ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా రాజాంలో శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.
చెరువులో పడి వ్యక్తి మృతి
Published Sat, Jan 2 2016 10:18 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
రాజాం: ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా రాజాంలో శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. సాలూరుకు చెందిన బోనెల రామస్వామి(55) రాజాం మారుతీనగర్‌లో ఉంటున్న తన కొడుకు వద్దకు వచ్చాడు. ఈ రోజు తెల్లవారుజామున మారుతీ నగర్ కాలనీకి సమీపంలో ఉన్న కొత్త చెరువు వద్దకు వెళ్లిన రామస్వామి ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతి చెందాడు. ఇది గుర్తించిన స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.
Advertisement
Advertisement