తిరుపతి: బాక్రాపేట అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ సమాచారం అందుకున్న టాస్క్ పోర్స్ పోలీసులు ఆదివారం రంగంలోకి దిగారు. ముగ్గురు ఎర్రచందనం కూలీలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం కూలీల వద్ద నుంచి రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.