రాజాం నగర పంచాయతీ పరిధిలో రేషన్ డిపోల ద్వారా ఆదివారం చేపట్టిన ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించిన
రాజాం రూరల్: రాజాం నగర పంచాయతీ పరిధిలో రేషన్ డిపోల ద్వారా ఆదివారం చేపట్టిన ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించిన తహశీల్దార్ రామకృష్ణపై రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మండి పడ్డారు. జేసీ వివేక్‌యాదవ్ ఈ నెల 10న రాజాం వచ్చి పంపిణీ ప్రారంభోత్సవానికి విధిగా ఎమ్మెల్యేను పిలవాలని సూచించారు. స్థానిక తహశీల్దార్ ప్రభుత్వాధికారిగా కాకుండా అధికార పార్టీగా తొత్తుగా వ్యవహరించి అధికార పార్టీ ఇన్‌చార్జ్ కావలి ప్రతిభాభారతితో కార్యక్రమం చేపట్టారు. ఆదివారం ఉదయం కూడా ఎమ్మెల్యేను పిలవలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో మొక్కుబడిగా పిలవడంతో ఎమ్మెల్యే జోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.