ఓ భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.60 వేలు లంచం తీసుకుంటున్న నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ కె.మోహన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్ టౌన్ : ఓ భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.60 వేలు లంచం తీసుకుంటున్న నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ కె.మోహన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే.. సారంగాపూర్ మండలం కంకేట గ్రామానికి చెందిన శ్రీనివాసరావు బిక్కునూరు మండలంలో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.
అయితే ఈ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్ట్రార్ లంచం డిమాండ్ చేయగా, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం శ్రీనివాసరావు నుంచి సబ్ రిజిస్ట్రార్ మోహన్ రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.