Thota vani
-
‘పార్టీని వీడుతున్నట్టు వార్తలు అవాస్తవం’
సాక్షి, తూర్పుగోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నాయకురాలు తోట వాణి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఆమె స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత వార్తలు ప్రచురించడం మీడియా సంస్థలకు తగదని హితవు పలికారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. తప్పుడు అఫివిడవిట్తో చినరాజప్ప ఎన్నికల సంఘాన్ని మోసం చేశారని తోటవాణి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన చినరాజప్ప) -
‘చినరాజప్పను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుంది’
సామర్లకోట, (పెద్దాపురం): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తప్పుడు అఫిడవిట్‌ను దాఖలు చేసి ఎన్నికల కమిషన్‌ను మోసం చేశారని ఆ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన తోట వాణి ఆరోపించారు. పెద్దాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అఫిడవిట్ ఫారం–26లో 5వ కాలమ్‌లో అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా, లేవా.. అనే కాలమ్‌లో ఎటువంటి కేసులు లేవన్నట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని తెలిపారు. అయితే ఓబుళాపురం మైనింగ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా దౌర్జన్యంగా మారణాయుధాలు ధరించి దాడి చేశారని, పోలీసులు వారించినా వినకుండా ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పారు. అడ్డువచ్చిన పోలీసులను తోసివేసి అసభ్య పదజాలంతో దూషించిన నేరానికి.. రాజప్పతో పాటు మరో 20 మందిపై 2007 జూలై 21న పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 15వ ముద్దాయిగా ఉన్న చినరాజప్పకు రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసిందని, తదుపరి ఈ కేసు విజయవాడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిందన్నారు. విజయవాడ కోర్టు కూడా 2018 డిసెంబర్ 28న కేసు నంబరు 50గా నమోదుచేసి అరెస్టు వారెంటు ఇచ్చిందని ఆమె చెప్పారు. కేసు నమోదు 2014 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా పెన్షన్ పొందుతున్నారని, 2019 ఎన్నికలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఆదాయం పొందుతూ ఉండగా.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొని ఎన్నికల కమిషన్‌ను మరో మోసం చేశారని ఆమె చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లో దాఖలు చేసిన నకలు ఆధారాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లపై ఈ నెల 5వ తేదీన ఏపీ హైకోర్టులో రాజప్పపై కేసు నమోదైందని.. ఆరు నెలల్లో ఆయనను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుందని.. తదుపరి వచ్చిన మెజార్టీ ఆధారంగా ఎమ్మెల్యేగా తనకు అవకాశం వస్తుందని తోట వాణి వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ తోట నరసింహం తదితరులున్నారు. -
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన చినరాజప్ప
-
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన చినరాజప్ప
సామర్లకోట, (పెద్దాపురం): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తప్పుడు అఫిడవిట్‌ను దాఖలు చేసి ఎన్నికల కమిషన్‌ను మోసం చేశారని ఆ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన తోట వాణి ఆరోపించారు. పెద్దాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అఫిడవిట్ ఫారం–26లో 5వ కాలమ్‌లో అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా, లేవా.. అనే కాలమ్‌లో ఎటువంటి కేసులు లేవన్నట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని తెలిపారు. అయితే ఓబుళాపురం మైనింగ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా దౌర్జన్యంగా మారణాయుధాలు ధరించి దాడి చేశారని, పోలీసులు వారించినా వినకుండా ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పారు. అడ్డువచ్చిన పోలీసులను తోసివేసి అసభ్య పదజాలంతో దూషించిన నేరానికి.. రాజప్పతో పాటు మరో 20 మందిపై 2007 జూలై 21న పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 15వ ముద్దాయిగా ఉన్న చినరాజప్పకు రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసిందని, తదుపరి ఈ కేసు విజయవాడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిందన్నారు. విజయవాడ కోర్టు కూడా 2018 డిసెంబర్ 28న కేసు నంబరు 50గా నమోదుచేసి అరెస్టు వారెంటు ఇచ్చిందని ఆమె చెప్పారు. కేసు నమోదు 2014 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా పెన్షన్ పొందుతున్నారని, 2019 ఎన్నికలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఆదాయం పొందుతూ ఉండగా.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొని ఎన్నికల కమిషన్‌ను మరో మోసం చేశారని ఆమె చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లో దాఖలు చేసిన నకలు ఆధారాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లపై ఈ నెల 5వ తేదీన ఏపీ హైకోర్టులో రాజప్పపై కేసు నమోదైందని.. ఆరు నెలల్లో ఆయనను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుందని.. తదుపరి వచ్చిన మెజార్టీ ఆధారంగా ఎమ్మెల్యేగా తనకు అవకాశం వస్తుందని తోట వాణి వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ తోట నరసింహం తదితరులున్నారు. -
‘చినరాజప్ప చేసిన అవినీతిని బయటపెడతా’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : మాజీ మంత్రి చిన రాజప్పపై పెద్దాపురం వైఎస్సార్సీపీ ఇంచార్జీ తోట వాణి ఫైర్ అయ్యారు. గత ఐదేళ్లలో అభివృద్ధి ముసుగులో రాజప్ప అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చిన రాజప్ప హోంమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో శాంత్రి భద్రతలు కరువై 5 మర్డర్లు జరిగాయని గుర్తు చేశారు. ఐదేళ్లలో ఆయన చేసిన అవినీతిని త్వరలోనే బయటపెడతామన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే పదవులే ఉండాల్సిన అవసరం లేదన్న విషయాన్ని చినరాజప్ప గమనించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను నియోజకవర్గంలో ప్రజలకు సక్రమంగా చేరేలా కృషి చేస్తానని వాణి పేర్కొన్నారు. -
వేట్లపాలెంలో టీడీపీకి బీటలు
సామర్లకోట (పెద్దాపురం): సామర్లకోట మండలంలోని వేట్లపాలెం గ్రామానికి చెందిన బొడ్డు భాస్కర రామారావు వర్గీయులు సుమారు 300 మంది సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. దీంతో ఈ గ్రామంలో టీడీపీ కోటకు బీటలు పడ్డాయి. భాస్కరరామారావు స్వగ్రామం వేట్లపాలెం టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఆయనకు ఆ గ్రామంలో అనేక మంది అభిమానులు, బంధువులు ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఆయన విజయం సాధించారు. టీడీ పీ పెద్దాపురం ఎమ్మెల్యే సీటు కోసం ఆయన తీవ్ర ప్రయత్నమే చేశారు. రాజమహేంద్రవరం ఎంపీ టికెట్ ఇస్తున్నట్టు ప్రచా రం చేసినా ఆ సీటు కూడా ఆయనకు ఇవ్వలేదు. ఈ నేపథ్యం లో ఆయన ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉండడంతో.. ఆయన అభిమానులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నుంచి మరోసారి విజయం సాధిస్తే భాస్కర రామారావుకు భవిష్యత్తులో టికెట్ గల్లంతు అవుతుందని ఉద్దేశంతో రాజప్పను ఓడించాలంటూ వారందరూ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీ యువ నాయకుడు, భాస్కరరామారావు ముఖ్య అనుచరుడు గోలి శ్రీరామ్ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి తోట వాణి, పార్టీ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. నున్నా వెంకట్రాజు, చలికి ప్రకాష్, గోలి వెంకట్రావుతో పలువురు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోరంపూడి శ్రీరంగనాయకులు, సీనియర్ రాజకీయ నాయకుడు గోలి రామారావు, నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు విజయలక్ష్మి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొబ్బరాడ సత్తిబాబు, పార్టీ జిల్లా కార్యదర్శి ఆదపురెడ్డి శ్రీనివాస్, తోట రాంజీ తదితరులు పాల్గొన్నారు. -
72 ఏళ్లలో నాలుగో నారి
సాక్షి, అమలాపురం టౌన్: అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గత 72 ఏళ్లలో జరిగిన 15 ఎన్నికల్లో (వీటిలో ఒకటి ఉప ఎన్నిక) మహిళా అభ్యర్థులు ఇప్పటి వరకూ ముగ్గురే పోటీ చేశారు. నాలుగో మహిళా అభ్యర్థిగా ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి చింతా అనురాధ పోటీ చేస్తున్నారు. 1980లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జనతా పార్టీ నుంచి ఈశ్వరీబాయి తొలి మహిళా అభ్యర్థిగా పోటీ చేసి, అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కుసుమ కృష్ణమూర్తి చేతిలో పరాజితులయ్యారు. రెండో మహిళా అభ్యర్థిగా 2003లో ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి భార్య విజయకుమారి టీడీపీ తరఫున పోటీ చేసి ఎంపీ అయ్యారు. 2009 జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపకుడు దివంగత పీవీ రావు భార్య పోతుల ప్రమీలాదేవి పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జీవీ హర్షకుమార్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు నాలుగో మహిళా అభ్యర్థిగా చింతా అనురాధ పోటీ చేస్తున్నారు. ఇప్పటి దాకా పోటీ చేసిన నలుగురు మహిళా అభ్యర్థుల్లో అనురాధే పిన్న వయస్కురాలు. 2009 లో పోటీ చేసిన ప్రమీలాదేవి, ఇప్పుడు పోటీ చేస్తున్న అనురాధ అల్లవరం మండలానికి చెందిన వారే. ఇక్కడ తరుణికి తొలిసారి.. సామర్లకోట (పెద్దాపురం): పెద్దాపురం నియోజకవర్గం ఏర్పడిన తరువాత మొదటిసారిగా ఓ మహిళకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని వైఎస్సార్ సీపీ కల్పించింది. మాజీ మంత్రి, కాకినాడ ఎంపీ తోట నరసింహం భార్య వాణిని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించి తొట్టతొలుతగా ఈ బరిలో మహిళను పోటీకి నిలిపిన ఘనతను సొంతం చేసుకుంది.. పెద్దాపురం నియోజకవర్గం 1952లో ఏర్పడగా మొదటి సారిగా 1955లో ఎన్నికలు జరిగాయి. 2014 వరకూ 13 పర్యాయాలు జనరల్ అభ్యర్థులే పోటీలో ఉన్నారు. బీకాం పూర్తి చేసిన తోట వాణిది రాజకీయ కుటుంబం కావడంతో ఆమె కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో వీరవరం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. వాణి తండ్రి మెట్ల సత్యనారాయణరావు రాష్ట్ర మంత్రిగా పని చేశారు. భర్త తోట నరసింహం ఒక పర్యాయం ఎమ్మెల్యేగా, మరో పర్యాయం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. 2014లో కాకినాడ ఎంపీగా ఎన్నికయ్యారు. -
చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ
సాక్షి, హైదరాబాద్ : టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉండదని, ఏపీకి ప్రత్యేక హోదా అంశం సాధించే విషయంలో అనారోగ్యం పాలైతే పట్టించుకున్న నాథుడు లేడని కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన నాయకుడిని ఆదుకోవాల్సిన కనీస బాధ్యతను టీడీపీ మరిచిందని మండిపడ్డారు. టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో తన భార్య తోట వాణితో కలిసి ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనారోగ్యం పాలైన జక్కంపూడి రామ్మోహన్‌రావుని ఆయన శ్రద్ధ చూపి ఆదుకున్నారని గుర్తు చేశారు. అది నాయకుడి మంచి లక్షణాలకు ఒక పెద్ద ఉదాహరణ. అది వైఎస్సార్ గొప్పతనం. ఎన్నికల్లో పోటీచేసేందుకు టికెట్ ఇచ్చే విషయం కాదు. కానీ టీడీపీలో కనీస గౌరవ, మర్యాద ఇవ్వలేదు. అందుకనే టీడీపీనీ వదిలేశాను. ఇకనుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తాము. ఆయన నాయకత్వంలొనే ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాము. టికెట్ కేటాయింపు అధినేత ఇష్టం. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే. చంద్రబాబుకు మేమిచ్చిన గౌరవాన్ని నిలుపుకోలేదు. 5 శాతం కాపు రిసర్వేషన్ల అమలు దేవుడి చేతిలో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఇది శుభసూచకం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరడం శుభ సూచకమన్నారు తోట వాణి. ఆరోగ్యం లెక్క చేయకుండా నరసింహం టీడీపీ కోసం పని చేస్తే కనీసం ఎవరూ లెక్క చెయ్యలేదని మండిపడ్డారు. తన భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం ఫోన్ చేసి పరామర్శించలేదని వాపోయారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు కూడా చేయకపోవడం చాలా బాధ అనిపించిందన్నారు. కబ్జాలు, మైనింగ్క్వారీలను మింగేసిన వారికి టికెట్ ఇవ్వడమే టీడీపీ సర్వేనా అని సూటిగా ప్రశ్నించారు. తన భర్త ఆరోగ్యం విషయంలో వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు’ అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. -
టీడీపీలో కనీస గౌరవ, మర్యాద ఇవ్వలేదు
-
చినరాజప్పపై తోట వాణి ఆగ్రహం
-
‘చనిపోయిన నా తండ్రినీ ఆయన వదల్లేదు’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ మంత్రులు చినరాజప్ప, యనుమల రామకృష్ణుడిపై కాకినాడ ఎంపీ తోట నరసింహం సతీమణి తోట వాణి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. ‘రాజకీయంగా నా తండ్రితో పాటుగా నా కుటుంబాన్ని తొక్కెయ్యడానికి హోం మంత్రి రాజప్ప ప్రయత్నాలు చేశారు. చనిపోయిన నా తండ్రిని కూడా రాజప్ప వదల్లేదు. టీవీలలో నా తండ్రి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణను వాడు వీడు అని రాజప్ప సంభోధించారు. నా తండ్రి.. నా భర్త నేర్పిన సంస్కారం వల్ల రాజప్పను తిరిగి నేను ఒక్క మాట కూడా తప్పుగా అనలేదు. రాజప్ప మా కుటుంబాన్ని ఎంత దారుణంగా అణగదొక్కారో ప్రజలందరికి తెలుసు. ఎక్కడో కోనసీమ నుంచి తీసుకొచ్చి రాజప్పను పెద్దాపురంలో పెడతారా. ఇక్కడ నాయకులు లేరా. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పబోతున్నాను’ అని వాణి ధ్వజమెత్తారు. సంస్కారం లేని పెద్దాయన ‘నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలన్న జ్ఞానం లేని ఓ పెద్దాయన జిల్లాలో ఉన్నారు. ఆయనది బలుపో.. బద్దకమో తెలియదు’ అని పరోక్షంగా ఆర్థిక మంత్రి యనుమల రామకృష్ణుడికి వాణి చురకలు అంటించారు. అలాంటి వ్యక్తుల మధ్య మనుగడ సాధించలేమని భావించిన కారణంగా తాను, తన భర్త నరసింహం టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘రేపు వైఎస్సార్ సీపీలో చేరుతున్నాం. ఆ పార్టీ మాకు సముచిత స్ధానం ఇస్తుందని నమ్ముతున్నాం. వైఎస్ జగన్ మాకు భరోసా కూడా ఇచ్చారు’ అని ఆమె హర్షం వ్యక్తం చేశారు. -
మంత్రి సతీమణి తోట వాణి దీక్ష భగ్నం
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి తోట నరసింహం భార్య వాణి గత ఆరు రోజులుగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను హై డ్రామాను తలపించే విధంగా శుక్రవారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు. కాకినాడలోని భాను గుడి సెంటర్ లోని దీక్ష శిబిరానికి జిల్లా కలెక్టర్ నీతు కుమారి ప్రసాద్, జిల్లా ఎస్పీ శివ శంకర్ రెడ్డిలు చేరుకుని తోట వాణి దీక్షను భగ్నం చేశారు. వాణి దీక్షను భగ్నం చేయడాన్ని కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే పోలీసులు పరిస్థితి చక్కదిద్ది వెంటనే తోట వాణిని కాకినాడ జనరల్ ఆస్పత్రికి తరలించి, బలవంతంగా దీక్షను విరమింప చేసినట్టు పోలీసుల అధికారి ఒకరు వెల్లడించారు. వాణి దీక్ష విరమించిందని.. ఆమెకు చికిత్సను అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకట్ తెలిపారు. వాణి దీక్ష విరమించాలని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రులు పల్లం రాజు, చిరంజీవి, కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మిలు కోరిన సంగతి తెలిసింది. అంతేకాకుండా ఆంటోని కమిటికి తమ అభిప్రాయాలను తెలుపాలని అభ్యర్థించారు. వాణి ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. దీక్షను కొనసాగిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం, పోలీసులు దీక్షను భగ్నం చేశారు. -
తోట వాణి నిరాహార దీక్ష భగ్నం
-
క్షీణించిన తోట వాణి ఆరోగ్యం
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న డిమాండుతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తోట వాణి ఆరోగ్యం క్షీణించింది. రాష్ట్ర మంత్రి తోట నరసింహం భార్య అయిన వాణి గత ఆరు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఆమె శరీరంలో సోడియం స్థాయి గణనీయంగా పడిపోయిందని, రక్తపోటు పెరిగి మధుమేహం స్థాయి కూడా పడిపోయిందని కాకినాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ వెంకట బుద్ధ తెలిపారు. గురువారం దీక్ష విరమించకపోతే ఆమె ఆరోగ్యం బాగా విషమించే ప్రమాదమున్నట్లు ఆయన వివరించారు. తోట వాణి ఆరోగ్యం క్షీణించిన విషయం తెలియడంతో కాకినాడలో మంత్రి అనుచరులు ప్రధాన రహదారులన్నింటినీ దిగ్బంధించారు. భానుగుడి సెంటర్‌కు దారితీసే దారులన్నింటినీ దాదాపుగా మూయించారు. కార్యకర్తలు వీధులన్నింటిలో మోటారు సైకిళ్లపై తిరుగుతూ దుకాణాలు, సినిమా థియేటర్లను మూయించారు. ఒక మహిళ ఇన్నాళ్లుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదంటూ సమైక్యవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణి దీక్ష నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు సుమారు 50 మంది పోలీసులు కీలక ప్రాంతాల్లో ఉన్నారు. గురువారం రాత్రి ఏదో ఒక సమయంలో తోట వాణిని అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.