
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : మాజీ మంత్రి చిన రాజప్పపై పెద్దాపురం వైఎస్సార్‌సీపీ ఇంచార్జీ తోట వాణి ఫైర్ అయ్యారు. గత ఐదేళ్లలో అభివృద్ధి ముసుగులో రాజప్ప అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చిన రాజప్ప హోంమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో శాంత్రి భద్రతలు కరువై 5 మర్డర్లు జరిగాయని గుర్తు చేశారు. ఐదేళ్లలో ఆయన చేసిన అవినీతిని త్వరలోనే బయటపెడతామన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే పదవులే ఉండాల్సిన అవసరం లేదన్న విషయాన్ని చినరాజప్ప గమనించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను నియోజకవర్గంలో ప్రజలకు సక్రమంగా చేరేలా కృషి చేస్తానని వాణి పేర్కొన్నారు.