తిరుమల : తిరుమల అడవుల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహించారు. అందులోభాగంగా వేద పాఠశాల సమీపంలోని అన్నదమ్ములబండ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని టాస్క్ఫోర్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు. టాస్క్ఫోర్స్ డీఐజీ ఎం. కాంతారావు నేతృత్వంలో కూంబింగ్ కొనసాగుతుంది.