హుదూద్ బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ | YSRCP Support on Hudood victims | Sakshi
Sakshi News home page

హుదూద్ బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ

Published Fri, Oct 17 2014 3:08 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

హుదూద్ బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ - Sakshi

హుదూద్ బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ

 రాజాం: హుదూద్ బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు చెప్పారు.  పార్టీ శ్రేణులంతా తుపాను బాధితులకు సహాయ సహకారాలు అందించాలని సూచిం చారు. రాజాంలోని పార్టీ  కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. పార్టీ నేతలంతా గ్రామాల్లో పర్యటించి,  బాధితులను ఓదార్చి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పత్తి, జీడి, వరి, మామిడి, అరటి తోటలకు పెనునష్టం వాటిల్లిందని పలువురు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వీరందరికీ సముచిత రీతిలో నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వంతో చర్చిస్తామని ఎమ్మెల్యే బదులిచ్చారు. అధికారులు సక్రమం గా స్పందించకుంటే..చర్యలు తప్పవన్నారు. రాజాం జెడ్పీటీసీ సభ్యుడు టంకాల పాపినాయుడు,  కరణం సుదర్శనరావు,  శాసపు కేశవరావు, ముద్దాన బాబు, కెంబూరు సూర్యారావు, వంజరాపు విజయ్‌కుమార్, పాలవలస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement