జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, 16 మంది గాయాల పాలయ్యారు. మృతులిద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
Published Sat, Sep 14 2013 5:13 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, 16 మంది గాయాల పాలయ్యారు. మృతులిద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.
రాజాం రూరల్, న్యూస్‌లైన్: స్థానిక పాలకొండ రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వాహనం ఢీకొని ఒక వ్యక్తి (35) మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలియలేదు. రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని వాహనం ఢీకొనడంతో పడిపోయాడని, వాహన చోదకులు బాధితుడిని పరిశీలించి కొనఊపిరితో ఉండడం గమనించి భయంతో రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారని అక్కడ ఉన్న ఆనవాళ్లను బట్టి పోలీసులు భావిస్తున్నారు. తర్వాత ఆ మార్గంలో వచ్చిన వారు చూసి 100 నంబరుకు ఫోన్ చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారని సంతకవిటి ఎస్సై ఎ.నాగేశ్వరరావు తెలిపారు. బాధితుడిని 108 వాహనంలో రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ గార రవిప్రసాద్ పరిశీలించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. శుక్రవారం ఉదయం పోలీసులు మృతుడి ఫోటోలు తీసి గుర్తింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. మృతుడి వంటిపై నీలం రంగు జీన్ ఫ్యాంట్, పసుపు రంగుపై అడ్డంగా తెలుపు గీతలు ఉన్న టీషర్టు ఉన్నాయి. కుడి చేయి మణికట్టుపైన గౌరమ్మ, తవిటియ్య అనే పేర్లతో పచ్చబొట్టు ఉందని, మెడలో నల్లపూసల దండ, ఎడమ చెవికి బంగారం పోగు ఉన్నాయని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
రైలు కిందపడి వ్యక్తి మృతి
పలాస : బారువా-సోంపేట రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (30) గుర్తు తెలియని రైలు కింద పడి మృతి చెందినట్లు కాశీబుగ్గ రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ సీహెచ్ సత్యనారాయణ తెలిపారు. మృతుడి వంటిపై ఎరుపు, తెలుపు, నలుపు రంగు గీతలు గల ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ఉన్నాయన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్‌సీ సత్యనారాయణ తెలిపారు.
జీపు బోల్తా - 13 మందికి తీవ్ర గాయాలు
మందస : హరిపురం సమీపంలో గల పాత జాతీయ రహదారిపై శుక్రవారం జీపు బోల్తా పడిన సంఘటనలో 14 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, క్షతగాత్రులు తెలిపిన సమాచారం ప్రకారం... సోంపేట వైపు నుంచి హరిపురం మీదుగా పలాస వైపు వెళుతున్న ఓ దినపత్రికకు సంబందించిన మహేంద్ర జీపును డ్రైవర్ అతి వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని తెలిసింది. హరిపురం వద్ద జీపు అకస్మాత్తుగా రోడ్డుపై తిరగబడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొల్లి వరలక్ష్మి(మామిడిపల్లి) అప్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. మామిడిపల్లి గ్రామానికి చెందిన భార్యా భర్తలు మజ్జి చిరంజీవులు, మజ్జి కృష్ణవేణి, పి.లక్ష్మీనారాయణ (ఎర్రముక్కాం), బుడతా చంద్రావతి (కొర్లాం), కె.పద్మావతి (రాణిగాం), కర్రి సుజాత (బారువ), నాగవరపు శ్రీరాములు (రణస్థలం), బూరగాన శ్రీదేవి (తాళ్ళబద్ర), శ్యామల, సుహాసిని, పద్మతో పాటు జీపు డ్రైవర్ షేక్ సర్దార్(చీపురుపల్లి)కి తీవ్రగాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారులు ప్రాథమిక చికిత్స అనంతరం పలాస సీహెచ్‌సీకి తరలించారు. బాధితుల్లో వరలక్ష్మి, చంద్రావతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ ఎల్.చంధ్రశేఖర్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో ఇద్దరికి....
మందస : చాపరాయి సమీపంలో ద్విచక్రవాహనం గెడ్డలో పడిపోవడంతో మఖరజోల గ్రామానికి చెం దిన ఇద్దరు గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్రవాహనంపై బమ్మిడి కృష్ణారావు, తమ్మినాన అప్పారావు పట్టులోగాం వెళ్ళి వస్తండగా అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులన హరిపురం ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. వైద్యాధికారులు ప్రధానో, టి.పాపినాయుడు వైద్యసేవలందించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్టణం కేజీహెచ్‌కు తరలించారు.
Advertisement
Advertisement