షమీ శివలింగా ట్వీట్‌.. నెటిజన్ల ఫైర్‌ | Mohammed Shami Trolled For New Year Photo, Deletes It | Sakshi
Sakshi News home page

షమీ శివలింగా ట్వీట్‌.. నెటిజన్ల ఫైర్‌

Published Fri, Jan 5 2018 7:58 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

Mohammed Shami Trolled For New Year Photo, Deletes It - Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. కొత్త సంవత్సరం సందర్భంగా షమీ చేసిన ట్వీట్‌పై సోషల్‌ మీడియా వేదికగా దుమారం రేగింది. ఇది గుర్తించిన షమీ వెంటనే తన ట్వీట్‌ను తొలిగించాడు. అభిమానులనుద్దేశించి ‘నూతన సంవత్సరంలో మీకు, మీ కుటుంబాలకు అన్ని శుభాలే జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. అందరికీ హ్యాపీ న్యూఇయర్‌ అని’ పూలతో అలంకరించిన శివలింగా ఫొటోను ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌పై ముస్లిం వర్గానికి చెందిన అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఇస్లాంకు వ్యతిరేకమని ఘాటుగా స్పందించారు. ఇక షమీపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు రావడం ఇది తొలిసారేం కాదు. గతంలో తన కూతురి పుట్టిన రోజు సందర్భంగా చేసిన ట్వీట్‌పై సైతం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లాంలో పుట్టినరోజు సంబరాలు చేసుకోరని ఫైర్‌ అయ్యారు. తన సతీమణి, కూతురితో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోపై కూడా విమర్శలొచ్చాయి. షమీ భార్య దుస్తులను ప్రస్తావిస్తూ.. ముస్లిమై బుర్ఖా ధరించకపోవడం ఏమిటని ట్రోల్‌ చేశారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement