
సాక్షి, అమరావతి : టీడీపీ అధినాయకత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. తన ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ టీడీపీలో చేరబోతుండటాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తాను టీడీపీలో ఉండగా కొండ్రు మురళీని పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరమేముందని ఆమె చంద్రబాబును ప్రశ్నించినట్టు తెలుస్తోంది. పార్టీ అవసరాల కోసమే కొండ్రు మురళీని టీడీపీలోకి తీసుకుంటున్నట్టు చంద్రబాబు ఆమెకు బదులిచ్చారు. ఆయన పార్టీలో చేరినా.. మీకు ప్రాధాన్యం తగ్గదని ప్రతిభా భారతికి నచ్చజెప్పేందుకు బాబు ప్రయత్నించినట్టు సమాచారం. కానీ, చంద్రబాబు తీరుపై ప్రతిభా భారతీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 6న కొండ్రు మురళీ టీడీపీలో చేరబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment