'మిత్రపక్షంగా ఉంటూనే హోదా కోసం పోరాటం'
-డిప్యూటీ సీఎం చిన రాజప్ప వెల్లడి
రాజమండ్రి: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉంటూనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని ఉప ముఖ్యమంత్రి ఎన్.చిన రాజప్ప వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా టేకిశెట్టిపాలెంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నుంచి వైదొలగితే రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడం కుదరదనే తాము కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.
విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా అప్పటి యూపీఏ సర్కార్ దగా చేసినందునే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఐదింటిని కరువు జిల్లాలుగా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో కరువు నిర్మూలన కోసం కృషి చేస్తామని చెప్పారు.