రూ.7 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
తూప్రాన్‌లో కలకలం
తూప్రాన్, న్యూస్‌లైన్:
లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఘటన తూప్రాన్ మండలంలో కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ సంజీవరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూప్రాన్‌లోని సబ్‌రిజిష్టర్ కార్యాలయంలో ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా సయ్యద్ నసీరుద్దీన్‌రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే చేగుంటకు చెందిన జంగాల మల్లేశం అనే వ్యక్తి తూప్రాన్‌లో 150 గజాల ఖాళీ స్థలాన్ని ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ నెల 25న రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ పత్రాలను గమనించిన నసీరుద్దీన్ ఈ డాక్యుమెంటులో సర్వే నంబర్‌లేదని రిజిస్ట్రేషన్ చేయడానికి నీరాకరించారు. ఈ విషయంపై మల్లేశం వేడుకోవడంతో రూ.10 వేల రూపాయాలు ఇస్తే ఇంటి నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పాడు. అంత డబ్బు తాను ఇచ్చుకోలేనని చెప్పగా రూ.7 వేల రూపాయలైనా ఇవ్వాలన్నారు. కాగా మల్లేశం ఈ విషయమై సంగారెడ్డిలోని ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
ఏసీబీ అధికారుల పథకం ప్రకారం..రూ.7 వేలను ఇచ్చేందుకు సబ్ రిజిస్ట్రార్ నసీరుద్దీన్ వద్దకు వెళ్లాడు. అయితే కార్యాలయంలో ఎక్కువ మంది ఉండడంతో సీహెచ్.మోహన్ అనే వ్యక్తి(సబ్ రిజిస్ట్రార్ నియమించుకున్న)కి డబ్బు ఇవ్వాల్సిందిగా సూచించారు. మోహన్‌కు డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సయ్యద్ నసీరుద్దీన్, మోహన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7 వేలతోపాటు రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్డులో వీరిని హాజరుపరుచనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు నిజామాబాద్ సీఐ.వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, వాహబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 9440446155 నంబర్‌ను సంప్రదించాలన్నారు. అంచం ఇచ్చి ఆత్మ వంచన చేసుకోవద్దని సూచించారు.
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
Published Mon, Jan 27 2014 11:25 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement