Proto Call
-
ఎర్రకోట వేదికగా కేంద్రం రాహుల్ గాంధీని అవమానించిందా?
ఢిల్లీ : ఎర్రకోట వేదికగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరుదైన ఘనత సాధించారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి కేంద్రం సరైన గౌరవం ఇవ్వలేదనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడకలకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే రాహుల్ గాంధీ చివరి వరుసలో ఒలింపిక్ పతక విజేతలతో కలిసి కూర్చున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.తెల్లటి కుర్తా-పైజామా ధరించిన రాహుల్ గాంధీ భారత హాకీ జట్టు ఫార్వర్డ్ గుర్జంత్ సింగ్ పక్కన కూర్చున్నట్లు కనిపించారు. ముందు వరుసలో ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, సరబ్జోత్ సింగ్ ఉన్నారు. ఒలింపిక్ కాంస్య విజేత హాకీ జట్టు సభ్యులు, ఆ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్,పీఆర్ శ్రీజేష్ కూడా రాహుల్ కంటే ముందు భాగంలో కూర్చున్నారు.For first time in 10yrs a leader of opposition attended the Independence Day celebrations in Delhi, but he wasn't offered the front row seat as per protocol@RahulGandhi was made to sit in 2nd last row behind Olympians, even though the Leader of opposition rank is equivalent to… pic.twitter.com/7tF9GZsUTe— Nabila Jamal (@nabilajamal_) August 15, 2024 ప్రోటోకాల్ ప్రకారం, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడికి, క్యాబినెట్ మంత్రికి సమానమైన ర్యాంక్ ఉన్నవారికి ఎల్లప్పుడూ ముందు వరుసలో సీటు కేటాయించబడుతుంది. ముందు వరుసలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్,అమిత్ షా,ఎస్ జైశంకర్ ఉన్నారు.స్పందించిన కేంద్రం రాహుల్ గాంధీ సీటింగ్ ఏర్పాటుపై సోషల్ మీడియాలో చర్చలు జరగడంతో, ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలు కేటాయించడంతో రాహుల్ గాంధీ సీటును వెనక్కి మార్చాల్సి వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం, సీటింగ్ ప్లాన్లను రూపొందించడం రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యత.అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనూఅటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనూ.. ఆ తరువాత బీజేపీ హయాంలోనూ.. అప్పటి లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సోనియా గాంధీకి ఎప్పుడూ మొదటి వరుసలో సీటు కేటాయించడం జరిగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి స్థానం 2014 నుంచి ఖాళీగానే ఉంది. ఎందుకంటే దిగువ సభ బలంలో పదో వంతు మెజారిటీని ఏ పార్టీ సాధించడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలను కైవసం చేసుకుంది. అంతకు ముందు ఎన్నికల్లో అంటే 2014, 2019 ఎన్నికలలో 543 మంది సభ్యుల సభ కాంగ్రెస్ వరుసగా 44,52 స్థానాలను గెలుచుకుంది. దీంతో దశాబ్ధ కాలం పాటు ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి తగ్గలేదు. మొత్తానికి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. అయినా సరే..రాహుల్ సీటును ఎన్డీఏ చివరి వరుసలో ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్న కోమటిరెడ్డి
-
సరుకుల పంపిణీలో ప్రోటోకాల్ ఉల్లంఘన
రాజాం రూరల్: రాజాం నగర పంచాయతీ పరిధిలో రేషన్ డిపోల ద్వారా ఆదివారం చేపట్టిన ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించిన తహశీల్దార్ రామకృష్ణపై రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మండి పడ్డారు. జేసీ వివేక్‌యాదవ్ ఈ నెల 10న రాజాం వచ్చి పంపిణీ ప్రారంభోత్సవానికి విధిగా ఎమ్మెల్యేను పిలవాలని సూచించారు. స్థానిక తహశీల్దార్ ప్రభుత్వాధికారిగా కాకుండా అధికార పార్టీగా తొత్తుగా వ్యవహరించి అధికార పార్టీ ఇన్చార్జ్ కావలి ప్రతిభాభారతితో కార్యక్రమం చేపట్టారు. ఆదివారం ఉదయం కూడా ఎమ్మెల్యేను పిలవలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో మొక్కుబడిగా పిలవడంతో ఎమ్మెల్యే జోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
ప్రొటోకాల్‌ను మంటగలుపుతారా..?
సాలూరు: రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఒకటైన ప్రోటోకాల్‌ను గౌరవించరా..? మాజీ ఎమ్మెల్యే అయిన మీకు ప్రోటోకాల్ వర్తించదన్న విషయం తెలియ దా..?, అంటూ సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పీడిక రాజన్నదొర, అధికార పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భ ంజ్దేవ్ను నిలదీశారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా కనిపించిన ప్రోటోకాల్ ఉల్లంఘన వ్యవహారంపై భంజ్‌దేవ్, రాజన్నదొర మంగళవారం ఒకే వేదికపైకి రావడంతో బాహాటంగానే వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది. స్థానిక ఏడీఏ కార్యాలయం వద్ద రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే రాజన్నదొరను వేదిక మీదకు ఆహ్వనించిన జేడిఏ ప్రమీల ఆతర్వాత మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ను ఆహ్వనించడంతో రాజన్నదొర అభ్యంతరం తెలిపారు. పోటోకాల్ లేని వ్యక్తులను వేదికపైకి పిలవకండని జేడీకి సూచించారు. దీంతో కలుగజేసుకున్న భంజ్‌దేవ్ ప్రోటోకాల్ మెయింటెయిన్ చేయాల్సింది అధికారులని, ఈవిషయంపై వారినే ప్రశ్నించండని బదులిస్తూనే వేదికపై ఆశీనులయ్యారు. అనంతరం ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ ప్రోటోకాల్ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని పాటించకపోతే రాజ్యాంగం, శాసనసభ, చట్టం కల్పించిన హక్కులు దండగేనన్నారు. ఈ విషయంలో కలెక్టర్‌కు, స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని వెంగళరాయసాగర్ జలాశయం పరిధిలోని గోముఖి రెగ్యులేటర్ పనులతోపాటు, పాచిపెంటమండలంలోని రోడ్డు మరమ్మతుల పనులకు శంకుస్థాపనలు చేయడం ప్రోటోకాల్ ఉల్లంఘన కాదంటారా? అని ప్రశ్నించారు. అనంతరం భంజ్‌దేవ్ మాట్లాడుతూ తాము శంకుస్థాపనలు చేసిన పనులకు అనుమతులు రాలేదన్నారు. కానీ గోముఖి రెగ్యులేటర్ ఆయకట్టు రైతులకు నష్టం జరగకూడదని, పాచిపెంట మండలంలో రాకపోకలకు అంతరాయం కలగకూడదని భావించి సంబంధిత కాంట్రాక్టర్లను ఒప్పించి, నిధులు తర్వాత మంజూరవుతాయని చెప్పి పనులను ప్రారంభించేలా చేశామని వివరణ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడానికి మరో నెలా15రోజులు పడుతుందని, తర్వాత ప్రోటోకాల్ అమలు చేస్తారని సమాధానమిచ్చారు. దీంతో కలుగజేసుకున్న రాజన్నదొర బహిరంగంగా పనులు ప్రారంభించేటపుడు ప్రోటోకాల్ తప్పనిసరి అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఒక్క ఎమ్మెల్యే చేసేదేమీ ఉండదని, అందరం కలిసికట్టుగా పనిచేసి, ప్రజలకు మేలు చేద్దామని కోరుతున్నానన్నారు. వీరి వాగ్వాదం తారస్థాయికి చేరడంతో అధికారులు, ఇతర నాయకులు జోక్యం చేసుకుని సద్దుమణిగేలా చేశారు. వ్యవసాయ ఉపకరణాల పంపిణీ స్థానిక ఏడీఏ కార్యాలయంవద్ద సాలూరు, పాచిపెంట, రామభద్రపురం మండలాలకు చెందిన 14 రైతు సంఘాలకు దాదాపు కోటి రూపాయల విలువచేసే టైరు బండ్లు, ట్రాక్టర్లను ఎమ్మెల్యే రాజన్నదొర మంగళవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో పట్టాలు పొందిన రైతులకు న్యాయం జరగడంలేదన్నారు. కౌలు రైతులకు నేరుగా పరిహారం అందించే పరిస్థితి లేదన్నారు. అనంతరం జేడీఏ మాట్లాడుతూ ఎమ్మెల్యే చెప్పింది నిజమేనని అంగీకరించారు. వేర్వేరు సర్వే నంబర్ల భూముల్లో పంట నష్టం జరిగినా, ఒకే సర్వే నంబరును మాత్రమే సాఫ్ట్వేర్ గుర్తించిందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ మాట్లాడుతూ రైతులందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు గుమ్మిడి సంద్యారాణి, ఎంపీపీ బోను ఈశ్వరమ్మ, పీఏసీఎస్ అధ్యక్షుడు రెడ్డి సురేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కాకి రంగ, లయన్స్‌క్లబ్ చైర్మన్ అభ్యర్థి గొర్లె మాధవరావు తదితరులు పాల్గొన్నారు.