రాజాం (శ్రీకాకుళం) : ఓ వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటూ శ్రీకాకుళం జిల్లా రాజాం సబ్‌రిజిస్ట్రార్ పట్టుబడ్డారు. వివరాల ప్రకారం... రాజాం పట్టణానికి చెందిన వైకుంఠం రాంబాబు బ్యాంకులో గృహ రుణం తీసుకున్నారు. ఆ రుణ వాయిదాలు చెల్లింపు నాలుగు నెలల క్రితం పూర్తయింది. దీంతో ఆయన గృహ తనఖా రద్దు కోసం సబ్ రిజిస్ట్రార్ సతివాడ తవిటయ్యను ఆశ్రయించారు. అయితే ఆయన రూ.10 వేలు ఇస్తేనే పని అవుతుందంటూ మూడు నెలలుగా తిప్పుకుంటున్నారు.
చివరికి రూ.4 వేలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులకు ఉప్పందించారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ సహాయకుడు వెంకటరమణకు రూ.4 వేలు అందిస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌తోపాటు సహాయకుడిని విచారిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ రంగరాజు వెల్లడించారు.
ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్
Published Tue, Sep 15 2015 4:57 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement