'టీడీపీ గంగానది లాంటిది' | TDP is like the river Ganga: kala venkat rao | Sakshi
Sakshi News home page

'టీడీపీ గంగానది లాంటిది'

Published Thu, Dec 3 2015 2:46 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'టీడీపీ గంగానది లాంటిది' - Sakshi

'టీడీపీ గంగానది లాంటిది'

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ గంగానది వంటిదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. గంగానదిలో ఎన్నో ఉప నదులు క లిసినట్లుగానే టీడీపీలోకి ఎంత మంది వచ్చి చేరినా పార్టీ గొప్పతనం తగ్గదన్నారు.

 

బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 171 నియోజకవర్గాల్లో జనచైతన్య యాత్రలు ప్రారంభమయ్యాయన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గురువారం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో, 7న శ్రీకాకుళం, విజయనగరం, 11న చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే జనచైతన్య యాత్రల్లో పాల్గొంటారని చెప్పారు.

 టీడీపీలో చేరిన ఆనం సోదరులు : మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనం రాంనారాయణరెడ్డి, ఆయన సోదరుడు వివేకానందరెడ్డి బుధవారం టీడీపీలో చేరారు. వారిద్దరికీ పార్టీ అధినేత   చంద్రబాబు విజయవాడ లోని తన నివాసంలో పచ్చకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement