14 అడుగుల రక్తపింజరి హతం | 14 ft Bloody snake death | Sakshi

14 అడుగుల రక్తపింజరి హతం

Jun 20 2018 8:21 AM | Updated on Jun 20 2018 8:21 AM

14 ft Bloody snake death - Sakshi

రాజాం/సంతకవిటి: సంతకవిటి మండలం గరికిపాడు పంచాయతీలోని బూరాడవాని చెరువులో మంగళవారం రక్తపింజరి పాము అలజడి సృష్టించింది. ఉపాధి పనుల్లో భాగంగా వేతనదారులు రెల్లపొదలను తొలగిస్తుండగా సుమారు 14 అడుగుల భారీ సర్పం బుసలు కొడుతూ బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా వారంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు. కొంతమంది ధైర్యంతో ముందుకెళ్లి పామును గునపాలు, కర్రలతో హతమార్చారు. అదే ప్రాంతంలో ఏడు గుడ్లు, రెండు పాము పిల్లలు లభ్యమయ్యాయి. వీటిని కూడా వేతనదారులు ధ్వంసం చేశారు. ఈ భారీ సర్పాన్ని చూసేందుకు చాలా మంది తరలివచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement