Subbalakshmi
-
Violinist Tadepalli Subbalakshmi: స్వరవీణ
ఇంట్లోకి అడుగుపెట్టగానే సోఫా కార్నర్లో త్యాగయ్య విగ్రహం అతిథులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది. అదే గదిలో మరోదిక్కున వీణాపాణిౖయెన సరస్వతీ మాత పాదాల చెంత తంబుర మీటుతున్న త్యాగరాజు, కామధేనువు నిత్యపూజలందుకుంటున్న దృశ్యం ఆకట్టుకుంటుంది.‘‘పుష్యమాసం బహుళ పంచమి త్యాగరాజు సిద్ధి పొందిన రోజు. తమిళనాడులో ఆరాధనోత్సవాలు మొదలయ్యాయి’’ అంటూ సంతోషం నిండిన స్వరంతో తన సంగీత ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు తాడేపల్లి సుబ్బలక్ష్మి. ‘‘మాది విజయవాడ. మా పెదనాన్న కొమ్ము వెంకటాచల భాగవతార్ హరికథకులు. కళల నిలయమైన ఇంట్లో పుట్టాను. ఆరవ ఏటనే నా సంగీత సాధన మొదలైంది. ఆకెళ్ల మల్లికార్జున శర్మ, కోటిపల్లి ప్రకాశరావులు నా వయోలిన్ గురువులు. విజయవాడ సత్యనారాయణపురంలో ‘ప్రభుత్వ సంగీత కళాశాల’ పెట్టారు. పదేళ్లకు ఆ కాలేజ్‌లో చేరాను. మంగళంపల్లి బాలమురళీకృష్ణ మా ప్రిన్సిపల్. ఆ తర్వాత నేదునూరి కృష్ణమూర్తిగారు కూడా. ఆరేళ్లపాటు సాధన చేసి వయోలిన్ లో సర్టిఫికేట్ కోర్సు, డిప్లమో చేశాను. ప్రైవేట్‌గా వోకల్ కోర్సు కూడా చేశాను. డిప్లమో అందుకోవడం ఆ వెంటనే పెళ్లి. అబ్బాయిని వెతుక్కోవాల్సిన పని పడలేదు. మా వారు ఉమాశంకర్ నా క్లాస్మేట్. జీవితాన్ని పంచుకున్నాం. సంగీత విద్వాంసులుగా వందలాది వేదికలను పంచుకున్నాం. సంగీతసాగరంలో మా జ్ఞానాన్వేషణ కొనసాగుతోంది. సంగీత గురువు సంగీత గురువుగా నా బాధ్యత 1985లో మొదలైంది. జవహర్ బాలభవన్‌లో వయోలిన్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేరాను. ఆ తర్వాత నేను చదివిన కాలేజ్‌లోనే ‘గాయక్ అసిస్టెంట్’గా చేరాను. వేదికల మీద గాత్ర సహకారం, వయోలిన్ సహకారం రెండూ చేయగలగడంతో అనేకమంది ప్రముఖులతో వేదిక పంచుకునే అవకాశం వచ్చింది. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి శోభానాయుడుకి గాత్ర సహకారం, ప్రముఖ గాయని శోభారాజ్కి వయోలిన్ సహకారం అందించాను. అలేఖ్య పుంజల, భాగవతుల సేతురామ్, ఆనంద్ శంకర్, మంజులా రామస్వామి, ఉమారామారావు, వాసిరెడ్డి కనకదుర్గ వంటి గొప్పవారితో నా సరిగమల, స్వర రాగాల ప్రయాణం సాగింది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత సంగీతసేవ విస్తృతంగా చేయడానికి నాకు అవకాశాలు వచ్చాయి. దూరదర్శన్, భక్తి చానెల్, ఎస్వీబీసీ – నాద నీరాజనంతోపాటు ఇతర దేవాలయాల్లో లెక్కకు మించిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఐసీసీఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్)నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సింగపూర్, టర్కీ, లెబనాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, అబూదాబి వంటి దేశాల్లో కచేరీలు చేయగలిగాను. ఎన్టీఆర్‌గారు కళలను అభిమానించేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ ప్రారంభగీతం ఆలపించాను. గవర్నర్ రంగరాజన్‌గారి హయాంలో గవర్నర్ బంగ్లాలో అప్పటి రాష్ట్రపతి కే ఆర్ నారాయణన్ గౌరవార్థం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భక్తి సంగీతం ఆలపించడం వంటి ఎన్నో సంతోషాలను సంగీత సరస్వతి నాకిచ్చింది. నా వయసు 74. ఆరు దశాబ్దాలు దాటిన సంగీత సాధనను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే నాకు ముచ్చట గా అనిపించే సందర్భం జూనియర్ ఎన్టీఆర్ నాట్యప్రదర్శన. మద్రాసు (చెన్నై)లో జరిగిన ఆ కార్యక్రమానికి సంగీత సహకారం అందించాను. ఆ పిల్లవాడు చాలా మంచి డాన్సర్. నిరంతర గాన వాహిని నేను మ్యూజిక్ కాలేజ్ నుంచి రిటైర్ అయ్యేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగం నుంచి మా వారు కూడా రిటైర్ అయి ఉన్నారు. ఇద్దరం కలిసి ‘వాగ్దేవి సంగీత విద్యాలయం’ పేరుతో సంగీత పాఠశాలను స్థాపించాం. పూర్థిస్థాయి శిక్షణ ఇచ్చి డెబ్బైమందికి పైగా విద్యార్థులను పరీక్షలకు పంపించాం. నా స్టూడెంట్స్ కెనడా, యూఎస్, సింగపూర్లలో మ్యూజిక్ స్కూళ్లు నిర్వహిస్తున్నారు. ఈ తరం బాల్యం చాలా చురుగ్గా ఉంటోంది. పిల్లల్లో గ్రహణ శక్తి చాలా మెండుగా ఉంది. త్వరగా నేర్చుకుంటున్నారు. అందుకు టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడుతోంది. అప్పట్లో మాకు గురువు పాడి వినిపించిన పాటను ఇంట్లో సాధన చేసేటప్పుడు ఏదైనా సందేహం వస్తే, మరునాడు క్లాస్‌లో నివృత్తి చేసుకోవాల్సిందే. ఇప్పుడలా కాదు, గురువు పాడేటప్పుడే రికార్డ్ చేసుకుని మళ్లీ మళ్లీ వింటూ నేర్చుకుంటున్నారు. కానీ సంగీతంలో కొనసాగేవాళ్లు తక్కువ. మూడేళ్లపాటు బాగా నేర్చుకున్న తర్వాత టెన్త్‌క్లాస్‌కు వచ్చారని, ఇంటర్మీడియట్ కూడా కీలకం కాబట్టి పూర్తి సమయం చదువుల కోసమే కేటాయించాలనే ఉద్దేశంతో సంగీతసాధనకు దూరమవుతున్నారు. మా రోజుల్లో సంగీతమే అసలు చదువుగా ఉండేది. నేను ప్రైవేట్‌గా మెట్రిక్యులేషన్ పూర్తి చేశాను. తమిళులు మాత్రం ఉన్నత చదువులు చదువుతూ సంగీతాన్ని కూడా కొనసాగిస్తుంటారు. మన తెలుగు వాళ్లలో ప్రతిభ ఉంది. అయితే అంకితభావమే తక్కువ. ఉపాధికి భరోసా ఉంటే ఈ కళను కెరీర్‌గా ఎంచుకునే వాళ్ల సంఖ్య పెరుగుతుంది. నాకనిపించేదేమిటంటే... పిల్లలకు స్కూల్ దశలోనే సంగీతం, నాట్యం వంటి కళల కోసం ఒక క్లాసు ఉంటే బాల్యంలోనే కళలు పరిచయమవుతాయి. కళాసాధనతో వచ్చే క్రమశిక్షణ వారిలో దుడుకుతనాన్ని తగ్గించి ఒద్దిక నేర్పుతుంది. పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి పరోక్షంగా దోహదం చేస్తుంది. కాబట్టి పాఠశాల విద్యలో సంగీత, నాట్యాలను సిలబస్‌గా పెట్టే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు తాడేపల్లి సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి మంచి టీచర్ ఇది నేను సంపాదించుకున్న బిరుదు. ఇప్పటికీ రోజుకు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని సాధన చేస్తాను, పిల్లల చేత సాధన చేయిస్తాను. ఇంట్లో సంగీతపాఠాలు చెప్పే టీచర్లు కొందరు పిల్లలను తాళం వేయమని చెప్పి తాము వంట చేసుకుంటూ ఒక చెవి ఒగ్గి గమనిస్తుంటారు. టీచర్ ఎదురుగా ఉంటేనే క్రమశిక్షణ అలవడుతుందని నా విశ్వాసం. సంగీతం అంటే సరిగమలు పలకడం మాత్రమే కాదు, ఆత్మతో మమేకం కావాలి. సంగీత సాధన పట్ల పిల్లల్లో ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించినప్పుడే గురువుగా మేము ఉత్తీర్ణత సాధించినట్లు. అలాగే కళ కోసం జీవించడంలో ఉండే సంతృప్తి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. నా యూట్యూబ్ చానెల్ ‘తిల్లానా’ కోసం పాటలు పాడి రికార్డ్ చేస్తున్నాను. భగవంతుడు ఒక నైపుణ్యాన్ని ఇస్తాడు, దానిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది. – తాడేపల్లి సుబ్బలక్ష్మి, గాయని, వయోలిన్ విద్వాంసురాలు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
ఏ మాయ చేసావె నటి కన్నుమూత.. చివరి వీడియో వైరల్
సీనియర్ నటి సుబ్బలక్ష్మి(87) రెండురోజుల క్రితం (నవంబర్ 30న) అనారోగ్యంతో మృతి చెందారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించిన ఈమె వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. తాజాగా ఆమె మనవరాలు సౌభాగ్య.. సుబ్బలక్ష్మి చివరి వీడియోను షేర్ చేసింది. ఇందులో సుబ్బలక్ష్మి.. తన ముని మనవరాలు సుధాపూతో సరదాగా ఆడుకుంది. ఎనిమిది నెలల క్రితం ఎంతో ఆరోగ్యంతో చిన్నారితో ఆడుకున్న ఆమె రెండు నెలలక్రితం అనారోగ్యానికి లోనైనట్లు కనిపిస్తోంది. ఇక 15 రోజుల క్రితమైతే ఆమె బెడ్‌పైనే ఉంది. లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ చిన్నారిని నవ్వించేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో చూసిన జనాలు నిన్ను మిస్ అవుతాం అమ్మమ్మ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా సుబ్బలక్ష్మి దక్షిణాదిన అనేక సినిమాలు చేశారు. తెలుగులో కళ్యాణరాముడు సినిమాలో నటించారు. ఏ మా చేసావె చిత్రంలో సమంత అమ్మమ్మగా కనిపించారు. నందనం, పాండిప్పడ, సీఐడీ మూస, తిలకం, బీస్ట్ వంటి పాపులర్ సినిమాల్లో యాక్ట్ చేశారు. సినిమాలే కాకుండా సీరియల్స్ కూడా చేశారు. అలాగే వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించారు. నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సేవలందించారు. 1951లో ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగినిగా పని చేశారు. దక్షిణ భారతదేశం నుంచి ఆల్ ఇండియా రేడియోలో పని చేసిన తొలి లేడీ కంపోజర్‌గా సుబ్బలక్ష్మి రికార్డు సృష్టించారు. View this post on Instagram A post shared by Sowbhagya Venkitesh (@sowbhagyavenkitesh) చదవండి: ‘మట్టి కుస్తీ’ భామ ఐశ్వర్యా లక్ష్మి గురించి ఈ విషయాలు తెలుసా? -
Saxophonist: శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి
సుబ్బలక్ష్మి ఇంటి పేరు ఎవరికీ తెలియదు. ప్రపంచమంతా ఆమెను శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి అనే పిలుస్తుంది. మగవారు మాత్రమే వాయించే ఈ వాయిద్యంలో సుబ్బలక్ష్మి స్త్రీగా ఉనికి సాధించింది. పట్టుచీర, వడ్డాణం ధరించి వేదిక మీద సంప్రదాయ ఆహార్యంలో ఈ ఆధునిక వాయిద్యం మీద వెస్ట్రన్, కర్నాటక్‌లో అద్భుత ప్రతిభ చూపుతుంది. డైరీలో ఒకరోజు కూడా ఖాళీ ఎరగని ఈ బెంగళూరు వాద్యకారిణి సక్సెస్ స్టోరీ. 40 ఏళ్ల సుబ్బలక్ష్మి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలంటే సంవత్సరం ముందు బుక్ చేసుకోవాలి. ఆమె డైరీలో ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. ఇవాళ చెన్నై, రేపు బెంగళూరు, ఎల్లుండి దుబాయ్... ఆమె కచ్చేరీలు సాగిపోతూ ఉంటాయి. భర్త కిరణ్ కుమార్‌కు ఐ.టి. రంగంలో మంచి ఉద్యోగం. కానీ ఈమె కచ్చేరీల బిజీ చూసి ఉద్యోగం మానేసి సాయంగా ఉంటున్నాడు. బెంగళూరులో నివాసం ఉండే సుబ్బలక్ష్మి సొంతింట్లో ఉండేది తక్కువ. కచ్చేరీలకు తిరిగేది ఎక్కువ. కాని ఈ విజయం అంత సులువు కాదు సుమా. ఒక్కతే శిష్యురాలు సుబ్బలక్ష్మి పూర్తిపేరు ఎం.ఎస్.సుబ్బలక్ష్మి. అవును. మహా గాత్ర విద్వాంసులు ఎం.ఎస్.సుబ్బులక్ష్మిని జ్ఞప్తికి తెచ్చే పేరు. ఆ పేరు ప్రభావమో, ఇంట్లో సంగీతం ఉండటమో సుబ్బలక్ష్మికి కూడా సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. సుబ్బలక్ష్మి తాత మైసూర్ సంస్థానంలో ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఉండేవాడు. సుబ్బలక్ష్మి తండ్రి సాయినాథ్ మంగళూరులో మృదంగ విద్వాంసుడు. అతడు అనేకమంది సంగీతకారులకు కచ్చేరీల్లో వాద్య సహకారం అందించేవాడు. ఐదో ఏట నుంచే గాత్ర సంగీతం నేర్చుకుంటున్న సుబ్బలక్ష్మి ఒకసారి తండ్రితోపాటు కచ్చేరీకి వెళ్లింది. అది శాక్సాఫోన్ విద్వాంసుడు కద్రి గోపాల్‌నాథ్ కచ్చేరి. అందులో గోపాల్‌నాథ్ అద్భుతంగా శాక్సాఫోన్ వాయిస్తుంటే సుబ్బలక్ష్మి మైమరిచిపోయింది. తాను కూడా శాక్సాఫోన్ నేర్చుకోవాలనుకుంది. అప్పుడు ఆమెకు 13 ఏళ్లు. ఆ రోజుల్లో ఆడపిల్లలు శాక్సాఫోన్ను అంతగా నేర్చుకునేవారు కాదు. గురువులు నేర్పించేవారు కూడా కాదు. అది పూర్తిగా మగవారి వాయిద్యం. కాని సుబ్బలక్ష్మి పట్టుబట్టింది. మొత్తం 16 మంది శిష్యులు ఆ సమయంలో కద్రి గోపాల్‌నాథ్ దగ్గర ఉంటే వారిలో ఒకే ఒక శిష్యురాలు సుబ్బలక్ష్మి. గర్భం దాల్చాక కూడా సుబ్బలక్ష్మి శాక్సాఫోన్ వాయించడంలో ఒక వరుస ఉంటుంది. ఆమె మొదట కర్నాటక సంగీతం వాయించి ఆ తర్వాత ఫ్యూజన్లోకి వస్తుంది. వెస్ట్రన్‌ను, కర్నాటక్ను మిళితం చేసి కచ్చేరీల్లో ఒక ఊపు తెస్తుంది. అది జనానికి నచ్చుతుంది. ఇది కూడా కొంతమంది శాక్సాఫోన్ విద్వాంసులకు నచ్చదు. ఆమెను విమర్శిస్తుంటారు. ‘నన్ను ఎన్నో విమర్శిస్తారు. కాని నేను భయపడలేదు. కచ్చేరీలు కొనసాగించాను. 7 కిలోల శాక్సాఫోన్ను రెండు గంటల పాటు పట్టుకుని కచ్చేరి చేయడం ఎంత కష్టమో ఆలోచించండి. ఆడది అలా చేయలేదు అనేవాళ్లకు సమాధానంగా నిలిచాను. నా ఊపిరితిత్తుల బలం నాకు సహకరించింది. పెళ్లయి గర్భం దాల్చాక నా శత్రువులు ఇక ఆమె కచ్చేరీలు చేయదు అనే ప్రచారం మొదలెట్టారు. డెలివరీ అయ్యాక కచ్చేరీలు సాధ్యం కాదని ఆర్గనైజర్స్‌ను భయపెట్టారు. దాంతో షోలు బుక్ చేసిన ఆర్గనైజర్స్ అడ్వాన్సులు వెనక్కు ఇమ్మని అడగడం మొదలెట్టారు. నేను పట్టుదలగా ఆ పుకార్లను తోసి పుచ్చాను. రేపు డెలివరీ అనగా ఇవాళ కూడా కచ్చేరీ చేశాను. నిండు గర్భవతిగా స్టేజ్ మీద శాక్సాఫోన్ వాయించింది నేనే అనుకుంటా. అలాగే డెలివరీ అయిన 15 రోజులకు మళ్లీ స్టేజ్ మీదకు వచ్చాను. ఈ రంగంలో నేనేమిటో నిరూపించుకోవాలనే నా పట్టుదలే నాకు బలాన్ని ఇచ్చింది’ అంటుంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి సోదరి లావణ్య కూడా శాక్సాఫోన్ విద్వాంసురాలిగా రాణిస్తోంది. వీరు విడివిడిగా కచ్చేరీలు చేసినా కలిసి చేసే కచ్చేరీలు కూడా వీనుల విందుగా ఉంటాయి. ఎన్నో వెక్కిరింతలు సాధనలో అబ్బాయిలు సుబ్బలక్ష్మిని అస్సలు సహించలేదు. ‘నేను శాక్సా పట్టుకుని సాధన చేస్తుంటే వాళ్లు నవ్వుతుండేవారు. కుర్చీ కిర్రుకిర్రుమన్నట్టు ఉంది అనేవారు. గురువు గారి భార్య మా అమ్మకు స్నేహితురాలు. వీళ్లు నవ్వుతుంటే ఆమె బయటికొచ్చి చూసి– వాళ్లు నవ్వనీ ఏమైనా అననీ... నువ్వు మాత్రం ట్రై చేస్తూనే ఉండు. నీకు వస్తుంది అని ఎంకరేజ్ చేసింది. ఆమె ప్రోత్సాహం వల్ల ధైర్యం తెచ్చుకున్నాను. నేను శాక్సాఫోన్ నేర్చుకోవడంలో ప్రోత్సాహం కంటే అవమానమే ఎక్కువ. కచ్చేరీల్లో కావాలని నా టైము మధ్యాహ్నం ఇచ్చేవారు. ఆ సమయంలో ఆడియెన్స్ ఉండరు. మహా అయితే పది నిమిషాలు కేటాయించేవారు. మగవారు సాయంత్రం నిండు సభలో వాయించేవారు. వారికి గంట సమయం దొరికేది. నన్ను ప్రత్యేకంగా మహిళా శాక్సాఫోనిస్ట్ అని విడిగా చూసేవారు’ అని తెలిపింది సుబ్బలక్ష్మి. -
స్టాలిన్‌కు షాక్.. పార్టీకి కీలక నేత గుడ్ బై
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు గట్టి షాక్ తగిలింది. అధికార డీఎంకే పార్టీలో కీలక నేత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మంగళవారం లేఖ రాశారు కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సుబ్బలక్ష్మి జగదీశన్. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 1947లో ఎరోడ్ జిల్లాలో జన్మించిన సుబ్బలక్ష్మి జగదీశన్.. ద్రావిడ మున్నెట్ర కజగం(డీఎంకే) పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. తిరుచెంగోడ్ నియోజకవర్గం నుంచి 14వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా 2004-2009 వరకు బాధ్యతలు చేపట్టారు. అంకు ముందు 1977-1980, 1989-1991 వరకు తమిళనాడు ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగేది ఆ ఇద్దరే! సోనియా సపోర్ట్ ఎవరికంటే.. -
ఆ రోజును చూసినవారు
దసరా, దీపావళి పండుగలు జరుపుకున్నట్లుగా స్వాతంత్య్ర దినోత్సవ పండుగ జరుపుకున్నాం. అప్పుడు నాకు 22 సంవత్సరాల వయసు. ఇంటిల్లిపాదీ ఉదయాన్నే తలంట్లు పోసుకుని, కొత్తబట్టలు కట్టుకున్నాం. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాం. గడపలకు పసుపు రాసి, కుంకుమ పెట్టాం. ఇల్లంతా కళకళలాడింది. రోజూ ఉండే ఇల్లే అయినా ఆ రోజు ఎంతో కొత్తగా అనిపించింది. రకరకాల మిఠాయిలు తయారు చేశాం. ఇంటికి వచ్చినవారందరికీ నిండుగా భోజనం పెట్టాం. అప్పుడు మేం హైదరాబాద్‌లో ఉంటున్నాం. జెండా ఎగురవేయటానికి హైదరాబాద్ ఆకాశవాణి కార్యాలయానికి వెళ్లాం. అప్పటికి ఇంకా డక్కన్ రేడియోగా వ్యవహరించేవారు. ఆ రోజు నేను ఎరుపు అంచు ఉన్న నీలం రంగు పట్టు చీర కట్టుకున్నాను. ఆ చీరంటే నాకు చాలా ఇష్టం. బుచ్చిబాబుగారు ఖద్దరు పైజమా, లాల్చీ కట్టుకున్నారు. పైన వేసుకోవటానికి ముందుగానే జోద్పూర్ కోటు కుట్టించుకున్నారు. ఆ రోజు మద్రాసు నుంచి సినీ నటులు పుష్పవల్లి, భానుమతి గారలు వచ్చారు. జైలు నుంచి విడుదలైన వారిలో కొందరు ఆకాశవాణి ద్వారా ప్రత్యక్షంగా తమ అనుభవాలు పంచుకున్నారు. ఎస్.ఎన్ మూర్తి గారు స్టేషన్ డైరెక్టర్. ఉమామహేశ్వరరావు అనే అనౌన్సర్ ‘భారత దేశం నేటి నుంచి స్వతంత్ర దేశం’ అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. వింజమూరి సీత అనసూయలు, టంగుటూరి సూర్యకుమారి దేశభక్తి గీతాలు ఆలపించారు. కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ రోజు ఎక్కడ చూసినా, ‘మా ఇంట్లో వాళ్లు ఇన్నిరోజులు జైలుకి వెళ్లొచ్చారు. ఇంత శిక్ష పడింది’ అంటూ అదొక వేడుకగా, కథలుకథలుగా చెప్పుకున్నారు. పిల్లలంతా ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. ఎల్బి స్టేడియాన్ని అందంగా అలంకరించారు. జెండాలు ఎగురవేశారు. ఎంతోమంది పిల్లలు, కుటుంబాలను వదులుకుని ఉద్యమంలో పాల్గొని జైలుపాలయ్యారు. వారు జైలుకు వెళ్లినప్పుడు వారి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎలా గడిచిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయటానికి పార్టీ వారికి ఫండ్స్ ఉండేవి కాదు. జైళ్ల నుండి విడుదలైనవారంతా ఇళ్లకు నడిచి వెళ్లవలసి వచ్చేది. ఇన్నాళ్లు పడిన శ్రమకు ఫలితం లభించిందనే ఆనందమే వారి ముఖాలలో కనిపించింది. ఒకసారి గాంధీగారు హైదరాబాద్ వచ్చినప్పుడు సత్యనారాయణ అనే ఆయన వేసిన పెయింటింగ్ గాంధీగారికి నా చేత ఇప్పించారు. గాంధీగారు స్టేజీ మీద నుంచి కిందకు దిగటానికి, నా భుజాల మీద చేయి వేసుకున్నారు. చాలాకాలం ఆ భుజాన్ని ఎంతో పవిత్రంగా తడుముకునేదాన్ని. స్వాతంత్య్రం వచ్చిన రోజున నాకు ఆ సంఘటన ఒక్కసారి మనసులో స్ఫురించింది. అలాగే ప్రకాశం పంతులు గారు మా ఇంటికి వస్తుండేవారు. మా వారిని ‘ఏరా! బుచ్చీ!’ అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఆరోజులు ఎంతో గొప్పవి. స్ఫూర్తిదాయకమైనవి. – శివరాజు సుబ్బలక్ష్మి (95), రచయిత్రి (ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి) బెంగళూరు -
క్వారంటైన్లోకి వెళ్లనంటున్న ‘రౌడీ బేబీ’
సాక్షి, చెన్నై : టిక్‌టాక్ ద్వారా ఇటీవల కాలంగా సెలబ్రటీలుగా మారిన యువతులు, యువకులు, మహిళలు ఎందరో. వీరిలో రౌడీ బేబీగా తమిళనాట టిక్‌టాక్‌లో వివాదాల కేంద్ర బిందువుగా మారిన సూర్య అలియాస్ సుబ్బలక్ష్మి క్వారంటైన్లోకి నెట్టబడింది. తాను వెళ్లబోనంటూ మొండి కేసిన ఆమెను బుజ్జగించడం అధికారులకు శ్రమగా మారింది. చివరకు ఆమె డిమాండ్లకు అంగీకరించి సకల వసతులు కల్పించాల్సి వచ్చింది.(లాడ్జ్‌లో మహిళ హత్య.. యువకునితో వీడియోలపై) టిక్‌టాక్ యాప్ ద్వారా తమలోని ప్రతిభను చాటుకునేందుకు ఎందరో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు తమ అందాలను ఆర బోస్తుంటారు. ఇంకొందరు వివాదాలు, రచ్చ, చర్చ అంటూ ముందుకు సాగుతున్నారు. ఈ యాప్‌ను మంచికి ఉపయోగించే వాళ్లు ఏ మేరకు ఉన్నా, స్వలాభం కోసం ఉపయోగించుకునే వాళ్లు అదేస్థాయిలో ఉన్నారు. ఆ దిశగా తమిళనాటు టిక్ టాక్ రౌడీ బేబి అంటూ సుర్యా అలియాస్ సుబ్బలక్ష్మి ఆ యాప్‌ను ఉపయోగించే వాళ్లు, చూసే వాళ్లకు సుపరిచితురాలే. టిక్‌టాక్‌లో ఆమె అందాలను చూసి సింగపూర్‌కు ఆహ్వానించి మర్యాదలు చేసిన వాళ్లూ ఉండటం గమనార్హం. లాక్డౌన్ ముందుగా ఈ రౌడీ బేబీని సింగపూర్‌కు ఎవరో సొంత ఖర్చులతో రప్పించుకున్నారు. లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఈ మూడున్నర నెలలు సింగపూర్‌కే పరిమితం అయ్యింది. అక్కడకు వెళ్లినా, టిక్‌టాక్‌ను వదలి పెట్టలేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులో భాగంగా విదేశాల్లో ఉన్న వాళ్లను స్వదేశానికి రప్పించేందుకు తగ్గ చర్యలు చేపట్టి ఉన్నారు. దీంతో ఈ రౌడీ బేబీని సింగపూర్ నుంచి పంపించేశారు. క్వారంటైన్లోకి వెళ్లనని పట్టు సింగపూర్ నుంచి మంగళవారం కోయంబత్తూరుకు విమానంలో ఈ బేబీ వచ్చింది. ఆమెను పరిశోధించిన అధికారులు 14 రోజుల స్వీయ నిర్భంధం అంటూ క్వారంటైన్‌కు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే, విమానాశ్రయ అధికారుల కళ్లగప్పి తప్పించుకున్న ఈ సూర్య, తిరుప్పూర్ అయ్యం పాళయంలోకి తన ఇంటికి వచ్చేసింది. అది అద్దె ఇల్లు కావడం, ఐదు ఇళ్లకు కామన్ బాత్రూం ఉపయోగించాల్సి ఉండడంతో పక్కనే ఉన్న వారిలో ఆందోళన బయలు దేరింది. క్వారంటైన్‌కు తరలించకుండా, ఎలా ఈ రౌడీ బేబీని వదలి పెట్టేశారంటూ పక్కంటి వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు వచ్చిన అధికారులకు ఈ రౌడీబేబీ నుంచి బెదిరింపులు తప్పలేదు. క్వారంటైన్లోకి వెళ్లాల్సిందేనని అధికారులు ఒత్తిడి తెచ్చినా ఏ మాత్రం ఆమె తగ్గ లేదు. చివరకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తారేమో అన్న ఉత్కంఠ అక్కడ నెలకొని ఉన్నా, ఓ పోలీసు రూపంలో పరిస్థితి మారింది. సూర్యను చూడగానే, రౌడీ బేబీ అంటూ పలకరించడం, కాస్త పొగడ్తల పన్నీరు అద్దడంతో ఆమె మెట్టు దిగింది. ఇక్కడే ఉండి పక్కింటి వాళ్లను ఇబ్బంది పెట్టవద్దని, క్వారంటైన్లోకి వెళ్లమంటూ ఆయన సూచించడంతో అంగీకరించింది. అయితే, ఆ తర్వాత ఆమె పెట్టిన డిమాండ్లు అధికారులకు షాక్‌కు గురి చేశాయి. జీహెచ్‌లో తనకంటూ ప్రత్యేక గది ఉండాలని, టిక్ టాక్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, తాను పిలిస్తే పలికేందుకు , తనకు కావాల్సినవన్నీ సమకూర్చేందుకు సిబ్బంది ఉండాలని డిమాండ్ పెట్టగా, పోలీసులు, వైద్య అధికారులు అంగీకరించారు. -
ప్రజాసంకల్పయాత్రపై ఆల్బమ్ రూపొందించిన సుబ్బలక్ష్మి
-
పిడుగుపాటుకు మహిళ బలి
పోలవరం : మండలంలోని పాత పట్టిసీమకు చెందిన రెడ్డి సుబ్బలక్ష్మి (42) అనే మహిళ శనివారం సాయంత్రం పిడుగుపాటుకు మృతిచెందింది. ఉదయం కామాయమ్మ చెరువు ప్రాంతంలో పనులకు ఈమె పలువురు మహిళలతో కలిసి కూలికి వెళ్లింది. సాయంత్రం ఆరుగురు మహిళలు కలసి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో వర్షం కురుస్తోంది. ఆరుగురు మహిళల్లో చివరన నడుస్తున్న సుబ్బలక్ష్మిపై పిడుగు పడింది. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈమెకు భర్త, ఇద్దరు కుమారులున్నారు. -
పిల్లలు పుట్టలేదని...
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఓ వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. కుమ్మరి వీధికి చెందిన డి.సుబ్బలక్ష్మి (28) ఇంట్లో ఉరేసుకుని మృతి చెందిన స్థితిలో ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివాహం అయి 8 ఏళ్లు అయినా పిల్లలు పుట్టుకపోవడంతో భర్తే సుబ్బలక్ష్మిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరిస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్మగ్లర్ల అడ్డాలో.. ధీర వనిత..
చిత్తూరు/కడప: చుట్టూ దట్టమైన శేషాచలం అడవులు నిత్యం క్రూరమృగాలు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి పెనుసవాళ్లతో కూడిన ఉద్యోగాన్ని ఓ మహిళా ఫారెస్ట్ అధికారణి సమర్ధంగా నిర్వహిస్తోంది. కడప, చిత్తూరు జిల్లాల్లో 20 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మొగిలిపెంట బీట్‌ను చేరుకోవడం అంత సులువు కాదు. ప్రస్తుతం ఎర్రచందనం స్మగ్లర్లకు ఆవాసంగా ఉన్న ఈ ఏరియా.. ఎగుడుదిగుడుగా ఉండే శేషాచలం కొండల మధ్య కడప జిల్లాలో ఉంది. రాగాల సుబ్బలక్ష్మీ(25)ను రైల్వే కోడూరు డివిజన్లో బాలుపల్లె పరిధిలోని మొగిలిపెంట బీట్‌కు అధికారిణిగా నియమించారు. కష్టసాధ్యం ఆమె ప్రయాణం.. బాలుపల్లె నుంచి 60 కిలోమీటర్ల పాటు రోడ్డు ప్రయాణం తర్వాత తిరుమల కొండలను చేరుకుని అక్కడి నుంచి దుర్భేధ్యమైన అడవిలో కడపకు చేరుకోవడానికి 35 కిలోమీటర్ల మార్గంలో శిఖరాలు, వాలు ప్రదేశాలు, లోయల మీదుగా ట్రెక్కింగ్ చేస్తూ రెండు రోజుల పాటు ప్రయాణిస్తోంది సుబ్బలక్ష్మీ. తనతో పాటు ఉండాల్సిన మహిళా అసిస్టెంట్ పోస్టురెండు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటున్నా.. కీకారణ్యంలో ఒంటరిగా.. ఎటువంటి ఆయుధాలు లేకుండా ధైర్యసాహసాలతో నిత్యం ప్రమాదాల(ఎర్రచందనం స్మగ్లర్లు, క్రూర జంతువులు) అంచున విధులు నిర్వహిస్తోంది. మానవసాధ్యం కాదు.. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా ఆమె నిర్వహిస్తున్న విధులు మానవసాధ్యం కానివి. అధికారులు ఆమె రోజూ విధులకు హాజరుకాలేకపోయినా ఒత్తిడి తీసుకురావడం లేదు అని తిరుపతి డివిజినల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ టీవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రిటిష్ కాలంలో బాలుపల్లె, మొగిలిపెంటల మధ్య మోటరు వాహానాలకు ట్రాక్ ఉండేదని చెప్పారు.