సీనియర్ నటి సుబ్బలక్ష్మి(87) రెండురోజుల క్రితం (నవంబర్ 30న) అనారోగ్యంతో మృతి చెందారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించిన ఈమె వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. తాజాగా ఆమె మనవరాలు సౌభాగ్య.. సుబ్బలక్ష్మి చివరి వీడియోను షేర్ చేసింది. ఇందులో సుబ్బలక్ష్మి.. తన ముని మనవరాలు సుధాపూతో సరదాగా ఆడుకుంది.
ఎనిమిది నెలల క్రితం ఎంతో ఆరోగ్యంతో చిన్నారితో ఆడుకున్న ఆమె రెండు నెలలక్రితం అనారోగ్యానికి లోనైనట్లు కనిపిస్తోంది. ఇక 15 రోజుల క్రితమైతే ఆమె బెడ్‌పైనే ఉంది. లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ చిన్నారిని నవ్వించేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో చూసిన జనాలు నిన్ను మిస్ అవుతాం అమ్మమ్మ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా సుబ్బలక్ష్మి దక్షిణాదిన అనేక సినిమాలు చేశారు. తెలుగులో కళ్యాణరాముడు సినిమాలో నటించారు. ఏ మా చేసావె చిత్రంలో సమంత అమ్మమ్మగా కనిపించారు.
నందనం, పాండిప్పడ, సీఐడీ మూస, తిలకం, బీస్ట్ వంటి పాపులర్ సినిమాల్లో యాక్ట్ చేశారు. సినిమాలే కాకుండా సీరియల్స్ కూడా చేశారు. అలాగే వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించారు. నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సేవలందించారు. 1951లో ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగినిగా పని చేశారు. దక్షిణ భారతదేశం నుంచి ఆల్ ఇండియా రేడియోలో పని చేసిన తొలి లేడీ కంపోజర్‌గా సుబ్బలక్ష్మి రికార్డు సృష్టించారు.
చదవండి: ‘మట్టి కుస్తీ’ భామ ఐశ్వర్యా లక్ష్మి గురించి ఈ విషయాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment