అస్తవ్యస్త పాలన సాగిస్తూ ప్రజావ్యతిరేకతను మూటగట్టుకొని మునిగిపోయే దిశలో ఉన్న టీడీపీ నావలోకి ఎవరెక్కుతారని
రాజాం: అస్తవ్యస్త పాలన సాగిస్తూ ప్రజావ్యతిరేకతను మూటగట్టుకొని మునిగిపోయే దిశలో ఉన్న టీడీపీ నావలోకి ఎవరెక్కుతారని వైఎస్సా ర్ సీపీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఎద్దే వా చేశారు. రాజాంలోని ఆయన నివాస గృ హంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు, గద్దెనెక్కిన తర్వాత ఒక్క హామీని నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవంటూనే పుష్కరాలు, చంద్రన్నకానుకులు తదితర వాటికి దుబారా ఖర్చులు చేసి కోట్లాది రూపాయలు వెనుకేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయిన చంద్రబా బు వారి దృష్టిని మరల్చడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ వారి పార్టీలో చేర్చుకునే దిగజారుడు రాజకీయాలకు తెరలేపారన్నారు.
దమ్ముంటే ఇప్పటివరకూ చేర్చుకు న్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి, ఎన్నికల్లో గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రజ లు కోరుకుంటున్నారని, భవిష్యత్తు వైఎస్సార్ సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశం లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, కరణం సుదర్శనరావు, లావేటి రాజగోపాలనాయుడు, పారంకోటి సుధ, వంజరాపు విజయకుమార్, బండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.