భారత అప్‌కమింగ్ మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ అరుదైన ఘనత సాధించింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా (పురుషుల లేదా మహిళల క్రికెట్) రికార్డుల్లో నిలిచింది. ఇటీవల ముగిసిన మహిళల ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన శ్రేయాంక.. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడనప్పటికీ సీపీఎల్ ఆడే జాక్‌పాట్ కొట్టేసింది.
సీపీఎల్‌లో గయానా అమెజాన్ వారియర్స్ ఫ్రాంచైజీ శ్రేయాంకతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, భారత పురుషుల క్రికెటర్ల తరహాలో మహిళా క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనడంపై ఎలాంటి అంక్షలు లేవు. గతంలో భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధన, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్, ఇంగ్లండ్ హండ్రెడ్ టోర్నీల్లో పాల్గొన్నారు. అయితే ఏ భారత క్రికెటర్ సీపీఎల్‌లో మాత్రం ఆడింది లేదు. తాజాగా శ్రేయాంకకు మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది.
20 ఏళ్ల స్పిన్ అల్‌రౌండర్ అయిన శ్రేయాంక.. మహిళ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అనంతరం జరిగిన ఏసీసీ మహిళల ఎమర్జింగ్ టీమ్స్ కప్‌లో సత్తా చాటి (ప్లేయర్ ఆఫ్ ద సిరీస్) లీగ్ క్రికెట్‌లో విదేశీ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శించింది. త్వరలో ప్రారంభంకానున్న సీపీఎల్‌లో శ్రేయాంక.. స్టెఫానీ టేలర్ నేతృత్వంలో గయానా ఆమెజాన్ వారియర్స్‌కు ఆడనుంది.
శ్రేయాంకతో పాటు ఆమె ఆర్సీబీ సహచరిణులైన సుజీ బేట్స్, సోఫీ డివైన్‌లను కూడా ఆమెజాన్ వారియర్స్ ఎంపిక చేసుకుంది. లెజెండరీ సౌతాఫ్రికా పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ కూడా ఆమెజాన్ వారియర్స్‌కు ఆడనుంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్.. ఆగస్ట్ 31న మొదలై సెప్టెంబర్ 10 వరకు సాగనుంది. ఈ లీగ్‌లో మొత్తం 3 జట్లు పాల్గొంటాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment