సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్పకు తీవ్ర అవమానం జరిగింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభానికి హోంమంత్రికి ఆహ్వానం లభించలేదు. వివరాల్లోకి వెళ్తే ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శంఖుస్థాపన చేశారు. అయితే ఆసమయంలో హోంమంత్రి అక్కడ లేకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభానికి హోంమంత్రి చినరాజప్పకు ఆహ్వానం అందలేదు. తూతూ మంత్రంగా ఒక కానిస్టేబుల్‌తో ఆహ్వానం పంపించి చేతులు దులుపుకున్నారు. దీంతో హోంమంత్రి చినరాజప్ప అలకపూనారు. ప్రారంభోత్సవానికి వెళ్లకుండా హుటాహుటిన తిరుమలకు వెళ్లారు. ఇప్పటికే చాలా సార్లు ఇలాంటి సంఘనలు జరిగాయని మంత్రి వాపోయినట్టు సమాచారం. ఇప్పటివరకూ తనకు ఆహ్వానం అందినా అందకపోయినా ప్రతి కార్యక్రమానికి వెళ్లానని, కానీ ఇప్పుడు సొంత శాఖలో జరిగిన అవమానాన్ని మాత్రం ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నానని అన్నారు.
అయితే ఈసంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్‌లో హోంమంత్రిని బుజ్జగించే పనిచేశారు. దీనిపై స్పందిచడానికి హోంశాఖ అధికారులు, ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు నిరాకరించారు. సాక్షాత్తు మంత్రికే ఇలా జరగడంతో భవిశ్యత్తులో తమలాంటి చిన్న నేతల పరిస్థితి ఏంటని తెలుగుదేశం నేతలు గుసగుసలాడుతున్నారు.
చినరాజప్పకు తీవ్ర అవమానం
Comments
Please login to add a commentAdd a comment