East Godawari district
-
తల్లితో గొడవ పడుతున్నాడని కన్న తండ్రిని..
పి.గన్నవరం: క్షణికావేశంలో కన్న తండ్రిని కుమారుడు హత్య చేసిన సంఘటన పి.గన్నవరం మండలంలోని ఎల్.గన్నవరం శివారు నడిగాడిలో శనివారం చోటుచేసుకుంది. తల్లిని కొట్టడానికి వస్తున్నాడన్న కోపంతో.. తండ్రి తలపై కుమారుడు కర్రతో కొట్టడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. పి.గన్నవరం ఏఎస్సై కేఎస్‌వీఎస్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నడిగాడికి చెందిన యన్నాబత్తుల చిన్నబాబు (48) కొబ్బరి దింపు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం భర్త చిన్నబాబు రేషన్ బియ్యం పట్టుకు వచ్చి భార్యను పిలిచి అన్న పెట్టమన్నాడు. అందుకు ‘నువ్వు ఏమైనా జమీందారువా, అన్నం పెట్టుకుని తిను’ అని భార్య సమాధానం ఇచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన చిన్నబాబు కొట్టడానికి వెళ్లడంతో చిన్నకొడుకు అరుణ్ కుమార్ అడ్డుపడ్డాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఆగ్రహించిన అరుణ్‌కుమార్ కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తండ్రి అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్సై ప్రసాద్ సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు. -
ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుండగా..
రామచంద్రపురం: రైల్వే స్టేషన్‌లోని ఓ గదిలో తోటి ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుండగా రహస్య కెమెరాతో చిత్రీకరించిన ఓ సూపరింటెండెంట్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం రైల్వే స్టేషన్లో మహ్మద్ రియాజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇదే స్టేషన్లో ఓ వివాహిత గేట్‌కీపర్‌గా సుమారు ఏడాది నుంచి విధులు నిర్వహిస్తోంది. ఇటీవల స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ఎత్తివేయడంతో ఆ గదిలో మహిళా ఉద్యోగి దుస్తులు మార్చుకుని యూనిఫాం వేసుకుంటోంది. ఇది గమనించిన రియాజ్ గదిలోని ఓ ప్రదేశంలో రహస్య కెమెరాను అమర్చి చిత్రీకరణకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా ఈ తతంగం సాగుతుండగా బుధవారం గదిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో కెమెరాకు ఉన్న చిన్న ఎల్ఈడీ బల్బు వెలుగు కనిపించడంతో అనుమానం వచ్చి తీసి చూడగా అసలు విషయం బయటపడింది. సూపరింటెండెంట్ ల్యాప్‌టాప్‌లో కెమెరాలో చిత్రీకరించిన వీడియోలను గుర్తించిన బాధితురాలు పైఅధికారులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీష్ తన సిబ్బందితో రామచంద్రపురం రైల్వే స్టేషన్‌కు చేరుకొని రహస్య చిత్రీకరణను నిర్ధారించారు. కెమెరాను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి రైల్వే డీఆర్ఎంకు నివేదిక అందించారు. డీఆర్ఎం ఆదేశాల మేరకు నిందితుడు మహ్మద్ రియాజ్‌ను సస్పెండ్ చేశారు. -
రైలు తగలబెట్టించిన ఘనుడు చంద్రబాబు: వైఎస్ జగన్
సాక్షి, తుని : చంద్రబాబు నాయుడు పాలనంతా అవినీతిమయమని... ఇసుక, మట్టి, గుడి భూములు సహా దేన్నీ వదలడం లేదని.. కాపు రిజర్వేషన్ల ఉద్యమం సమయంలో కుట్ర పూరితంగా రైలును తగలబెట్టించిన ఘనుడు ఏపీ సీఎం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. మఠానికి చెందిన 425 ఎకరాల భూమిని కాజేసేందుకు చూసిన చంద్రబాబు, దేవుడి భూములను బ్యాంకుల్లో తాకట్టు పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు బినామీ కంపెనీ దివీస్ అని పేర్కొన్న వైఎస్ జగన్, దివీస్‌కు భూములు ఇవ్వలేదని రైతులపై కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 234వ రోజు శనివారం తుని పట్టణానికి చేరుకుంది. ఇక్కడ అడుగుపెట్టగానే రాజన్న తనయుడి పాదయాత్ర 2700 కిలోమీటర్ల అరుదైన మైలురాయిని చేరుకోవడం విశేషం. తూర్పు గోదావరి జిల్లా తునిలో జననేత జగన్‌కు ప్రజలు, పార్టీనేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొన్న వైఎస్ జగన్.. సీఎం చంద్రబాబు నాలుగన్నరేళ్ల పాలనంతా అవినీతేనంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు బినామీ కంపెనీ దివీస్ ‘ఏపీ సీఎం చంద్రబాబు బినామీ కంపెనీ దివీస్.రైతన్నల నుంచి మాత్రం ఎకరాలకు ఎకరాలు లాగేసుకుంటున్నారు. దివీస్‌కు భూములు ఇవ్వలేదని రైతులపై కేసులు పెడుతున్నారు. కంపెనీలు రావాల్సిన చోట రావాలి. విశాఖలో ఫార్మా కంపెనీ వచ్చి ఉంటే అందరం సంతోషించేవాళ్లం. కానీ అతిపెద్ద హాచరిస్ ఉన్న తుని నియోజకవర్గంలోని ప్రాంతంలో ఇలాంటి కంపెనీలా. పైగా కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని ఆక్వా జోన్‌గా ప్రకటించింది. ఇక్కడ ఫార్మా కంపెనీలు పెట్టి నీళ్లను కలుషితం చేసి ఆక్వాజోన్‌కు ఆటంకాలు కలిగిస్తున్నారు చంద్రబాబు. కాపు రిజర్వేషన్లకు మద్దతిచ్చాం ఇదే తుని నియోజకవర్గంలో కాపుల రిజర్వేషన్లకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతిచ్చింది. దానివల్ల ఏం జరిగిందంటే 75 శాతం వైఎస్సార్సీపీ కార్యకర్తలను కేసుల్లో ఇరికించారు. కుట్రపూరితంగా రైలును తగలబెట్టించిన వ్యక్తి సీఎం చంద్రబాబు. ఎస్సీలు, బీసీలు, ఆడపడచులు, చివరికి వికలాంగులపై కూడా కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రైలు దగ్దం ఘటనలో నమోదైన తప్పుడు కేసులన్నింటినీ ఎత్తేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. తునిని ఏ విషయంలోనూ పట్టించుకోలేదు తుని ప్రభుత్వాసుపత్రిని పట్టించుకునే వారే లేరు. లెక్క ప్రకారం ఇక్కడ ఆస్పత్రుల్లో 11 మంది డాక్టర్లు ఉండాలి, కానీ నలుగురే ఉన్నారు. తునిలో 108 అంబులెన్స్ కూడా పనిచేయడం లేదు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తునిలో 11 వేళ ఇళ్లు కట్టించి ఇచ్చారు. తాండవ నుంచి మంచినీటి కోసం మహానేత హయాంలో రూ.26 కోట్లు ఇచ్చారు. ఆ మహానేత నేడు మనమధ్య లేకపోవడంతో ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. కరకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చి నాలుగన్నరేళ్లు గడిచినా లాభం లేదు. చెత్త వేయడానికి తునిలో డంపింగ్ యార్డ్ కూడా లేదని, శ్మశానాలలో చెత్త వేయాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం తుని నియోజకవర్గంలోనే ఇన్ని సమస్యలుంటే.. రాష్ట్రం మొత్తం ఇంకా ఎన్ని సమస్యలున్నాయో అని అన్నారు. వైఎస్ జగన్ ప్రసంగంలోని మరిన్ని అంశాలివి: నిరుద్యోగ భృతి కింద బాబు ప్రతి ఇంటికీ లక్ష రూపాలయు బాకీ. నేడు కేవలం 10 లక్షల మందికి వెయ్యి రూపాయల చొప్పున ఇస్తారట. అదీ 4 నెలలు మాత్రమే అంటున్నారు చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పిందేంటి.. ఇప్పుడు చేస్తున్నదేంటి. అబద్దాలు చెప్పేవాళ్లు.. మోసాలు చేసేవాళ్లు మీకు నాయకుడిగా కావాలా...? రైతన్నలకు రుణాలు మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నాడు. నేడు ఏమైంది. 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయా, కనీసం బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన బంగారమైనా ఇంటికి వచ్చిందా అంటే అది లేదన్నారు. అక్కాచెల్లెమ్మలను కూడా మోసం చేసి వారి చేత కన్నీళ్లు పెట్టించిన ఘనుడు చంద్రబాబు చిన్నపిల్లలు కదా అని వారి జోలికి వెళ్లడానికి ఇష్టపడరు. కానీ జాబు రావాలంటే బాబు రావాలని.. విద్యార్థులను నట్టేట ముంచారు చంద్రబాబు. కేవలం చంద్రబాబుకే జాబు వచ్చింది. మీ పిల్లలు ఏదీ చదవకపోయినా పర్వాలేదు. ప్రతి ఇంటికి చంద్రబాబు ఉద్యోగం లేక ఏదైనా ఉపాధి ఇస్తారు. లేనిపక్షంలో నెలనెలా రూ.2 వేలు ఇస్తామని చెప్పారు ఉచితంగా పిల్లలకు చదువు చెప్పించాల్సిన సీఎం చంద్రబాబు తానే బినామీగా మారి నారాయణ, శ్రీచైతన్య అనే ప్రైవేట్ విద్యాసంస్థలను నిర్వహిస్తుండటం మన దౌర్భాగ్యం. ఇలాంటి విద్యాసంస్థల్లో చదవాలంటే ఏడాది లక్షలకు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ పేదలకు అది సాధ్యం కాదు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. స్కూలు ఫీజులు, కాలేజీ ఫీజులు తగ్గిస్తాం. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి గత నాలుగైదు నెలలుగా చెల్లించాల్సిన బకాయిలు ఇంకా ఇవ్వకుండా విద్యార్థుల్ని ప్రైవేట్ బాట పట్టించాలన్నదే చంద్రబాబు ఉద్దేశం పిల్లల్ని బడికి పంపే తల్లులకు 15 వేల రూపాయలు ఇస్తాం. అప్పుడు ఆ తల్లులు చదువుకుని ప్రయోజకులు అయ్యి కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు. మెస్, బోర్డింగ్ ఛార్జీల కోసం రూ.20 వేలు అందిస్తాం. ఇంజినీరింగ్ కోసం కేవలం రూ.35 వేలు ప్రభుత్వం చెల్లిస్తే.. మిగతా 65 వేల ఫీజును కట్టలేక పేద విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. చంద్రబాబును ఏపీ ప్రజలు క్షమించరు ‘ఎన్ని తప్పులు చేసినా చంద్రబాబును ఇలాగే క్షమిస్తూ పోతే.. ఎన్నికలప్పుడు మరోసారి మీ వద్దకు వస్తాడు. ఎన్నికల హామీల్లో 90శాతంపైగా నెరవేర్చానంటాడు. అయితే మీరు చిన్న చిన్న మోసాలు, అబద్ధాలు నమ్మరని సీఎంకు తెలుసు. అందుకే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు చంద్రబాబు. అయినా నమ్మరని తెలిసి, ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామని చెబుతాడు. ఆపై మహిళా సాధికారమిత్ర అని కొందరు మీ ఇంటికొచ్చి రూ.3 వేలు ఇస్తారు. వద్దనకుండా రూ.5 వేలు గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లోంచి దోచేసినది. ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షిని నమ్మి ఓటేయాలంటూ’ జననేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నవాళ్లు తనను నేరుగా కలుసుకోవచ్చునని, తాను బసచేసే చోటు అందరికీ తెలుసునన్నారు వైఎస్ జగన్. -
నాలుగేళ్ల బాబు పాలనను చూస్తే ప్రజలు భయపడుతున్నారు
-
కాపులకు అండగా నిలుస్తా : వైఎస్ జగన్
తూర్పు గోదావరి/ జగ్గంపేట : చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడానికి సాధ్యం కాని హామీలను ఇచ్చి అన్ని కులాలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రిజర్వేషన్ కల్పిస్తానని కాపులను చంద్రబాబు మోసం చేశారని ఆయన మండిపడ్డారు. కాపులకు అన్యాయం జరిగిందని, వారికి తాను అండగా ఉంటానని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్‌కు రెట్టింపు నిధులు ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రతి కాపు సోదరుడికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తాను ఏదైనా మాట ఇస్తే.. దానికి కట్టుబడి ఉంటానని, చేయగలిగిందే తాను చెబుతానని, అబద్ధపు హామీలను ఇవ్వనని అన్నారు. 222వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం తూర్పు గోదావరి జిలా జగ్గంపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోని కాదని, అది కేంద్రం పరిధిలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్లు 50శాతం దాటరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భాలను ఆయన గుర్తుచేశారు. తాను మాట ఇస్తే నిలబెట్టుకొనితీరుతానని, చేయగలిగినదే చెప్తానని, కాపులకు అండగా ఉంటానని ఆయన తేల్చిచెప్పారు. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అరాచాకాలు చేస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన గడ్డ జగ్గంపేట అని గుర్తుచేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూస్తే ప్రజలు భయపడుతున్నారని, జన్మభూమి కమిటీలతో మాఫీయా గుండాలకు తయారు చేస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేను సంతలో పశువును కొన్నట్లు కొన్నారని అన్నారు. ఇసుక, మట్టిని దేనిని వదలకుండా 20నుంచి 30 కోట్లుకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు అభివృద్ధిని చూసి పార్టీ మారుతున్నామని చెప్పారని, నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. ‘కాపు రిజర్వేషన్లు కావాలని ప్రశ్నిస్తే. ముద్రగడ పద్మనాభంను నిర్భందించారు. ఆడవాళ్లని కూడా చూడకుండా పోలీసులు ఇంట్లోకి వెళ్లి దౌర్జన్యం చేశారు. చంద్రబాబు ఒక్కో కులానికి ఒక్కో పేపరు పెట్టుకుని అన్ని కులాలను మోసం చేశారు. బోయలను ఎస్టీలుగా, మత్స్యకారులను ఎస్టీలుగా, రజకులను ఎస్సీలుగా, కాపులను బీసీలుగా మారుస్తాం అని అబద్దపు హామీలను ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం ఒక్క పంటకైనా మద్దతు ధరును ప్రకటించారా. రైతుల దగ్గర పంటను చంద్రబాబు తక్కువ ధరకు కొని తన హెరిటేజ్ ఫ్రెష్‌లో మూడు రెట్లు ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. దళారీ వ్యవస్థను కట్టడిచేయాల్సిన ముఖ్యమంత్రే పెద్ద దళారీగా మారి ప్రజలను దోచుకుంటున్నారు. ప్రజలను మోసం చేసి చంద్రబాబు లాభాలు సంపాదించుకుంటుంటే, పంటలకు గిట్టుబాటు ధర ఎలా వస్తుంది. జగ్గంపేట నియోజవర్గంలోని 90 చెరువుల నుంచి మట్టిని తవ్వి ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులను తీసుకుంటున్నారు. ఒక్కొ చెరువును తాటిచెట్టులోతు తవ్వి మట్టి మఫీయా చేస్తున్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు పేదలకు 19 వేల ఇళ్లలను కట్టించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో కనీసం ఊరికి ఒక్క ఇళ్లు అయిన కట్టించారా?. ఇంత దారుణమైన పాలన ఎక్కడాలేదు. జగ్గంపేటలో ప్రధాన ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా మారుస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. నాలుగేళ్లు గడిచిన కనీసం బెడ్లు కూడా లేని పరిస్థితి. 30 పడకల ఆసుపత్రిలో కేవలం 15 బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఆసుపత్రిలో కనీసం ఎక్స్‌రే, ల్యాబ్ టెక్నిషీయన్, అంబులెన్స్ కూడా లేదు. గతంలో జగ్గంపేట ప్రభుత్వ డిగ్రి కళాశాలకు వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. చంద్రబాబు సీఎం అయి నాలుగేళ్లు అయినా కూడా ఇంకా పూర్తి కాలేదు. చంద్రబాబు అధికారంలోని వచ్చాక అన్నింటిపై రేట్లను విపరీతంగా పెంచారు. కరెంట్‌పై, పెట్రోల్, డీజిల్, స్కూల్ ఫీజులపై బాదుడే బాదుడే. వైఎస్సార్ హయాంలో రేషన్ షాపుల్లో బియ్యంతో సహా, కిరోసిన్, కందిపప్పు, వంటివి ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు. -
ప్రతిభా భారతిపై టీడీపీ నేతల తిరుగుబాటు
సాక్షి, శ్రీకాకుళం : మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ ప్రతిభా భారతికి టీడీపీలో ఎదురుగాలి వీస్తోంది. ఆమెపై సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటు మొదలైంది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జ్గా ప్రతిభా భారతిని తొలగించాలంటూ రాజాంలోని ఓ రిసార్ట్‌లో టీడీపీ ఎంపీపీలు, జేడ్పీటీసీలు సమావేశమయ్యారు. ఇన్చార్జ్ బాధ్యతల నుంచి ప్రతిభా భారతిని తొలగించాలని, ఆమె నిర్వహించే సమావేశాలను బహిష్కరించాలని వారు ఈ భేటీలో తీర్మానం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిభా భారతికి టికెట్ ఇస్తే.. సహాయనిరాకరణ చేస్తామని టీడీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు హెచ్చరిస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావే తన వర్గాన్ని ప్రతిభా భారతికి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబును కలిసి ప్రతిభా భారతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని కళా వర్గీయులు భావిస్తున్నారు. -
ఫోన్లు చేసి మరీ పింఛన్లు ఆపేస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, పెద్దాపురం: రాష్ర్టంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన హోంమంత్రి నియోజకవర్గంలో ఆరు హత్యలు చోటుచేసుకోవడం టీడీపీ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. మిగతా పార్టీలకు అనుకూలంగా ఉన్నారన్న కారణంతో పేదలకు రావాల్సిన పింఛన్లు సైతం ఫోన్లు చేసి అడ్డుకుంటారని హోం మంత్రి చినరాజప్పపై వైఎస్ జగన్ పరోక్షంగా ఆరోపణలు చేశారు. 220వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో బుధవారం వైఎస్ జగన్ బహిరంగ సభ నిర్వహించారు. పెద్దాపురంలోని వేములవారి సెంటర్లో జరిగిన ఈ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం నిర్మాణ ప్రక్రియ శరవేగంగా సాగిందనీ, చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా పునాది గోడలు కూడా పూర్తికాలేదని ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు పోలవరం కాంట్రాక్టులు కట్టబెట్టి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. కాంట్రాక్టర్లతో లెక్కలు తేల్చుకోవడానికే ప్రతీ సోమవారం చంద్రబాబు పోలవరం పర్యటన చేస్తారని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే సున్నా వడ్డీ రుణాలను పునరుధ్దరిస్తామని అన్నారు. ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడికి ఇల్లు కటిస్తామనీ, ఆ ఇళ్లను అక్కాచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని అన్నారు. ప్రతి మహిళా లక్షాధికారి కావాలనే వైఎస్సార్ కలను నిజం చేస్తామని ఉద్ఘాటించారు. చెరువులను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు.. ‘నాలుగేళ్ల చంద్రబాబు పాలన అవినీతిమయం, మోసాలతో ముగిసింది. మట్టి, ఇసుకతో సహా అన్నింటిలోను దోపిడీ చేశారు. నీరు-చెట్టు పథకం ద్వారా మట్టిని కూడా దోచేశారు. చెరువుల్లో పూడికతీత పేరుతో తాటి చెట్టులోతు తవ్వకాలు జరిపారు. యథేచ్చగా మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని విమర్శించారు. పేదలను కూడా వదలకుండా దోచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు. దివంగత నేత వైఎస్సార్ పేదల కోసం సేకరించిన స్థలాల్లో ఇప్పుడు బాబు అవినీతి ప్లాట్లు నిర్మిస్తామంటున్నారు. అడుగుకు రూ. వెయ్యి అయ్యే ప్లాటును బాబు 2వేల రూపాయలకు అమ్ముతాడట. మూడు లక్షలు అయ్యే ప్లాటును బాబు 6లక్షలకు అమ్ముతాడట. మూడు లక్షలు ప్రభుత్వం మాఫీ చేయగా.. మరో 3 లక్షలు పేద ప్రజలు 25 ఏళ్ల వరకూ చెల్లించాలట. మీకు ప్లాటు ఇస్తే కాదనకుండా బంగారంలా తీసుకోండి. అధికారంలోకి రాగానే ఆ డబ్బులను మాఫీ చేస్తాం. ఎన్నికల సమయంలో రూ. 87వేల 612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని బాబు హామీ ఇచ్చారు. కానీ టీడీపీ ప్రభుత్వం చెల్లించిన డబ్బుతో వడ్డీలు కూడా మాఫీ కాలేదు’ అని వైఎస్ జగన్ ఆరోపించారు. -
కన్నుమూసిన వారినీ కనికరించలేదు
పిఠాపురం: పచ్చటి బతుకులను కకావికలం చేసిన హుదూద్ తుపాను చివరికి కంకాళాల్నీ విడిచి పెట్టలేదు. రెచ్చిపోయిన ఆబోతులా.. నేలను పెళ్లగించి సమాధుల్లోని అస్థిపంజరాల్నీ పెకలించింది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సుబ్బంపేటలో ు ప్రత్యేకంగా శ్మశానం లేకపోవడంతో సముద్రతీరానికి సమీపంలోనే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. తుపాను ప్రభావంతో కడలి విరుచుకుపడడంతో పలు సమాధులు కొట్టుకుపోయి కంకాళాలు బయటపడ్డాయి. దీంతో ఆ ప్రాంతం భీతావహంగా ఉంది. అయినవారి అవశేషాలు ఇలా దిక్కులేనివిగా చెల్లాచెదురు కావడాన్ని చూసి గ్రామస్తులు వేదనకు గురవుతున్నారు.