
వచ్చే నెలలో ఇర్ఫాన్ పెళ్లి!
భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ త్వరలోనే పెళ్లి కొడుకు కానున్నాడు...
బరోడా: భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ త్వరలోనే పెళ్లి కొడుకు కానున్నాడు. ‘ఫిబ్రవరిలో నా పెళ్లి జరగనున్న మాట వాస్తవం. ఇతర వివరాలు తర్వాత చెబుతాను’ అని ఇర్ఫాన్ వివాహ విషయాన్ని ధ్రువీకరించాడు. ఫిబ్రవరి నెల మొదటి లేదా రెండో వారంలో అతడి పెళ్లి వేడుక ఉంటుందని, ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని కుటుంబ సన్నిహితులు చెప్పారు. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమని, అమ్మాయి పేరు సఫా అని వారు వెల్లడించారు.