
'ఆ హక్కు బొత్సకు లేదు'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించడంపై డిప్యూటీ సీఎం చినరాజప్ప మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే హక్కు బొత్సకు లేదని చినరాజప్ప స్పష్టం చేశారు. వోక్స్ వ్యాగెన్ కుంభకోణంలో అవినీతిపరుడిగా ముద్రపడిన బొత్స.. చంద్రబాబును విమర్శించడటం విడ్డూరంగా ఉందన్నారు.
పోలీస్ శాఖ విభజన త్వరలో పూర్తవుతుందన్నారు. హుద్ హుద్ ప్రభావిత జిల్లాల్లోరూ. 2200 కోట్లు నిధుల సాయానికి ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని చిన రాజప్ప తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రపంచ బ్యాంక్ నిధులు వినియోగిస్తామని ఆయన ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.