జిల్లాల్లో 20 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మొగిలిపెంట బీట్ను చేరుకోవడం అంత సులువు కాదు. ప్రస్తుతం ఎర్రచందనం స్మగ్లర్లకు ఆవాసంగా ఉన్న ఈ ఏరియా.. ఎగుడుదిగుడుగా ఉండే శేషాచలం కొండల మధ్య కడప జిల్లాలో ఉంది. రాగాల సుబ్బలక్ష్మీ(25)ను రైల్వే కోడూరు డివిజన్లో బాలుపల్లె పరిధిలోని మొగిలిపెంట బీట్కు అధికారిణిగా నియమించారు.
కష్టసాధ్యం ఆమె ప్రయాణం..
బాలుపల్లె నుంచి 60 కిలోమీటర్ల పాటు రోడ్డు ప్రయాణం తర్వాత తిరుమల కొండలను చేరుకుని అక్కడి నుంచి దుర్భేధ్యమైన అడవిలో కడపకు చేరుకోవడానికి 35 కిలోమీటర్ల మార్గంలో శిఖరాలు, వాలు ప్రదేశాలు, లోయల మీదుగా ట్రెక్కింగ్ చేస్తూ రెండు రోజుల పాటు ప్రయాణిస్తోంది సుబ్బలక్ష్మీ. తనతో పాటు ఉండాల్సిన మహిళా అసిస్టెంట్ పోస్టురెండు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటున్నా.. కీకారణ్యంలో ఒంటరిగా.. ఎటువంటి ఆయుధాలు లేకుండా ధైర్యసాహసాలతో నిత్యం ప్రమాదాల(ఎర్రచందనం స్మగ్లర్లు, క్రూర జంతువులు) అంచున విధులు నిర్వహిస్తోంది.
మానవసాధ్యం కాదు..
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఆమె నిర్వహిస్తున్న విధులు మానవసాధ్యం కానివి. అధికారులు ఆమె రోజూ విధులకు హాజరుకాలేకపోయినా ఒత్తిడి తీసుకురావడం లేదు అని తిరుపతి డివిజినల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ టీవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రిటిష్ కాలంలో బాలుపల్లె, మొగిలిపెంటల మధ్య మోటరు వాహానాలకు ట్రాక్ ఉండేదని చెప్పారు.