పుణే: భారత క్రికెటర్ కేదార్ జాదవ్ ఆటకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన కేదార్ ... ఎమ్మెస్ ధోని శైలిలో తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. ‘నా కెరీర్‌లో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. 1500 గంటల సమయం నుంచి నేను రిటైర్ అయినట్లుగా గుర్తించగలరు’ అని ట్వీట్ చేశాడు. మహారాష్ట్రకు చెందిన కేదార్ 2014లో భారత్ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
73 వన్డేల్లో 42.09 సగటుతో 2 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు సహా 1389 పరుగులు చేశాడు. 9 టి20ల్లో 122 పరుగులు సాధించాడు. తన ‘స్లింగ్’ తరహా ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌తో అతను 27 వికెట్లు కూడా పడగొట్టాడు. కేదార్ అత్యుత్తమ ప్రదర్శన సొంతగడ్డ పుణేలో వచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో అతను 76 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్స్‌లో అజేయంగా 120 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 2019 వన్డే వరల్డ్ కప్ ఆడిన అతను చివరిసారిగా 2020లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో కేదార్ ఢిల్లీ, కొచ్చి, చెన్నై, హైదరాబాద్ జట్ల తరఫున ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment