సాక్షి, అమరావతి : తెలంగాణలో టీడీపీ బలంగా లేకపోవడంతోనే 13 స్థానాల్లో పోటీ చేశామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తొలిసారి ఆయన స్పందించారు. ప్రజలు మంచోళ్లు, తెలివైన వాళ్లు కాబట్టే అభివృద్ధికి ఓటేశారని వ్యాఖ్యానించారు. ఏపీలో కూడా ప్రజలు అదే విధంగా తీర్పును ఇస్తారని అభిప్రాయపడ్డారు. కాగా తెలంగాణ ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment