ఖమ్మం: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట శివారులో ఓ చెరువులో పడి వీరవల్లి వెంకటేశ్వరరావు(38) అనే వ్యక్తి మృతిచెందాడు. వెంకటేశ్వరరావుకు మద్యం సేవించే అలవాటుందని, ప్రమాదవశాత్తూ చెరువులో జారిపడి ఉండవచ్చునని గ్రామస్తులు తెలిపారు. చెరువు నుంచి మృతదేహాన్నిబయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.