విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారమిక్కడ సమావేశం అయ్యారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష, తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఈ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. మరోవైపు ముద్రగడ చేపట్టిన దీక్ష నేటికి తొమ్మిదో రోజుకు చేరింది. కాగా ముద్రగడకు సంఘీభావంగా కాపులు నిరసనలు, ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
చంద్రబాబుతో హోంమంత్రి సమావేశం
Published Fri, Jun 17 2016 11:36 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM
Advertisement
Advertisement