హైదరాబాద్:అకాల వర్షం కారణంగా నష్టపోయిన కరువు ప్రాంతాల సహాయక చర్యల్లో భాగంగా రూ.120 కోట్లు విడుదల చేశామని డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. అన్ని కరువు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు పూర్తిస్థాయి నిధులు విడుదల చేశామన్నారు. దీంతో పశుగ్రాసానికి ఇబ్బందులు లేకుండా నిధులు విడుదల చేసినట్లు చినరాజప్ప తెలిపారు.