
పవన్ పై వ్యాఖ్యలను ఖండించిన చినరాజప్ప!
హైదరాబాద్: జనసేన అధ్యక్షడు, సినీ హీరో పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం చినరాజప్ప ఖండించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని పాజిటివ్ గా తీసుకోవాలే తప్ప తిరిగి విమర్శలకు దిగడం మంచి పద్ధతి కాదని చిన రాజప్ప పేర్కొనట్లు సమాచారం.
టీడీపీ ఎంపీల వ్యాఖల్నివెనక్కు తీసుకోకపోతే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన హెచ్చరించారని.. దీనిలో భాగంగానే ఈ విషయాన్ని ఇప్పటికే టీడీపీ ముఖ్య నాయకుల వద్ద ప్రస్తావించారని తెలుస్తోంది.